బిగ్ బాస్ హౌస్‌లో మరో లవ్ ట్రాక్: మోనాల్‌ను వదిలేసి ఆమెతో కలుపుతున్న అఖిల్

బిగ్ బాస్ షో అన్ని భాషల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ షోకు తిరుగులేకుండా పోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా... హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ వరకు ప్రతిసారీ ఏదో ఒక జంట హైలైట్ అవుతూనే ఉంది. ఈ సారి మాత్రం రెండు మూడు ప్రేమ జంటల వల్ల మరింత మసాలా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్.. మోనాల్‌ను కాదని మరొకరితో పులిహోర కలుపుతున్నాడట. ఈ విషయాన్ని హౌస్‌మేట్స్ బయట పెట్టారు. అసలేం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ షోలో ట్రాక్‌లే బాగా ఫేమస్

బిగ్ బాస్ షోలో ట్రాక్‌లే బాగా ఫేమస్

ఎన్నో వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, కొట్లాటలు వంటి వాటితో బిగ్ బాస్ హైలైట్ అవుతూ వస్తోంది. అన్నింటికీ మించి లవ్ ట్రాకులు మరింతగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మొదటి సీజన్‌లో ప్రిన్స్ - దీక్షాపంత్, రెండో సీజన్‌లో తేజస్వి - సామ్రాట్, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ - పునర్నవి భూపాలం ట్రాకులు నడపడం వల్ల వాళ్లతో పాటు షోకూ బాగా ప్లస్ అయింది.

ఈ సీజన్‌లో మూడు ప్రేమ జంటలు

ఈ సీజన్‌లో మూడు ప్రేమ జంటలు

అన్ని సీజన్ల మాదిరిగానే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న దానిలో కూడా లవ్ ట్రాకులు కనిపిస్తున్నాయి. ప్రతి సీజన్‌లో ఒకటే రెండో జంటలు హైలైట్ అయితే.. ఈ సారి మాత్రం ఏకంగా మూడు జంటలు బాగా పాపులర్ అయ్యాయి. మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్, అభిజీత్ - దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ - అవినాష్‌ జంటలు సీజన్‌ మొత్తానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

 ఊహించని విధంగా కలిసిన ఈ ట్రాక్

ఊహించని విధంగా కలిసిన ఈ ట్రాక్

వాస్తవానికి మోనాల్ గజ్జర్ షో ఆరంభంలో అభిజీత్‌తో ట్రాక్ నడిపినట్లు కనిపించింది. అంతేకాదు, నువ్వంటే నాకిష్టం అని కూడా అతడికి చెప్పింది. దీంతో ఈ జంట ఈ సీజన్‌లో పాపులర్ అవుతుందని అనుకున్నారంతా. కానీ, ఊహించని విధంగా వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మోనాల్ అతడి వైపు డైవర్ట్ అయింది. అప్పటి నుంచి వీళ్ల ట్రాక్ నడుస్తోంది.

 అర్జున్ రెడ్డిని గుర్తుకు తెచ్చేశాడుగా

అర్జున్ రెడ్డిని గుర్తుకు తెచ్చేశాడుగా

మోనాల్ గజ్జర్ వ్యవహారాన్ని అఖిల్ సార్థక్ ఎంతో సీరియస్‌గా తీసుకున్నాడు. అందుకే ఆమె కోసం, ఆమెతో కలిసి గేమ్ ఆడడం ప్రారంభించాడు. నామినేషన్ సమయంలోనో, టాస్కులు సమయంలోనో ఆమెను ఎవరైనా టార్గెట్ చేస్తే తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే వాళ్లతో గొడవలకు దిగుతున్నాడు. దీంతో అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టర్‌ను గుర్తుకు తెస్తున్నాడు.

 బిగ్ బాస్ హౌస్‌లో మరో లవ్ ట్రాక్

బిగ్ బాస్ హౌస్‌లో మరో లవ్ ట్రాక్

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ఈ వారం ‘రేస్ టు ఫినాలే' టాస్క్ నడుస్తోంది. ఇది కూడా చివరి రౌండ్‌కు వచ్చింది. ఇందులో అఖిల్ సార్థక్, సోహెల్ పోటీ పడుతున్నారు. ఈ టాస్కులో గెలిచిన వారు నేరుగా ఫినాలేకు వెళ్తారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో మరో ట్రాక్ నడుస్తున్నట్లు కంటెస్టెంట్ల ద్వారా బయటకు వచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
 మోనాల్‌ను వదిలేసి ఆమెతో అఖిల్

మోనాల్‌ను వదిలేసి ఆమెతో అఖిల్

చివరి రౌండ్ జ‌రిగేట‌ప్పుడు లైట్లు వెలిగే ఉంటాయని బిగ్‌బాస్ చెప్ప‌డంతో కంటెస్టెంట్లు జాగ‌ర‌ణ చేశారు. ఆ సమయంలో ఫన్ కోసం అఖిల్.. అరియానాతో పులిహోర క‌లుపుతున్నాడ‌ని హారిక మోనాల్‌తో చెప్పింది. దీనిని అందరికీ వినిపించేటట్లు రిపీట్ చేసింది. అయినా అఖిల్ గానీ ఆరియానా గానీ స్పందించలేదు. దీంతో ఇదెప్పుడు జ‌రిగింద‌ని మోనాల్ నోరెళ్లబెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X