Akhanda 2 Day 9 Collections: భారీగా క్షీణించిన అఖండ 2 కలెక్షన్స్... 9వ రోజు బాలయ్య మూవీకి ఎన్ని కోట్లంటే?

బోయపాటి శ్రీను- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 12న అఖండ 2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించారు.

బజరంగీ భాయిజాన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలకపాత్ర పోషించారు. కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేయగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో అఖండ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు బాలయ్య సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే...

Akhanda 2 Day 9 Box Office Collections Worldwide Balakrishna s Movie struggling at ticket windows

అఖండ 2 బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్‌ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. అఖండ క్రేజ్, బాలయ్య ఛరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు, సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయలు, నైజాంలో 30 కోట్ల రూపాయలు మేర బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అఖండ 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్
అలాగే కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో 11 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 15 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 103 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ కావాలంటే 104 కోట్ల రూపాయల షేర్, 208 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు. అఖండ 2 సినిమాను వరల్డ్ వైడ్‌గా 2200 థియేటర్స్‌లో విడుదల చేశారు.

అఖండ 2 ఎనిమిది రోజుల కలెక్షన్స్
అఖండ 2కు పెయిడ్ ప్రీమియర్స్‌లో 8 కోట్ల రూపాయలు, తొలిరోజున 22.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 15.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 15.1 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.25 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.25 కోట్ల రూపాయలు, ఆరో రోజున 3.3 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.85 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 1.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 8 రోజుల వరకు బాలయ్య మూవీకి ఇండియాలో 78 కోట్ల రూపాయల నెట్.. 93 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

అఖండ 2 తొలి వారం ఇండియా వైడ్‌గా 90.85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటకలో 9.68 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.02 కోట్ల రూపాయలు, కేరళలో 16 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 1.99 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య మూవీకి పెయిడ్ ప్రీమియర్స్‌కు 8 కోట్ల రూపాయలు, తొలి రోజున 21.95 కోట్ల రూపాయలు, రెండో రోజున 14.85 కోట్ల రూపాయలు, మూడో రోజున 14.45 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 4.95 కోట్ల రూపాయలు, ఐదో రోజున 3.8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 2.9 కోట్ల రూపాయలు, ఏడో రోజున 2.45 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 1.68 కోట్ల రూపాయలు చొప్పున 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల వారీగా అఖండ 2 కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 17.13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 10.85 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.02 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 3.86 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 2.89 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.08 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.35 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.52 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అఖండ 2 చిత్రం ఇప్పటి వరకు కర్ణాటకలో 9.88 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 75.75 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.04 కోట్ల రూపాయలు, కేరళలో 16 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 2.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఓవర్సీస్‌ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నార్త్ అమెరికాలో శుక్రవారం 12.5K డాలర్లు (భారత కరెన్సీలో 11.19 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. శుక్రవారం వరకు అందిన సమాచారం ప్రకారం నార్త్ అమెరికాలో అఖండ 2కు 933K డాలర్లు (భారత కరెన్సీలో 8.35 కోట్ల రూపాయలు) రాబట్టింది. మిగిలిన దేశాలలో బాలయ్య మూవీకి 3.50 కోట్ల రూపాయల వరకు వచ్చింది. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో అఖండ 2కు 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

9వ రోజు అఖండ 2 కలెక్షన్స్
అఖండ 2 మూవీకి బాలీవుడ్‌ నుంచి దురంధర్, ఇటీవల రిలీజైన జేమ్స్ కామెరాన్‌ల అవతార్ 3 నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దాంతో వసూళ్లు పడిపోతూనే ఉన్నాయి. శనివారం కావడంతో బుకింగ్స్ ఓ మోస్తారుగా పెరగడంతో 9వ రోజు ఇండియాలో ఓవరాల్‌గా 29.65 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 9వ రోజు అఖండ 2 మూవీకి ఇండియాలో 2.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో ఈ సినిమాకు 95.85 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి అఖండ 2 సినిమాకు 9 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 107.85 కోట్ల రూపాయలు వసూలైంది. బాలయ్య సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద మరో 42 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X