For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జంట కాబోతున్న మోనాల్ - అఖిల్: లాక్‌డౌన్ తర్వాతనే ముహూర్తం.. త్వరలోనే అధికారిక ప్రకటన

  |

  తెలుగు బుల్లితెరపైన ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అయితే వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన స్పందనను అందుకుని నెంబర్ వన్ షోలుగా మారతాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. నాలుగేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న ఈ షో ఎంతో మందిని సెలెబ్రిటీలుగా.. కొందరిని జంటలుగా మార్చేసింది. అందులో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. ఇంటా బయటా రచ్చ చేస్తూనే ఉన్న వీళ్లు.. తరచూ ఏదో రకంగా హైలైట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి గురించి తాజాగా ఓ ఊహించని గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

  హాట్ హాట్ ఫొటోలతో సెగలు రేపుతోన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్

  బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసిన జంట

  బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ చేసిన జంట

  బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభం అయిన కొంత కాలానికే అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ చిగురించింది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ హౌస్‌లో రొమాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసేశారు. అదే సమయంలో తరచూ ప్రేమను వ్యక్త పరచుకునేవాళ్లు. ఒకరికొకరు సపోర్టుగా ఉంటూ ఎన్నో ఎలిమినేషన్లను తప్పించుకున్నారు. ఇలా షోలో ఊహించని విధంగా సందడి చేశారు.

  బయటకు వచ్చాక కూడా తగ్గట్లేదుగా

  బయటకు వచ్చాక కూడా తగ్గట్లేదుగా

  బిగ్ బాస్ హౌస్‌లో హల్‌చల్ చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. షో ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నో సార్లు వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. తరచూ పార్టీలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకోవడం.. వీడియో కాల్స్ మాట్లాడుకోవడం వంటివి చేయడంతో పాటు వాటిని బహిరంగం చేస్తున్నారు.

   కలుస్తున్నట్లు జంటగా ప్రకటించారు

  కలుస్తున్నట్లు జంటగా ప్రకటించారు

  ఈ ఏడాది ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

  ఇంకా మొదలవలేదు.. అనుమానం

  ఇంకా మొదలవలేదు.. అనుమానం

  అఖిల్ సార్థక్.. ఇటీవలే హీరోగా తన మొదటి చిత్రం ‘ఫస్ట్ టైమ్'ను ప్రకటించాడు. ఐ హేమంత్ నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అనిక విక్రమన్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, మోనాల్ కూడా పలు షోలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో ముందుగా వీటిపైనే వీళ్లు ఫోకస్ చేయడంతో.. అసలు వెబ్ సిరీస్ ఉంటుందా లేదా అని దాని గురించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

   ఆలస్యంపై వివరణ ఇచ్చేసిన అఖిల్

  ఆలస్యంపై వివరణ ఇచ్చేసిన అఖిల్

  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' వెబ్ సిరీస్ ఇంకా మొదలవకపోడానికి కారణమేంటి అని యాంకర్ అడిగాడు. దీనికి ‘మోనాల్ గజ్జర్‌కు చాలా ఆఫర్లు ఉన్నాయి. నాకు కూడా ఈ సినిమా డేట్స్ ఫుల్ అయ్యాయి. వాటి వల్ల మా ఇద్దరికీ సెట్ అవడం లేదు. ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడు ఆ సిరీస్ పూర్తి చేస్తాం' అంటూ క్లారిటీ ఇచ్చాడీ స్టార్ బాయ్.

  జంట కాబోతున్న మోనాల్ - అఖిల్

  జంట కాబోతున్న మోనాల్ - అఖిల్

  ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' వెబ్ సిరీస్ విషయంలో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ఇద్దరూ యూటర్న్ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే ఇకపై ఈ సిరీస్ మొదలయ్యే అవకాశాలు లేవన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోనాల్ గజ్జర్ ఇటీవలే ‘డ్యాన్స్ ప్లస్' షోను కంప్లీట్ చేసుకుంది. దీంతో ఈ సిరీస్‌ మొదలవబోతుందని ఓ న్యూస్ లీకైంది.

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
  లాక్‌డౌన్ తర్వాతనే ముహూర్తం ఫిక్స్

  లాక్‌డౌన్ తర్వాతనే ముహూర్తం ఫిక్స్

  తాజా సమాచారం ప్రకారం.. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందట. లాక్‌డౌన్ తర్వాత వీళ్లిద్దరూ దీని కోసమే కలిసి పని చేయబోతున్నారని ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. దీనిపై వీళ్లిద్దరూ సోషల్ మీడియా వేదికగా త్వరలోనే ప్రకటన చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

  English summary
  Bigg Boss Telugu Season 4 Contastants Akhil Sarthak and Monal Gajjar Announced TELUGU ABBAYI GUJURAT AMMAYI Web Series. This will Start After Lockdown.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X