సంక్రాంతి లోపు శుభవార్త చెబుతా.. ముందే లీక్ చేస్తే ఇంట్లో వాళ్లు చంపేస్తారు: అఖిల్ షాకింగ్ కామెంట్స్
అఖిల్ సార్థక్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నాడీ కుర్రాడు. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టిన అతడు.. తనదైన వ్యవహార శైలితో గుర్తింపు పొందాడు. వైవిధ్యమైన యాటిట్యూడ్‌తో ప్రత్యేకతను చాటుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగించి పాపులర్ అయ్యాడు. షో నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి లోపు శుభవార్త చెబుతా అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం!

అలా కెరీర్‌ను మొదలు పెట్టిన అఖిల్
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో ‘బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, ‘కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిశాడు. ఇలా ఫేమస్ అవడంతో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ.. టాస్కుల్లో కింగ్
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అఖిల్ సార్థక్.. తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ముక్కుసూటిగా ఉంటూ.. తనకు తోచింది చెబుతూ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, పెద్ద బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోనూ తన శ్రమను చూపిస్తూ సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టాస్కుల్లో కింగ్ అనిపించుకుంటూ ముందుకు సాగాడు.

హీరోయిన్‌తో ప్రేమాయణం.. రొమాన్స్
బిగ్ బాస్ హౌస్‌లో మొదట్లో సోలోగానే ప్రయాణం సాగించిన అఖిల్ సార్థక్.. కొద్ది రోజులకు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ హాట్ టాపిక్‌గా మారాడు. అంతేకాదు, ఆ తర్వాత ప్రేమాయణం సాగిస్తూ, రొమాన్స్ డోస్ పెంచుతూ హగ్గులు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు.

బయటకొచ్చిన తర్వాత జంట హల్‌చల్
ఎన్నో అంచనాలతో గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టిన అఖిల్ సార్థక్.. రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో నిరాశకు లోనైనప్పటికీ.. బయట వచ్చిన క్రేజ్‌తో సంతోషంగా ఉన్నాడు. ఇక, షో తర్వాత కూడా మోనాల్ - అఖిల్ లవ్ ట్రాక్ కంటిన్యూ అవుతోంది. తరచూ వీళ్లిద్దరూ కలిసి రచ్చ చేస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీని కూడా ఒకే చోట జరుపుకున్నారీ బిగ్ బాస్ లవర్స్.

సంక్రాంతి లోపు శుభవార్త చెబుతానని
బిగ్ బాస్ షో తర్వాత అఖిల్ సార్థక్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇంటికి వస్తున్న ఫ్యాన్స్‌తో ముచ్చటించడంతో పాటు వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్ గురించి మాట్లాడుతూ.. సంక్రాంతి లోపు శుభవార్త చెబుతానంటూ ప్రకటించాడు.

ముందే లీక్ చేస్తే మా వాళ్లు చంపుతారు
దీని గురించి మాట్లాడుతూ.. ‘నాకు చాలా సినిమా, వెబ్ సిరీస్‌ల ఆఫర్లు వస్తున్నాయి. వాటిని ముందే రివీల్ చేయను. అన్నీ ఓకే అయిన తర్వాతనే ప్రకటిస్తాను. సంక్రాంతి లోపే శుభవార్త చెబుతాను. మా ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ఒకవేళ చెబితే.. ఏమైంది ఏమైంది అని నన్ను చంపేస్తారు. అందుకే అందరికీ ఒకేసారి నా ప్రాజెక్టుల గురించి చెబుతా' అని వివరించాడు అఖిల్.


Click it and Unblock the Notifications











