twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda ఓటీటీలో సరికొత్త చరిత్ర సృష్టించిన అఖండ.. బాలీవుడ్ హీరోల రికార్డులు బాలయ్య బ్రేక్

    |

    నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ అటు థియేటర్‌లోను, ఇటు ఓటీటీలోను చరిత్ర సృష్టిస్తున్నది. అనేక ప్రతికూలతల మధ్య డిసెంబర్ 2 తేదీన రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గత 7 వారాలుగా థియేటర్లో హంగామా సృష్టించింది. ఓ పక్క థియేట్రికల్ రన్‌లో రికార్డుల క్రియేట్ చేసిన అఖండ ప్రస్తుతం ఓటీటీలో కూడా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. బాలకృష్ణ సృష్టిస్తున్న ప్రభంజనం గురించిన వివరాల్లోకి వెళితే..

     200 కోట్ల వసూళ్లతో రికార్డు

    200 కోట్ల వసూళ్లతో రికార్డు

    ఏపీలో టికెట్ రేట్ల వివాదం నడుమ విడుదలైన అఖండ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 62.91 కోట్ల నికర వసూళ్లను, 104.57 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 74.67 కోట్ల షేర్‌ను, 132.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ రెవెన్యూతో కలిపి అఖండ 200 కోట్లకుపైగా ఆదాయాన్ని సొంతం చేసుకొన్నది.

    ఓటీటీలో అఖండ‌కు భారీ డిమాండ్

    ఓటీటీలో అఖండ‌కు భారీ డిమాండ్

    అఖండ చిత్రం ఓటీటీ రైట్స్ విషయంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో రికార్డును క్రియేట్ చేసింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకు దక్కని విధంగా అఖండకు సుమారుగా 65 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగిందనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. థియేటర్‌లో ప్రదర్శనలు కొనసాగుతుండగానే ఓటీటీలో జనవరి 21వ తేదీన రిలీజైన విషయం తెలిసిందే.

     24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్

    24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్

    అఖండ జనవరి 21న రిలీజై ఓటీటీలో జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు రిలీజైన అఖండ చిత్రం 24 గంటల్లోగా 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ప్రేక్షకులు వీక్షించినట్టు సమాచారం. ఇది దేశవ్యాప్తంగా ఓటీటీ హిస్టరీలోనే ఒక రికార్డుగా చెప్పుకొంటున్నారు.

     తెలుగు సినిమాగా చరిత్ర

    తెలుగు సినిమాగా చరిత్ర

    దేశవ్యాప్తంగా ఓటీటీ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఏ హీరోకు దక్కని ఘనత నందమూరి బాలకృష్ణకు దక్కినట్టు ఓటీటీ వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోని సినిమాలను పరిగణనలోకి తీసుకొంటే.. అఖండ చిత్రం హెయ్యెస్ట్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఓటీటీలో ఉన్న రికార్డులన్నింటిని తుడిచి వేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    బాలీవుడ్ హీరోల రికార్డులను బ్రేక్ చేసిన బాలకృష్ణ

    బాలీవుడ్ హీరోల రికార్డులను బ్రేక్ చేసిన బాలకృష్ణ

    దేశీయ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ నుంచి చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే బాలీవుడ్ హీరోల సినిమాల కంటే అఖండ రికార్డు స్థాయి వ్యూస్ సాధించిందనే విషయాన్ని డీస్నీ+హాట్ స్టార్ వర్గాలు వెల్లడించాయి. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్‌ రెస్పాన్స్ రావడంపై ఓటీటీ వర్గాలు ఓ రకమైన ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. రానున్న రోజుల్లో ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    Akhanda emerged highest viewed movie on OTT, Reports suggested that Nandamuri Balakrishna smashes all records on Disney+Hotstar OTT. Its has registered 1 million views on OTT in 24 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X