Just In
- 6 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 1 hr ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్‌నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 2 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
చెలరేగిన సిరాజ్, శార్దూల్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Finance
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 తక్కువ
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
50 వేల అప్పుతో ఇంటి నుంచి బయటకు.. కులం కాదనే బ్రేకప్ చెప్పింది.. కష్టాలు చెప్పుకొన్న అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ రన్నరప్ అఖిల్ సార్థక్ తన జీవితంలో చోటుచేసుకొన్న అనుభవాలను మీడియాకు వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఈ రేంజ్ గుర్తింపు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో వివరించారు. ప్రతీ క్షణం కెరీర్ కోసం పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. మిడిల్ క్లాస్ కుటుంబం పుట్టి, స్టార్‌గా ఎదుగాలనే కలను ఎలా కనాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు. అఖిల్ సార్థక్ చెప్పిన ప్రకారం..

చిన్నప్పుడే సెలబ్రిటీగా మారాలనే
చిన్నతనంలోనే తాను సెలెబ్రిటీ కావాలని కోరుకొన్నాను. మనం చేసే వృత్తి చెప్పుకొనే విధంగా కాకుండా మన గురించి మరొకరు చెప్పుకొనేలా ఉండాలని ప్రయత్నించాను. నా చుట్టూ అందరూ ఉండాలని, మీడియా వెలుగుల మధ్య జీవించాలని కోరుకొన్నాను అని అఖిల్ సార్థక్ చెప్పారు.

19 ఏళ్ల వయసులోనే
19 వయసులోనే తన కెరీర్ గురించి ఓ అవగాహన పెంచుకొన్నాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. ఓ సెలబ్రిటీకి ఉండాల్సిన ఫిజికల్ అప్పీయరెన్స్ సమకూర్చుకొనేందుకు ప్రయత్నించాను. జిమ్, అందంగా కనపడటానికి కొన్ని చికిత్సలు చేయించుకొన్నాను అంటూ అఖిల్ సార్థక్ తెలిపారు.

50 వేలు అప్పు చేసి
ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో తనకు తెలిసిన ఓ వ్యక్తి నుంచి 50 వేలు అప్పు తీసుకొని హైదరాబాద్‌కు వెళ్లాను. అవకాశాలను వెతుక్కొంటూ అప్పు తీర్చే ప్రయత్నం చేశాను. అలా నా కెరీర్‌ను నాకు నేనుగా నిర్మించుకొన్నాను. అప్పులు చేస్తూ.. వాటిని తీర్చుతూ అలా కెరీర్‌లో ముందుకెళ్లి బిగ్‌బాస్ ద్వారా ఈ స్థాయికి చేరుకొన్నాను అని అఖిల్ అన్నారు.

నాకు అన్ని చోట్ల అన్యాయమే
టెలివిజన్ సీరియల్స్‌లో నటించే సమయంలో నాకు చాలా అన్యాయం జరిగింది. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో యాడ్స్‌లో నటించే అవకాశం లభించింది. కానీ కొందరు ఆ అవకాశాలను అందుకోకుండా నన్ను తొక్కేసారు. కొందరు చేసిన పనుల వల్ల ముంబై కంపెనీకి సంబంధించిన యాడ్స్‌లో నటించలేకపోయాను అని అఖిల్ సార్థక్ తెలిపారు.

కులం కాదని బ్రేకప్ చెప్పిన లవర్
ఇక తన లవ్ బ్రేకప్ గురించి తెలియజేస్తూ.. ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. కానీ చివరకు కులం కాదనే విషయంపై నా ప్రేమను తిరస్కరించారు. దాంతో ఆ ప్రేమ వ్యవహారానికి బ్రేక్ పడింది. జీవితంలో నేను ప్రేమ పెళ్లినే చేసుకొంటాను. ఎందుకంటే నా తల్లిదండ్రులది ప్రేమ వివాహం అంటూ అఖిల్ చెప్పారు.