Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్‌బాస్‌కు షాకిచ్చిన అఖిల్ అక్కినేని.. ఏకంగా గేమ్ రూల్స్ మార్చేసి సమంతకు ఝలక్!
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ అక్కినేని గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇంటిలో నిర్వహించిన స్వయంవరంలో విజేతలను ఎంపిక చేయమని సమంత సూచించింది. అయితే ఈ సందర్భంగా అఖిల్, సమంత మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా బిగ్‌బాస్ పెట్టిన రూల్స్‌ను మార్చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..
సమంత నీ సెలక్షన్ సూపర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అని నేను నమ్ముతాను. నేను సెలెక్ట్ చేసుకొనే అమ్మాయి మంచిదా అనే విషయాన్ని నీవు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుందంటూ అఖిల్ చెప్పారు. నీవు సెలెక్ట్ చేసుకొన్న తర్వాత మేము మొక్కుబడిగా ఓకే అంటాం. అంతేకదా అని సమంత అంటే.. నీ సెలక్షన్ మీద నాకు రెస్పక్ట్ ఉంది. మా అన్నయ్యను సెలెక్ట్ చేసుకొన్నప్పుడే నీ సెలక్షన్ ఏమిటో తెలిసింది అంటూ అఖిల్ పంచ్ వేశాడు.
బిగ్‌బాస్ విధించిన రూల్‌కు నో
స్వయంవరంలో ఫైనల్‌కు చేరిన నాలుగు జంటల్లో వరస్ట్ జంట ఏమిటో డిసైడ్ చేయమని అఖిల్‌ను అడిగితే అందుకు అఖిల్ నో చెప్పాడు. చెత్త జంట అని అనడం నా వల్ల కాదు. బెస్ట్1, బెస్ట్ 2, బెస్ట్3, బెస్ట్4 జంట అని అంటానని అఖిల్ అన్నాడు. బిగ్‌బాస్ రూల్స్ మార్చలేం.. కానీ ట్రై చేస్తా అని సమంత అని.. వెంటనే బిగ్‌బాస్ ఒకే అన్నాడు అని సమంత చెప్పింది.
బెస్ట్ జంటగా మెహబూబ్, అరియానా
స్వయంవరం గేమ్‌లో భాగంగా నిర్వహించిన డ్యాన్స్ పోటీ ఆధారంగా అఖిల్ విజేతలను నిర్ణయించారు. బెస్ట్ 4 జంటగా అఖిల్, దివి వద్యాను అమ్మా రాజశేఖర్ డిసైడ్ చేశారు. ఆ తర్వాత బెస్ట్1 జంటగా మెహబూబ్, అరియానాను, బెస్ట్ 2 జంటను అఖిల్, మోనాల్గా ఎంపిక చేశాడు.
అభిజిత్ నీ బ్రదర్ నాకు క్లాస్ మేట్
అభిజిత్‌కు అఖిల్ అక్కినేని షాకిచ్చారు. నీ బ్రదర్ అభయ్ నాకు స్కూల్లో బ్యాచ్మెట్ అని చెప్పగానే అభిజిత్ ఆశ్చర్యపోయారు. మీకు ఇంకా గుర్తుందా అంటూ అఖిల్‌ను అడిగారు. అవును నేను ఎలా మరిచిపోతాను అంటూ అఖిల్ సమాధానం చెప్పారు,. అంతేకాకుండా డ్యాన్స్‌లో నీవు తోపు అంటున్నారు అంటే.. అంతలేదు.. కనీసం హోప్ కూడా లేదు అంటూ అభిజిత్ సమాధానం చెప్పారు.
Recommended Video
బిగ్‌బాస్ సెలబ్రిటీలకు అఖిల్ అక్కినేని గిఫ్టు
ఇక చివర్లో దసరా పండుగ నేపథ్యంలో ఇంటి సభ్యులకు తెచ్చిన గిఫ్టులను అఖిల్ అందించారు. బిగ్‌బాస్‌తో మా కుటుంబంలో మీరు సభ్యులుగా మారిపోయారు. మా ఇంట్లో మా గురించి నాన్న మరిచిపోయి మీ గురించే చెబుతుంటారు. అంత బాగా ఆడుతున్నారు. మీరు ఇలాగే ఆడండి. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అఖిల్ షో నుంచి నిష్క్రమించారు.