For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గంగవ్వకు ఓ మాటిచ్చా..అది త్వరలోనే తీర్చుతా..మోనాల్‌కు అందుకే దగ్గరయ్యా..వాస్తవాలు చెప్పిన అఖిల్

  |

  బిగ్‌బాస్ తెలుగు 4 రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్‌ బుల్లి తెర ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. బిగ్‌బాస్ షో తర్వాత పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వూలు ఇస్తూ ఇంటిలోని అనుభూతులను పంచుకొంటున్నారు. ఇటీవల అఖిల్ సార్థక్ మీడియాతో మాట్లాడుతూ గంగవ్వ, మోనాల్ గజ్జర్‌తో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేశారు. అఖిల్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  గంగవ్వతో అలాంటి కనెక్షన్

  గంగవ్వతో అలాంటి కనెక్షన్

  బిగ్‌బాస్ ఇంటిలో గంగవ్వతో ఉన్న అనుబంధాన్ని నేను మరిచిపోలేను. నాకు నాన్నమ్మలా, అమ్మమ్మలా కనెక్ట్ అయ్యారు. గంగవ్వ నాపై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేను. అన్ని వేళలా నాకు గంగవ్వ ప్రేమను, అభిమానాన్ని చూపించింది అంటూ అఖిల్ సార్థక్ చెప్పారు. ఇప్పుడు ఆమె నోటి నుంచి అఖిలూ అఖిలూ ప్రేమను వ్యక్తం చేసేది అన్నారు.

  ఎవరైనా నాతో మిస్ బిహేవ్ చేస్తే

  ఎవరైనా నాతో మిస్ బిహేవ్ చేస్తే

  ఇక ఇంటిలో ఎవరైనా నాతో మిస్ బిహేవ్ చేస్తే వారిని కూడా తిట్టేది. మోనాల్‌కు అన్నం తినిపిస్తుంటే చేతుల లేవా అని బెదిరించింది. అలాగే ఏదైనా పనులు ఎక్కువగా చేస్తే వాళ్లు చేసుకొంటారులే అంటూ నన్ను బయటకు తీసుకు వెళ్లేది. అలా నాకు గంగవ్వ చాలా కనెక్ట్ అయ్యారు.

  గంగవ్వకు టీవీ కొనిస్తానని చెప్పా

  గంగవ్వకు టీవీ కొనిస్తానని చెప్పా

  బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న సమయంలో గంగవ్వకు నేను ఒక మాట ఇచ్చాను. రెండో వారంలో నేను టెలివిజన్ కొనిస్తానని చెప్పాను. నా మాటను నిలబెట్టుకొంటాను. త్వరలోనే గంగవ్వ ఊరికి వెళ్లి టెలివిజన్ కొని ఇస్తాను. నాలుగు వారాల తర్వాత వస్తానని అప్పుడే చెప్పాను. కొన్ని ఇంటర్వ్యూల తర్వాత ఫ్రీ అవుతాను. గంగవ్వ ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను అని అఖిల్ చెప్పారు.

  Abhijeet తో గొడవలు లేవన్న Sohel, MehaBoob చేసిన సైగల పై Sohel కుండబద్దలు !
  మోనాల్ అందుకే నామినేట్ చేశా

  మోనాల్ అందుకే నామినేట్ చేశా

  ఇక మోనాల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. మా మధ్య గుడ్ ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. 8వ వారంలో నామినేట్ చేయడం అందర్ని షాక్ గురిచేసింది. నామినేట్ చేయడానికి ముందు నేను చాలా ఆలోచించాను. నామినేట్ చేసిన తర్వాత నేను చేసింది కరెక్ట్ అని భావించాను అని అఖిల్ చెప్పారు. తాను నామినేట్ చేయడం వల్లే మోనాల్ బాగా ఆడిందన్నారు.

  మోనాల్ ఎలిమినేషన్‌తో

  మోనాల్ ఎలిమినేషన్‌తో

  మోనాల్ ఎలిమినేషన్ తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్దామా అనే ఫీలింగ్‌తోనే ఉన్నాను. ఆదివారం ఎప్పుడు వస్తుంది. ఫినాలే ఎప్పుడు అయిపొతుందనే టెన్షన్‌లో ఉన్నాను. నాతో ఇక కావడం లేదు అంటూ సోహెల్‌తో ఎప్పుడూ చెప్పే వాడిని అంటూ అఖిల్ తెలిపాడు

  నోటి నుంచి మాటలు రాలేదు

  నోటి నుంచి మాటలు రాలేదు

  ఇక మోనాల్ గజ్జర్ ఇంటి నుంచి నవ్వుకొంటూ బయటకు వెళ్తుంటే నేను బ్లాంక్ అయ్యాను. నోటి నుంచి మాటలు రాలేదు. ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆమె నవ్వుకొంటూ వెళ్తుంటే.. ఏడ్వడం ఎందుకు అని ఊరుకొన్నాను. కానీ నా మనసులో ఎంతో దు:ఖం పొంగుకొచ్చింది అంటూ అఖిల్ అన్నారు.

  మోనాల్‌కు అందుకే దగ్గరయ్యా

  మోనాల్‌కు అందుకే దగ్గరయ్యా

  మోనాల్‌కు దగ్గర కావడానికి కారణం ఆమె చూపే చొరవ. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే అందరికి మందులు ఇవ్వడం, కేర్ తీసుకోవడం చేసేది. సోహెల్, మెహబూబ్, నాకు ఏదైనా అయితే.. రాత్రి, పగలు దగ్గర ఉండి కేర్ తీసుకొనేది. అలా మాకు చాలా దగ్గర అయ్యారు. నాకు మంచి ఫ్రెండ్ అంటూ మోనాల్ గురించి అఖిల్ చెప్పారు.

  English summary
  Akhil Sarthak about Monal Gajjar and Bigg Boss Telugu 4, Mehaboob Dilse, Syed Sohel Ryan ditches Abijeet Duddala and Akhil Sarthak, Abijeet Duddala emotional winning speech with Bigg Boss Telugu 4 Trophy before Chiranjeevi and Nagarjuna. Chiranjeevi bumper offer to Divi Vadhtya: Megastar leaks Vedalam Telugu remake details.Bigg boss telugu 4 grand finale updates: Megastar Chirunjeevi satires on Bigg Boss Telugu 4 Winner Abijeet Duddala Bigg Boss Telugu 4 host Nagarjuna annouces 10 lakhs to Syed Sohel Ryan and Mehaboob Dilse. Nagarjuna Akkineni reveals secret of Anil Ravipudi in Mahesh Babu's Shoot. Abijeet Duddala mother gets emotional in Bigg Boss Telugu 4 grand finale Abijeet duddala, Syed Sohel Ryan, Akhil Sarthak, Ariana Glory, Dettadi Harika are in Top 5. Host Nag is organised the Grand event in his style
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X