అఖిల్ సార్థక్ రెమ్యూనరేషన్ లీక్: బిగ్ బాస్ రన్నరప్ కంటే అతడికే ఎక్కువ.. షాకిస్తోన్న లెక్కలు!

అఖిల్ సార్థక్.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరిది. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, అందులో అతడు వ్యవహరిస్తున్న తీరు వల్లే బాగా పాపులర్ అయ్యాడు. కెరీర్ ఆరంభంలో పలు షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అతడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఈ రియాలిటీ షో వల్ల విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక, బిగ్ బాస్ షో ద్వారా అఖిల్ సంపాదించిన రెమ్యూనరేషన్ వివరాలు లీకయ్యాయి. ఆ లెక్కలు అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

అన్నింట్లో ముందుంటూ ఫుల్ ఫేమస్

అన్నింట్లో ముందుంటూ ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే అఖిల్ సార్థక్ తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. టాస్కుల్లో చక్కగా ఆడుతూ.. వీకెండ్ గేమ్స్‌లోనూ సత్తా చాటాడు. తద్వారా ఎన్నో సందర్భాల్లో తన జట్టుకు విజయం అందించాడు. అదే సమయంలో ఫ్రెండ్‌షిప్‌కు విలువ ఇస్తూ మంచి పేరు సంపాదించాడు. ఇలా అన్నింట్లోనూ ముందుంటూ ఫుల్ ఫేమస్ అయిపోయాడు.

మోనాల్ గజ్జర్ వల్ల మరింత పాపులర్

మోనాల్ గజ్జర్ వల్ల మరింత పాపులర్


అఖిల్ సార్థక్.. ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్ ట్రాకు వల్ల బాగా పాపులర్ అయ్యాడు. చనువుగా ఉండడంతో పాటు ఆమెకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేవారు.

పులి.. అఖిలే నెంబర్ వన్ అని గొడవ

పులి.. అఖిలే నెంబర్ వన్ అని గొడవ

బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన గొడవల్లో అఖిల్ సార్థక్ పాలుపంచుకున్నవే చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అభిజీత్‌తో అతడు తరచూ వాగ్వాదానికి దిగేవాడు. తనను తాను పులి అని సంబోధించుకోవడంతో పాటు అఖిలే నెంబర్ వన్ అని ఎప్పుడూ చెప్పుకుంటుండేవాడు. ఈ కారణంగానూ పలుమార్లు నామినేషన్‌లోకి వచ్చాడు. కానీ, ప్రేక్షకుల మద్దతుతో సేఫ్ అయ్యాడు.

ఎన్నో మలుపుల మధ్య రెండో స్థానం

ఎన్నో మలుపుల మధ్య రెండో స్థానం

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో బెస్ట్ కంటెస్టెంట్ అనిపించుకున్నాడు అఖిల్ సార్థక్. కానీ, అభిజీత్ ఫ్యాన్స్ తాకిడికి తట్టుకోలేకపోయాడు. దీంతో రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. అతడు టైటిల్‌ను ఎగరేసుకుని పోయాడు. వాస్తవానికి సయ్యద్ సోహెల్ రియాన్ బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల ఆఫర్‌కు అంగీకరించడం వల్లే అఖిల్ టాప్-2కి చేరుకున్నాడు. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో.

అఖిల్ సార్థక్ రెమ్యూనరేషన్ వివరాలు

అఖిల్ సార్థక్ రెమ్యూనరేషన్ వివరాలు

నాలుగో సీజన్ పూర్తయిన తర్వాత టాప్ -5 కంటెస్టెంట్లు అంతా వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రహస్యాలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే రెమ్యూనరేషన్ వివరాలూ లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ తీసుకున్న పారితోషికం కూడా బయటకు వచ్చింది. ఈ లెక్కలు చాలా మందని ఆశ్చర్యపరుస్తున్నాయి.

బిగ్ బాస్ రన్నరప్ కంటే అతడికే ఎక్కువ

బిగ్ బాస్ రన్నరప్ కంటే అతడికే ఎక్కువ

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగాడు. అతడు రోజుకు రూ. 25 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 26 లక్షల 25 వేలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. అయితే, తన తర్వాతి స్థానంలో ఉన్న సోహెల్ మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన రూ. 25 లక్షలతో మొత్తంగా రూ. 51 లక్షల వరకు సంపాదించాడని టాక్.

Recommended Video

AR Rahman Mother Kareema Begum Passes Away | ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణం..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X