ప్రేమికులరోజు సాక్షిగా ఒక్కటైన అఖిల్ - మోనాల్: బిగ్ డే అని చెబుతూ మేటర్ రివీల్ చేసిన జంట

బుల్లితెరపై బిగ్ బాస్ షో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దీనికి కారణం అందులో చూపించే కంటెంటే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన వాటి కంటే హౌస్‌లోని కంటెస్టెంట్ల మధ్య ఉన్న ప్రేమ కహానీలు ఎక్కువగా హైలైట్ అయ్యాయి. అన్ని సీజన్ల మాదిరిగానే ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లోనూ కొన్ని జంటలు హల్‌చల్ చేయగా.. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ బాగా పాపులర్ అయింది. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమికుల రోజున వీళ్లిద్దరూ ఒక్కటయినట్లు ప్రకటించారు. ఆ వివరాలు మీకోసం!

అఖిల్ అలా వచ్చాడు... మోనాల్ ఇలా

అఖిల్ అలా వచ్చాడు... మోనాల్ ఇలా

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాలు, సీరియళ్లలో నటించి మెప్పించాడు. తద్వారా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. సినిమా హీరోయిన్‌గా పరిచయమైన మోనాల్ గజ్జర్ పలు చిత్రాల్లో నటించింది. తద్వారా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది.

 ట్రైయాంగిల్ కాస్తా.. వాళ్లిద్దరిని కలిపింది

ట్రైయాంగిల్ కాస్తా.. వాళ్లిద్దరిని కలిపింది


ప్రతి సీజన్‌లో మాదిరిగానే నాలుగో దానిలో కూడా లవ్ ట్రాకులే బాగా హైలైట్ అయ్యాయి. షో ఆరంభంలో యంగ్ హీరో అభిజీత్.. మోనాల్ గజ్జర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఆమె అఖిల్‌తోనూ చనువుగా ఉండడంతో ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ ఉందని అన్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మోనాల్ అభికి దూరమై అఖిల్‌కు దగ్గరైంది.

జంటగా హల్‌చల్... హౌస్‌లో రొమాన్స్

జంటగా హల్‌చల్... హౌస్‌లో రొమాన్స్

క్రమంగా బిగ్ బాస్ హౌస్‌లో లవర్స్‌గా మారిపోయారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. స్వతహాగా ఆడే గేమ్ షోను కపుల్స్‌ దానిలా మార్చారీ ఇద్దరు. ప్రతి విషయంలోనూ జంటగా ఇన్వాల్వ్ అవుతూ హల్‌చల్ చేశారు. అదే సమయంలో హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేసుకోవడంతో పాటు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

బయట కూడా రెచ్చిపోతోన్న కొత్త జోడీ

బయట కూడా రెచ్చిపోతోన్న కొత్త జోడీ

బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఇలా కొన్ని రోజులుగా జంటగా రెచ్చిపోతున్నారు.

సర్‌ప్రైజ్ ఇస్తానని ప్రకటించిన మోనాల్

సర్‌ప్రైజ్ ఇస్తానని ప్రకటించిన మోనాల్

మోనాల్ గజ్జర్.. ఇటు అఖిల్ సార్థక్.. ప్రేమికుల రోజున సర్‌ప్రైజ్ ఇస్తున్నామని తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఈ మేరకు మోనాల్ అయితే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'గాయ్స్.. ఒక ఆసక్తికరమైన అప్‌డేట్.. రేపు మధ్యాహ్నం బిగ్ సర్‌ప్రైజ్. వేచి చూడండి' అంటూ పోస్ట్ చేసింది. దీంతో తమ ప్రేమ గురించే ప్రకటించబోతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ప్రేమికులరోజు సాక్షిగా ఒక్కటైన కపుల్

ప్రేమికులరోజు సాక్షిగా ఒక్కటైన కపుల్

అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. ప్రకటించిన దాని ప్రకారం.. వాలంటైన్స్ డే కోసం వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తికరంగా వేచి చూశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్లిద్దరూ కలిసి జంటగా మారబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది నిజ జీవితంలో మాత్రం కాదులేండి.. ప్రస్తుతం రూపొందుతోన్న 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ కోసం.

Recommended Video

GQ25 Most Influential Young Indians : Allu Arjun కి స్థానం , Pant, Kl Rahul కూడా..!!
బిగ్ డే అని చెబుతూ మేటర్ రివీల్ చేసి

బిగ్ డే అని చెబుతూ మేటర్ రివీల్ చేసి

సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తోన్న 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్‌లో అఖిల్ సార్థక్.. మోనాల్ జంటగా నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేస్తూ.. 'బిగ్ డే.. మీ ఆశీర్వాదం కావాలి' అంటూ పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X