మోనాల్‌తో కలవడంపై అఖిల్ సంచలన వ్యాఖ్యలు: మా ఇద్దరికీ సెట్ అవట్లేదు.. ఆమెకు వేరేవి ఉన్నాయంటూ!

తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని, నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ గ్రాండ్‌గా ఎంటరైన ఈ షో.. ఎంతో మందిని బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అందులో కొందరు మాత్రమే జంటలుగా ఫేమస్ అయ్యారు. వారిలో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. బిగ్ బాస్‌లో రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా హల్‌చల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అఖిల్... మోనాల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంగతులు మీకోసం!

 ఒకటి అనుకుంటే.. మరొకటి అయిందిగా

ఒకటి అనుకుంటే.. మరొకటి అయిందిగా

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్.. యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. సరిగ్గా అప్పుడే వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇవ్వడంతో ట్రైయాంగిల్ లవ్ అన్న టాక్ వినిపించింది. అప్పుడే ఊహించని విధంగా మోనాల్.. అభిని కాదని అఖిల్‌తో లవ్ ట్రాక్ నడపడం మొదలు పెట్టింది.

హౌస్‌లో రచ్చ... లవ్ రొమాన్స్‌లో జంట

హౌస్‌లో రచ్చ... లవ్ రొమాన్స్‌లో జంట

రోజులు గడిచిన కొద్దీ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ మరింత ఎక్కువైపోయింది. దీంతో బయట ప్రేక్షకులతో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్లు కూడా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరచుకుంటూ గడిపారు. అదే సమయంలో హౌస్‌లో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచారు. తద్వారా బాగా హైలైట్ అయ్యారు.

బిగ్ బాస్... అతడికిలా... ఆమెకు ఇలా

బిగ్ బాస్... అతడికిలా... ఆమెకు ఇలా

బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ సన్నద్ధం అవుతున్నాడు.

బయటకు వచ్చాక కూడా జోడీ హల్‌చల్

బయటకు వచ్చాక కూడా జోడీ హల్‌చల్

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

ప్రేమికుల రోజున ప్రకటన.. అప్‌డేట్ లేదు

ప్రేమికుల రోజున ప్రకటన.. అప్‌డేట్ లేదు

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

మోనాల్‌తో కలవడంపై అఖిల్ వ్యాఖ్యలు

మోనాల్‌తో కలవడంపై అఖిల్ వ్యాఖ్యలు

అఖిల్ సార్థక్.. ఇటీవలే హీరోగా తన మొదటి చిత్రం 'ఫస్ట్ టైమ్'ను ప్రకటించాడు. ఐ హేమంత్ నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అనిక విక్రమన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా విశేషాలను పంచుకునేందుకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అఖిల్. ఈ సందర్భంగా ఎన్నో అంశాలను వెల్లడించాడు. అదే సమయంలో మోనాల్ గజ్జర్‌ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Recommended Video

Ek Mini Katha Film బోల్డ్ గా కొత్తగా | Santosh Shoban And Kavya Fun Moments | Filmibeat Telugu
వేరేవి ఉన్నాయి.. ఇద్దరికీ సెట్ అవట్లేదు

వేరేవి ఉన్నాయి.. ఇద్దరికీ సెట్ అవట్లేదు

ఈ ఇంటర్వ్యూలో 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' వెబ్ సిరీస్ ఇంకా మొదలవకపోడానికి కారణమేంటి అని యాంకర్ అడిగాడు. దీనికి 'మోనాల్ గజ్జర్‌కు చాలా ఆఫర్లు ఉన్నాయి. నాకు కూడా ఈ సినిమా డేట్స్ ఫుల్ అయ్యాయి. వాటి వల్ల మా ఇద్దరికీ సెట్ అవడం లేదు. ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ అయినప్పుడు ఆ సిరీస్ పూర్తి చేస్తాం' అంటూ క్లారిటీ ఇచ్చాడీ స్టార్ బాయ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X