కొత్త బేబీతో హైదరాబాద్ రోడ్లపై అఖిల్ సార్థక్ రచ్చ: నా పరిస్థితేంటి అంటూ నిలదీసిన బిగ్ బాస్ ఫ్రెండ్

చాలా కాలం క్రితమే కెరీర్‌ను ప్రారంభించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయాడు యంగ్ సెన్సేషన్ అఖిల్ సార్థక్. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఊహించని రీతిలో పాపులర్ అయిపోయాడు. దీనికి కారణం హౌస్‌లో అతడు వ్యవహరించిన తీరే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాక్ నడపడం వల్ల అతడు హాట్ టాపిక్ అయ్యాడు. షో తర్వాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కొత్త బేబీని పరిచయం చేస్తూ రచ్చ చేశాడు అఖిల్. వివరాల్లోకి వెళితే....

అలా మొదలైన కెరీర్.. ఛాన్స్ పట్టేశాడు

అలా మొదలైన కెరీర్.. ఛాన్స్ పట్టేశాడు

యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, 'కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిసి బిగ్ బాస్‌ చాన్స్ పట్టేశాడు.

అన్నింట్లోనూ మార్క్.. అదరగొట్టేశాడుగా

అన్నింట్లోనూ మార్క్.. అదరగొట్టేశాడుగా


బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ సార్థక్. ఆరంభంలో కొంచెం సైలెంట్‌గా ఉన్న అతడు రాను రానూ వైలెంట్‌గా మారిపోయాడు. ముక్కుసూటిగా ఉంటూ.. తనకు తోచింది చెబుతూ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, పెద్ద బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోనూ తన శ్రమను చూపిస్తూ సత్తా చాటాడు. దీంతో అన్నింట్లోనూ తన మార్క్ చూపిస్తూ అదరగొట్టేశాడు.

హీరోయిన్‌తో లవ్ ట్రాకు.. హౌస్‌లో రచ్చ

హీరోయిన్‌తో లవ్ ట్రాకు.. హౌస్‌లో రచ్చ

బిగ్ బాస్ షోలో మొదట్లో ఒంటరిగానే ప్రయాణం సాగించిన అఖిల్ సార్థక్.. కొద్ది రోజులకు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ హాట్ టాపిక్‌గా మారాడు. అంతేకాదు, ఆ తర్వాత ప్రేమాయణం సాగిస్తూ, రొమాన్స్ డోస్ పెంచుతూ హగ్గులు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు.

బయట కూడా అదే తీరు... హాట్ టాపిక్

బయట కూడా అదే తీరు... హాట్ టాపిక్

ఏమాత్రం అంచనాలు లేకుండానే షోలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సార్థక్.. చివరికి రన్నరప్‌గా నిలిచాడు. దీంతో నిరాశకు లోనైనప్పటికీ.. బయట వచ్చిన క్రేజ్‌తో యమ సంతోషంగా ఉన్నాడు. ఇక, షో తర్వాత కూడా మోనాల్ - అఖిల్ లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతోంది. తరచూ వీళ్లిద్దరూ కలిసి రచ్చ చేస్తున్నారు. ఈ మీటింగ్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు.

మోనాల్‌తో కలిసి జంటగా మొదలెట్టాడు

మోనాల్‌తో కలిసి జంటగా మొదలెట్టాడు

బిగ్ బాస్ షో తర్వాత అఖిల్ సార్థక్‌కు వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, దానికి సంబంధించిన ప్రకటనలు ఏమీ చేయలేదతను. అయితే, గత ప్రేమికుల రోజున మాత్రం మోనాల్ గజ్జర్‌తో కలిసి 'తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కించనున్నారు.

కొత్త బేబీతో హైదరాబాద్ రోడ్లపై అఖిల్ రచ్చ

కొత్త బేబీతో హైదరాబాద్ రోడ్లపై అఖిల్ రచ్చ


బిగ్ బాస్ పుణ్యమా అని ఎనలేని క్రేజ్‌తో పాటు ఆర్థికంగానూ అఖిల్ సార్థక్ చాలా లాభపడ్డాడు. దీంతో ఆ మధ్య కొత్త కారును కూడా కొనుగోలు చేశాడు. ఇలాంటి సమయంలోనే తాజాగా అతడు జావా బైక్‌ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అఖిల్.. 'నా కొత్త బేబీ.. మీ అందరి వల్లే నా కల నెరవేరింది' అంటూ పోస్ట్ చేసి రోడ్లపై రచ్చ చేశాడు.

నా పరిస్థితేంటి అంటూ నిలదీసిన ఫ్రెండ్

నా పరిస్థితేంటి అంటూ నిలదీసిన ఫ్రెండ్


బైక్‌ను కొనుగోలు చేసిన తర్వాత రోడ్లపై దానితో రైడ్ కూడా చేశాడు. ఈ వీడియోలను, ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు అఖిల్. వీటిని చూసిన బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహెల్ రియాన్ ఊహించని కామెంట్ చేశాడు. 'ఆ బైక్‌కు ఒక్కటే సీటు ఉంది కదా. మరి నేనెక్కడ కూర్చోవాలి' అంటూ రిప్లై ఇచ్చాడు. మరోవైపు, అఖిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X