Don't Miss!
- News
ముఖ్యమంత్రి జగన్‌కు ఎమ్మెల్యేల షాక్! ఎమ్మెల్యేలకు జగన్ బంపర్ ఆఫర్!!
- Sports
Bumrah On Fire: బుల్లెట్టు బంతులు వేసేత్త పా బూమ్ బూమ్ బూమ్ బూమ్ అని..! వాన వల్ల బతికిపోయారు..
- Automobiles
కోట్లు ఖరీదు చేసే లాంబోర్ఘిని కారుతో మరో కాస్ట్లీ కారును ఢీకొట్టిన 10 ఏళ్ల బాలుడు!
- Technology
మే నెలలో 96 మిలియన్ల యూనిట్లకు పడిపోయిన SmartPhone విక్రయాలు!
- Finance
Lottery: నక్కతోక తొక్కిన ట్రక్ డ్రైవర్.. రూ. 7.50 కోట్లు తెచ్చిపెట్టిన లాటరీ టికెట్.. అదృష్టం..
- Lifestyle
పడక గదిలో మీ భర్త లేదా భార్య మీకు దగ్గరగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా?
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం
Akhanda TRP: బుల్లితెరపై కూడా బాలకృష్ణ అఖండ విజయం.. రికార్డు రేటింగ్‌తో..!
ఇటీవల కాలంలో బాక్సాఫీసు వద్ద మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా సినిమాల రికార్డులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. విడుదలకు ముందు విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల్లో ప్రతి చిన్న రికార్డు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా కూడా మొదటిసారి టీవీలో మంచి టీఆర్పీ సాదించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. మొదటిసారి అఘోరా పాత్రలో కనిపించిన బాలయ్య అభిమానులకు సరికొత్తగా పూనకాలు తెప్పించాడు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా దాదాపు డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా మంచి లాభాలను అందించింది.
దర్శకుడు బోయపాటి శ్రీను ఇదివరకే బాలకృష్ణ తో రెండు సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాడు. మొదటి సారి వీరి కలయికలో వచ్చిన సింహ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా అదే తరహాలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు అఖండ సినిమాతో ఈ ఇద్దరు కూడా వారి కెరీర్ లోనే బెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే కాకుండా బోయపాటి శ్రీను కెరీర్లో కూడా అఖండ సినిమా భారీ వసూళ్లను అందుకున్న సినిమాగా గుర్తింపు తీసుకువచ్చింది.

థియేటర్లో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చిన ఈ సినిమా బుల్లితెరపై కూడా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇక అనుకున్నట్లే ఈ నెల 10వ తేదీన స్టార్ మా లో ప్రసరమైన ప్రీమియర్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమా మొదటి సారి బుల్లితెరపై 13.31 టిఆర్పి అందుకోవడం విశేషం. బాలకృష్ణ సినిమాలలో అత్యధిక టిఆర్పి అందుకున్న సినిమాగా కూడా అఖండ సినిమా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఒకవిధంగా ఐపీఎల్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా అఖండ సినిమా మంచి టీఆర్పీ అందుకోవడం విశేషం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు అనే చెప్పాలి. ప్రస్తుతం సినిమా హాట్ స్టార్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా మళ్లీ బుల్లితెరపై అద్భుతమైన టిఆర్పి అందుకోవడం అంటే అంత సాధారణమైన విషయం కాదు.
ఏదేమైనా నందమూరి బాలకృష్ణతో పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ సినిమా తీయగలిగితే మాత్రం ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అని మరో సారి రుజువైంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నారు అని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ విషయంపై దర్శకుడు బోయపాటి కూడా ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏదైనా జరగవచ్చు అని కూడా చెప్పాడు. ఇక అఖండ 2 లో మరొక హీరో కూడా కనిపిస్తాడు అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ అని కూడా వార్తలు వచ్చాయి. మరి నిజంగానే అఖండ 2 లో అల్లు అర్జున్ నటిస్తాడా? లేక మరొక సినిమాతో వీళ్ళు ప్రేక్షకుల ముందుకు వస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.