పైన బిందుమాధవి కింద తేజస్విని.. మధ్యలో అఖిల్ సార్ధక్.. హాట్ టచ్చింగ్స్ తో రచ్చ రచ్చ!

బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో ప్రత్యేక ఆదరణ ఉంది. అందుకే వరుస పెట్టి సీజన్లతో కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ గతేడాది డిసెంబర్ 18న పూర్తయింది. 2023లో మరో కొత్త సీజన్ తీసుకువచ్చేందుకు సమయం ఉంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులను, బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రియాలిటీ డ్యాన్స్ షోతో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జోడీలుగా అదరగొడుతున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో ఎప్పుడూ గొడవ పడిన అఖిల్ సార్థక్, బిందు మాధవి తాజాగా హాట్ రొమాన్స్ తో ఆకట్టుకున్నారు.

 న్యాయ నిర్ణేతలుగా..

న్యాయ నిర్ణేతలుగా..

గతేడాది ప్రారంభించిన బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షో నిర్విర్యామంగా సాగుతోంది. ఈ బీబీ జోడీకి యాంకర్ గా బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అలనాటి స్టార్ హీరోయిన్ రాధ, బ్యూటిఫుల్ సదాతోపాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా కొనసాగుతున్నారు.

మొత్తంగా 8 గ్రూపులు..

మొత్తంగా 8 గ్రూపులు..

బిగ్ బాస్ హౌజ్ లో గేమ్స్, టాస్కులతో ఎంటర్టైన్ చేసిన కంటెస్టెంట్స్ ఇప్పుడు బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో తమదైన నాట్య ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. రోజురోజుకీ పర్ఫామెన్స్ ఇంప్రూవ్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ షోలో జోడీలుగా.. అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ మొత్తంగా 8 గ్రూపులు పాల్గొంటున్నాయి.

 ముగ్గురుని రంగంలోకి దింపి..

ముగ్గురుని రంగంలోకి దింపి..

ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. వాటి ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు బీబీ నిర్వాహకులు. అందులో భాగంగానే ఈవారం వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అయితే ఈ సారి రెగ్యులర్ జోడీలుగా ఇద్దరు కాకుండా ముగ్గురుని రంగంలోకి దించారు.

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్..

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్..

జోడీలుగా ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇస్తున్న ఈ రౌండ్ కు 'తీన్ మార్ స్పెషల్' అని పేరు పెట్టారు. ఈ తీన్ మార్ స్పెషల్ లో కొత్తగా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విన్నర్ బిందు మాధవి, బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ కంటెస్టెంట్ మానస్, ప్రియాంక, బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ నేహా చౌదరి, మెహబూబ్ రూమర్డ్ లవర్ శ్వేతా నాయుడు, సీరియల్ యాక్టర్ అమర్ దీప్ తదితరులు ఎంట్రీ ఇచ్చారు.

అఖిల్ తో బిందు మాధవి..

అఖిల్ తో బిందు మాధవి..

శ్రీముఖి తీన్ మార్ స్పెషల్ అంటూ అనౌన్స్ చేయగానే.. కంటెస్టెంట్లందరీ డ్యాన్స్ క్లిప్ లను చూపించారు. అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ జంటకు బిందు మాధవి, ఆర్జే చైతూ-కాజల్ జోడికి ప్రియాంక, ఆర్జే సూర్య-ఫైమాకు మానస్, అవినాష్-అరియానాకు అమర్ దీప్, మెహబూబ్-శ్రీ సత్యకు శ్వేతా నాయుడు, కౌశల్-అభినయ శ్రీ జోడికి నేహా చౌదరి సపోర్టింగ్ గా నిలిచి డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశారు.

బిందును ఎత్తుకుని అఖిల్..

బిందును ఎత్తుకుని అఖిల్..

ప్రోమో మొదట్లో.. "ఒరేయ్ అఖిల్ గా.. ఇప్పుడైనా రిలాక్స్ అవ్వు.. నువ్వు.. నీ ఓవరాక్షన్" అని బిందు మాధవి అంటే.. "ఒసేయ్ బిందు నేను రిలాక్స్ డ్ గానే ఉన్నా.. ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు" అని అన్నాడు. దీంతో కల్పించుకున్న తేజస్వి మదివాడ.. అరే ఆపండ్రా.. ఇది బిగ్ బాస్ కాదు.. బీబీ జోడీ అని తేజస్వీ అంది. తర్వాత ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో బిందును ఎత్తుకుని అఖిల్ ఉంటే తేజస్వి కింద ఉండి డ్యాన్స్ చేశారు. వీళ్ల డ్యాన్స్ ను వండర్ ఫుల్ కంపెనీ అంటూ రాధ కాంప్లిమెంట్ ఇచ్చారు.

 హాట్ టచింగ్స్ తో..

హాట్ టచింగ్స్ తో..

అఖిల్ డ్యాన్స్ తర్వాత మెహబూబ్-శ్వేతా నాయడు-శ్రీ సత్య ముగ్గురు కలిసి హాట్ టచింగ్స్ తో డ్యాన్స్ చేసి హాట్ ఫర్మామెన్స్ ఇచ్చారు. శ్రీసత్యను మెహబాబు భుజంపై ఎత్తుకోగా.. శ్వేతా నాయడు కింద ఉండి ముగ్గురు డ్యాన్స్ తో అదరగొట్టారు. తర్వాత శ్రీసత్య-శ్వేతా నాయుడు ఇద్దరు కలిసి మెహబూబ్ కి ముద్దు పెట్టి మరింత హీట్ పుట్టించారు. బావ గారి మనోభావాలు దెబ్బ తిన్నాయే అనే పాటకు అదిరిపోయే స్టెప్పులతో హాట్ పర్ఫామెన్స్ ఇచ్చారు ఈ ముగ్గురు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X