జంటగా సర్‌ప్రైజ్ చేసిన అఖిల్ మోనాల్: చాలా రోజుల తర్వాత క్లోజ్‌గా.. అద్దంలో అలా కనిపించడంతో!
అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేర్లివి. అంతలా వీళ్లిద్దరూ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో జంటగా ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జోడీగా రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జంటగా సర్‌ప్రైజ్ చేశారు. చాలా రోజుల తర్వాత క్లోజ్‌గా కనిపించారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ షో ఆరంభంలోనే చాలా క్లోజ్ అయ్యారు. అలా అలా ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైంది. దీంతో తరచూ తమ లవ్‌ను వ్యక్తపరచుకోవడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయేవారు. ఫలితంగా హౌస్‌లో ఉన్నప్పుడే పాపులర్ అయ్యారు.

బయట కూడా అదే తీరుతో క్రేజ్
బిగ్ బాస్ హౌస్‌లో జంటగా రచ్చ రచ్చ చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. బయటకు వచ్చిన తర్వాత కూడా తీరును కొనసాగిస్తున్నారు. తరచూ కలుసుకోవడం.. వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా షోలో ఉన్నప్పుడు మాదిరిగానే బయట కూడా హైలైట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇద్దరూ బిజీగానే ఉంటున్నారు
బిగ్ బాస్ షో తర్వాత అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ కెరీర్‌లకూ బూస్ట్ వచ్చింది. దీంతో ఇద్దరూ వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. తద్వారా అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటికే మోనాల్.. ఓ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో పాటు డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. అలాగే, అఖిల్ కూడా హీరోగా తన మొదటి సినిమాను ప్రారంభించేశాడు.

అది అసలు వస్తుందా? రాదా?
ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా ప్రారంభం కాలేదు.

హైదరాబాద్ వచ్చేసిన మోనాల్
గుజరాత్‌కు చెందిన మోనాల్ గజ్జర్.. అహ్మదాబాద్‌లో నివాసం ఉంటోంది. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయింది. గతంలో ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇటీవలే ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే వారం క్రితమే ఆమె తన ఫ్యామిలీతో సహా ఇక్కడకు వచ్చేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించిందామె.

సర్‌ప్రైజ్ చేసిన అఖిల్ మోనాల్
సొంత ఊరి నుంచి ఇక్కడకు వచ్చిన వెంటనే మోనాల్ గజ్జర్ హైదరాబాదీని అయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఖిల్ సార్థక్ కోసమే ఇక్కడకు వచ్చేసి ఉంటుందని కామెంట్లు వచ్చాయి. అది జరిగిన వెంటనే ఆమె నిజంగానే అతడితో కలిసి డిన్నర్‌కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోను అఖిల్ సార్థక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకున్నాడు.

చాలా రోజుల తర్వాత క్లోజ్ ఫోజ్
అఖిల్ సార్థక్ పోస్ట్ చేసిన ఫొటోలో.. అద్దం ముందర నిల్చుని వీళ్లిద్దరూ సెల్ఫీ దిగారు. ఇందులో మోనాల్ గజ్జర్ అతడిని వెనుక నుంచి హత్తుకుని కనిపించింది. ఈ మధ్య కాలంలో వీళ్లిద్దరూ ఇంత క్లోజ్‌గా కనిపించలేదు. దీంతో ఈ ఫొటో చూసిన ఇద్దరు అభిమానులు దీన్ని తెగ వైరల్ చేసేస్తున్నారు. అంతేకాదు, అఖినాల్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అందరూ తెగ మురిసిపోతున్నారు.


Click it and Unblock the Notifications











