మోనాల్ లిప్స్ అలా సోహెల్ టచ్ చేసే వాడు.. అసలు గుట్టు విప్పిన అఖిల్ సార్థక్
బిగ్‌బాస్ తెలుగు 4 ముగిసిన తర్వాత అఖిల్ సార్థక్ పాపులారిటీ మరింత పెరిగింది. ఇంటిలో తాను అనుభవించిన ఎమోషన్స్, రిలేషన్స్ గురించి పలు మీడియాలకు పూసగుచ్చినట్టు వెల్లడించారు. ఈ సందర్బంగా సోహెల్, మోనాల్‌తో ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. ఇంటిలో తమ మధ్య చోటుచేసుకొన్న విషయాలను వెల్లడిస్తూ..

బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో
ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఇండస్ట్రీలో నాకు సరైన గుర్తింపు రాలేదు. అందువల్ల బిగ్‌బాస్‌కు వెళ్లాలని నిర్ణయించుకొన్నాను. బిగ్‌బాస్ నుంచి ఆఫర్ రావడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఒప్పేసుకొన్నాను. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఊహించనంత పాపులారిటి వచ్చింది అని అఖిల్ అన్నాడు.

నాపై సోహెల్ గాడు అలా
బిగ్‌బాస్ షో తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం నాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సోహెల్ గాడు ఏడుస్తున్నాడు. ఇంకా నీకు ర్యాలీలు తీస్తున్నారు. ఇంకా మీ ఇంటికి అభిమానులు వస్తున్నారు అంటూ టెవీ లైల్‌లో సోహెల్ అన్నాడు. అయినా మా మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి అఖిల్ తెలిపారు.

హరికతో నాకు అలాంటి రిలేషన్
ఇక చివరి రెండు వారాల్లో హారికతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. చాలా విషయాల్లో కామన్ అంశాలు మా మధ్య ఉన్నాయి. నేను హారిక ఒకే వయసు గ్రూప్ వాళ్లం కావడంతో బాగా కనెక్ట్ అయ్యాం. చాలా వ్యక్తిగత విషయాలను హారిక నాతో, నేను హారికతో షేర్ చేసుకొన్నాం అని అఖిల్ వెల్లడించాడు.

మోనాల్ లిప్స్ సోహెల్ టచ్ చేస్తే..
మోనాల్‌తొ నాకు మొదట్లోనే క్లోజ్ రిలేషన్ ఏర్పడింది. ఆ తర్వాత మోనాల్‌ను సోహెల్ టచ్ చేసేవాడు. ఒకరోజు మోనాల్ లిప్స్ టచ్ చేస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. కొన్నిసార్లు అలా చేయవద్దని వారించాను. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడింది. అన్నా, చెల్లెల బంధంతో వారిద్దరి మరింత క్లోజ్ అయ్యారు అని అఖిల్ తెలిపారు.

బిగ్‌బాస్ తర్వాత మంచి ఆఫర్లు
బిగ్‌బాస్ తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడే వాటిని బయటకు చెప్పలేను. అన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిన తర్వాత వాటి గురించి తెలియజేస్తాను. ప్రస్తుతం టీవీ షోలలో పార్టిసిపేట్ చేయాలని అనుకొంటున్నాను. త్వరలోనే సినిమాల్లో కూడా నటిస్తాను అని అఖిల్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











