Just In
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్: అఖిల్ సార్థక్ తీరుతో పెరిగిన అనుమానాలు
అఖిల్ సార్థక్.. రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం అతడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉండడమే. మిగిలిన వారితే పోల్చితే యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతడు.. హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం, తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో గొడవల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, ఈ వారం మాత్రం అతడి ప్రవర్తనలో మార్పులు బాగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా గుర్తింపు.. సీరియల్స్‌లో యాక్టింగ్
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ హైరదాబాద్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ప్రముఖ చానెల్‌లో ప్రసారమైన ‘ముత్యాల ముగ్గు' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ‘ఎవరే నువ్వు మోహినీ', ‘కల్యాణీ' వంటి సీరియళ్లలో అత్యుత్తమ నటనతో ఆకట్టుకున్నాడీ హైదరాబాదీ కుర్రాడు.

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్‌స్టర్
మోడలింగ్ రంగం ద్వారా, సీరియళ్ల ద్వారా వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు అఖిల్ సార్థక్. ‘అఖిల్' సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఫస్ట్ లుక్‌తోనే ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ చిన్నప్పుడు నటించిన ‘సిసింద్రీ' సినిమా టైమ్‌లో పుట్టానని, అందుకే తనకు అఖిల్ అని పేరు పెట్టారని చెప్పుకొచ్చాడు.

మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణంతో క్రేజ్
బిగ్ బాస్ హౌస్‌లో సహచర కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగించడం ద్వారా అఖిల్ సార్థక్ విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, తరచూ కలిసే కనిపించడం, ముద్దులు పెట్టుకోవడం, హగ్గులిచ్చుకోవడంతో పాటు టాస్కుల్లో సహకరించడం వంటి వాటితో హైలైట్ అయ్యాడు. ఇదే అతడిపై విమర్శలు చెలరేగడానికీ కారణం అయింది.

అభిజీత్‌తో గొడవలు.. యాంగ్రీ పర్సన్
తన వివాదాస్పద ప్రవర్తనతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు అఖిల్. తరచూ అభిజీత్‌తో గొడవలకు దిగడంతో పాటు యాటిట్యూడ్ చూపిస్తాడని విమర్శలు కూడా చెలరేగాయి. టాస్కుల సమయంలో మాత్రం నిజాయితీగా ఆడతాడని, అందుకోసం అవసరమైతే స్నేహితులతో కూడా గొడవలకు దిగుతాడని మంచి పేరు వచ్చింది.

12వ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్
రెండు వారాల క్రితం అఖిల్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. ఆ వెంటనే కెప్టెన్ అయ్యాడు. ఇక, ఈ వారం ఊహించని విధంగా నామినేట్ అయ్యాడు. అతడితో పాటు మోనాల్ గజ్జర్, అవినాష్, ఆరియానా కూడా ఈ జాబితాలో ఉన్నారు. అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారన్న దానిపై క్లారిటీ రావట్లేదు. ఈ నేపథ్యంలో ట్విస్ట్ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

అఖిల్ తీరుతో పెరిగిన అనుమానాలు
ప్రస్తుతం నామినేషన్స్‌లో ఉన్న వారిలో అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంటే. అయినప్పటికీ గత ఎపిసోడ్‌లో బాగా ఏడ్చాడు. దీనికి కారణం తాను ఎలిమినేట్ అవుతానేమోనన్న భయమేనని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఓవరాల్‌గా ఇటీవల కొంచెం డల్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌లో ఏదైనా షాక్ తగలబోతుందా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.