మోనాల్‌తో అఖిల్ సార్థక్ బ్రేకప్: తేజస్వీతో డేటింగ్ అంటూ.. పెళ్లి అప్పుడేనని బాంబ్ పేల్చేశాడుగా!
ఈ మధ్య కాలంలో తెలుగులో ఎంతో మంది కుర్రాళ్లు మోస్ట్ పాపులర్ అయ్యారు. తద్వారా బుల్లితెరపైనో, వెండితెరపైనో ఆఫర్లను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ ఒకడు. బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వెళ్తోన్నాడు. అలాగే, లవ్ ట్రాకులతోనూ అతడు తరచూ హైలైట్ అవుతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ సార్థక్.. మోనల్ గజ్జర్, తేజస్వీ మదివాడతో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

అలా పాపులర్ అయిన అఖిల్
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన అఖిల్ సార్థక్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, 'కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిశాడు. ఇలా ఫేమస్ అవడంతో బిగ్ బాస్‌లోకి ఛాన్స్ పొందాడు.

లవ్ ట్రాక్‌తో ఫుల్ పాపులారిటీ
బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంటగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో తరచూ రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమ పక్షులే అని అందరూ డిసైడ్ అయిపోయారు. అదే బయట కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు.

నాన్ స్టాప్ ఛాన్స్.. మళ్లీ నిరాశ
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్థక్.. గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ మొదటి సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఇందులో గతంలో కంటే చక్కని ఆటతీరును కనబరిచిన అతడు.. తన క్రేజ్‌ను, ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకున్నాడు. ఇలా ఎన్నో అంచనాలతో ఫినాలేలో అడుగు పెట్టాడు. కానీ, తుది మెట్టుపై మరోసారి బోల్తాపడి రన్నర్‌గా మిగిలాడు.

బీబీ జోడీలో ఆమెతో హల్చల్
బిగ్ బాస్ పుణ్యమా అని వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటోన్న అఖిల్ సార్థక్.. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో తేజస్వీ మదివాడతో కలిసి జంటగా సందడి చేస్తోన్నాడు. అంతేకాదు, వీళ్లిద్దరూ అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఇస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా ఈ షోలోని టాప్ జోడీల్లో ఒకటిగా నిలుస్తూ టైటిల్ దిశగా సాగుతోన్నారు.

మోనాల్ కావాలా? తేజస్వీనా
అఖిల్ సార్థక్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడని తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ (ASK ME) సెషన్ నిర్వహించాడు. ఇందులో ఓ నెటిజన్ 'మోనాల్ కావాలా? తేజస్వీ కావాలా' అని ప్రశ్నించాడు. దీనికి అఖిల్ సార్థక్ సమాధానం చెప్పలేను అని అన్నాడు. తద్వారా మోనాల్‌తో బ్రేకప్ అయిందని పరోక్షంగా ఒప్పుకున్నాడు.

తేజస్వీతో డేటింగ్‌పై క్లారిటీ
ఈ సెషన్‌లో మరో నెటిజన్ 'తేజస్వీతో డేటింగ్ చేస్తున్నావా' అని అఖిల్ సార్థక్‌ను ప్రశ్నించాడు. దీనికి అతడు 'ఏ విషయంలోనైనా జనాలు చాలా త్వరగా ఓ డెసిషన్‌కు వచ్చేస్తారు. తేజస్వి, నేను ఒక మంచి స్పేహితులమని మీరు ఎందుకు అనుకోవడం లేదు. మేము కలిసి వర్క్ చేసినంత మాత్రాన డేటింగ్ చేస్తున్నాం అని అర్థం కాదు కదా' అంటూ వివరణ ఇచ్చాడు.

పెళ్లి అప్పుడే అని కామెంట్
ఆ తర్వాత అఖిల్ సార్థక్ రిలేషన్ మీద కూడా క్లారిటీ ఇచ్చాడు. 'నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేను. పెళ్లి కూడా 32-33 వయసు వచ్చాకా చేసుకుందాం అనుకుంటున్నాను. దయచేసి అందరూ ఇది గమనించాలి' అని చెప్పుకొచ్చాడు. మొత్తంగా అతడు అటు మోనాల్‌తో కానీ, ఇటు తేజస్వీతో కానీ డేటింగ్‌లో లేనని వెల్లడించాడు. దీనిపై అఖినాల్ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











