అప్పుడే నా పని ఖతం అనుకొన్నా.. మోనాల్ వల్లే అంతా... నా పక్కన ఉంటూనే కొందరు అంటూ అఖిల్ సార్థక్

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్ తనకు లభిస్తున్న ఆదరణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తనపై ప్రేక్షకులు కురిపిస్తున్న అభిమానానికి ఆనందంలో మునిగిపోతున్నాడు. ఇంటిలో ఉన్న సమయంలో, బయటకు వచ్చిన తర్వాత జరిగిన విషయాలను వెల్లడిస్తూ...

 మొదటి వారమే ఎలిమినేట్ అవుతానని

మొదటి వారమే ఎలిమినేట్ అవుతానని

బిగ్‌బాస్ తెలుగు 4 షోలోకి వెళ్లిన తర్వాత ఇతర కంటెస్టెంట్లను చూసి షాక్ తిన్నాను. నేను మొదటి వారమే బయటకు వస్తానని అనుకొన్నాను. సెలబ్రిటీలకు ఉన్న ఫాలోయింగ్‌ చూసి నా పని ఖతం అనుకొన్నాను. నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదనే విషయం నాకు అర్ధమైంది అని అఖిల్ సార్థక్ తెలిపారు.

 నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు

నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు

బిగ్‌బాస్‌లో ఉన్న సమయంలో నాకు ఎలాంటి సపోర్ట్ రాలేదనే విషయం తెలుస్తున్నది. నాతోపాటు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లకు వారి ఫ్యాన్స్, స్నేహితులు, కొలీగ్స్, ఇతర సెలబ్రిటీలు బాగా సపోర్ట్ చేశారు. నాకు ఎక్కువలో ఎక్కువ అంటే ఇద్దరు మాత్రమే సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేస్తారనుకొన్న వాళ్లు కూడా చేయకపోవడం షాక్ తిన్నాను అని అఖిల్ పేర్కొన్నారు.

 నా పక్కన ఉంటూనే కొందరు..

నా పక్కన ఉంటూనే కొందరు..

కొందరు నా పక్కన ఉంటూనే హ్యాండిచ్చారు. మోనల్ తప్ప మరెవరూ నాకు అండగా నిలువలేదు. మోనాల్ నాకు బాగా సపోర్ట్ చేయడం హ్యాపీ అనిపించింది. నేను విజేతగా నిలువాలని ఆమె కోరుకొన్నది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నా కోసం శాయశక్తులా ప్రయత్నించారు. అందుకు ఏ రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు అని అఖిల్ తెలిపారు.

 కప్ గెలుచుకోలేకపోయాను.. కానీ,...

కప్ గెలుచుకోలేకపోయాను.. కానీ,...

ఏది ఏమైనా నేను కప్ గెలుచుకోలేకపోయాను. కానీ ఎంతో మంది హృదయాలను గెలుచుకొన్నాను. అందుకు చాలా ఆనందంగా ఉంది. అందరి ప్రేమను హృదయంలోనే ఉంచుకొంటాను. ఎప్పుడూ గర్వంగా ఫీలై తలకు ఎక్కించుకోను. వారికి ఏ రకంగా నేను ప్రేమను తిరిగి ఇవ్వాలని చూస్తున్నాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేకపోతున్నా అని అఖిల్ పేర్కొన్నారు.

 నా స్థాయి ఏమిటో నాకు తెలుసు

నా స్థాయి ఏమిటో నాకు తెలుసు

నేను ఏ స్థాయి నుంచి వచ్చానో తెలుసు. ఇంటిలో నేను ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా కష్టపడ్డాను. అలాంటి సమయంలో నాకు ఎంతో ప్రేమను చూపించారనేది స్పష్టమైంది. ఇప్పటికి నాపై ప్రేక్షకుల చూపిస్తున్న అభిమానులను డిజాపాయింట్ చేయను అని అఖిల్ చెప్పారు.

 దారుణంగా ట్రోల్ చేశారని..

దారుణంగా ట్రోల్ చేశారని..

ఇంటిలో ఉన్న సమయంలో నన్ను చాలా దారుణంగా ట్రోల్ చేశారని తెలిసింది. అలాంటి ట్రోల్స్‌ను చూడదలుచుకోలేదు. నన్ను బ్యాడ్ చేయాలని చూస్తే నాపై మరింత ప్రేమను కురిపించారు. అందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీరు అందించిన బలాన్ని ఎప్పటికీ మరిచిపోను అంటూ అఖిల్ వెల్లడించారు.

 జీవితంలో చాలా ప్రేమను మిస్ అయ్యా

జీవితంలో చాలా ప్రేమను మిస్ అయ్యా

బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న సమయంలో నాకు చాలా ఫ్యాన్స్, ఫాలోయింగ్ ఉందని చెబితే నమ్మలేదు. నా పేరుతో ఫ్యాన్స్ గ్రూపులు, ఫ్యాన్స్ పేజ్‌లు ఉన్నాయనే విషయం తెలుకొని ఏం చేయాలో అర్ధం కావడం లేదు. నా జీవితంలో చాలా ప్రేమను మిస్ అయ్యాను. ఇప్పుడు మీరు అందిస్తున్న ప్రేమతో నేను హ్యాపీగా ఉన్నాను అని అఖిల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X