బిగ్‌బాస్‌లో దుమ్మురేపిన‌ అఖిల్ అక్కినేని.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ స్వయంవరం

తెలుగు బిగ్‌బాస్ 4లో ఏడోవారం ఎలిమినేషన్ ఎపిసోడ్‌కు దసరా పండగ కళ తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు, గాయకులు బిగ్‌బాస్ వేదికపై మెరిశారు. సండే ఎపిసోడ్‌లో సమంత అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తే.. అఖిల్ అక్కినేని స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. వేదికపైనకు వచ్చిన అఖిల్ ఇంటి సభ్యులతో ఆడించిన స్వయం వరం అనే గేమ్‌లో భాగస్వామి అయ్యారు.

ఇంటి సభ్యులతో స్వయంవరం షో ప్రారంభం కాబోతున్నది. అమ్మాయిలందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం సిద్ధంకండి అంటూ సమంత అనగానే అఖిల్ అక్కినేని ఎంట్రీ ఇచ్చారు. అఖిల్‌ను చూడగానే ఇంటి సభ్యుల చప్పట్లు, కేకలతో స్వాగతించారు.

Akhil Akkineni into Bigg Boss Telugu 4s 7week elimination episode

ఇంటి సభ్యులతో అఖిల్ మాట్లాడుతూ.. నాన్న బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత మాతో వేరే విషయాలు మాట్లాడటం లేదు. ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతుంటాడు. మీ గేమ్ చాలా చాలా బాగుంది అంటూ అఖిల్ ప్రశంసలు కురిపించారు.

అఖిల్‌తో అభిజిత్, అఖిల్ సార్థక్, అవినాష్‌తోపాటు అందరూ జోష్‌గా దసరాను సెలబ్రేట్ చేసుకొన్నారు. ఇంటి సభ్యులతో వారి కుటుంబాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడించడంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు.

తాజా సమాచారం ప్రకారం.. 7 వారంలో ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇంటి నుంచి ఈ వారం దివి వద్యాను బయటకు పంపించినట్టు సమాచారం. దివి ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X