ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా: అసలు విషయం లీక్ చేసిన అఖిల్.. మోనాల్‌ పరిస్థితేంటి మరి?

అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు యంగ్ యాక్టర్ అఖిల్ సార్థక్. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ కాలేకపోయాడు. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం విపరీతంగా పాపులారిటీని అందుకున్నాడు. హౌస్‌లో చక్కని ఆటతీరుతో పాటు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగించిన కారణంగానే అతడు ఫేమస్ అయ్యాడు. దీంతో బయటకొచ్చాక ఫుల్ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసుకోబోయే అమ్మాయి గురించి లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

మోడల్‌గా ఎంట్రీ.. యాక్టర్‌గా పేరు

మోడల్‌గా ఎంట్రీ.. యాక్టర్‌గా పేరు


మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, 'కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిశాడు. ఇలా ఫేమస్ అవడంతో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్‌ ఎంట్రీ... ఆటలో సూపర్

బిగ్ బాస్‌ ఎంట్రీ... ఆటలో సూపర్

గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అఖిల్ సార్థక్.. తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ముక్కుసూటిగా ఉంటూ.. తనకు తోచింది చెబుతూ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, పెద్ద బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోనూ తన శ్రమను చూపిస్తూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టాస్కుల్లో కింగ్ అనిపించుకుంటూ ముందుకు సాగాడు.

ఆమెతో ప్రేమాయణం... రొమాన్స్

ఆమెతో ప్రేమాయణం... రొమాన్స్

బిగ్ బాస్ హౌస్‌లో మొదట్లో సోలోగానే ప్రయాణం సాగించిన అఖిల్ సార్థక్.. కొద్ది రోజులకు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ హాట్ టాపిక్‌గా మారాడు. అంతేకాదు, ఆ తర్వాత ప్రేమాయణం సాగిస్తూ, రొమాన్స్ డోస్ పెంచుతూ హగ్గులు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు.

Recommended Video

Singer Sunitha Wedding ఆదర్శప్రాయం అంటున్న Naga Babu !
బయట కూడా కలిసే తిరుగుతూ

బయట కూడా కలిసే తిరుగుతూ

ఎన్నో అంచనాలతో గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టిన అఖిల్ సార్థక్.. రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో నిరాశకు లోనైనప్పటికీ.. బయట వచ్చిన క్రేజ్‌తో సంతోషంగా ఉన్నాడు. ఇక, షో తర్వాత కూడా మోనాల్ - అఖిల్ లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతోంది. తరచూ వీళ్లిద్దరూ కలిసి రచ్చ చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీని కూడా ఒకే చోట జరుపుకున్నారీ బిగ్ బాస్ లవర్స్.

అసలు విషయం లీక్ చేసిన అఖిల్

అసలు విషయం లీక్ చేసిన అఖిల్

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నాడు అఖిల్ సార్థక్. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన వివాహం గురించి క్లారిటీ ఇచ్చాడు. 'పెళ్లికి కొంచెం టైమ్ పట్టొచ్చు. ఎప్పుడు చేసుకున్నా ప్రేమ వివాహమే చేసుకుంటా' అని లీక్ చేసేశాడు అఖిల్.

ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని

ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని

దీనిని కొనసాగిస్తూ.. 'జీవిత భాగస్వామిగా ఉండే అమ్మాయి మనల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలా జరగాలంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే సాధ్యం అవుతుంది. అందుకే ముందు ప్రేమించి, తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. కచ్చితంగా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటా' అని అఖిల్ వివరించాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన వారంతా మోనాల్ పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X