ఉయ్యాల మీద నుంచి నెట్టెయ్.. ఎమోషనల్‌గా దూకేసిన సోహెల్.. షాక్ తిన్న అభిజిత్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 89 రోజు సోహెల్, అఖిల్ మధ్య ఎమోషన్లు సీన్లు, అలాగే అవినాష్ ఆటపాటలతో వినోదంగా మారింది. ఇక బిగ్‌బాస్ ఫైనల్‌లోకి ప్రవేశించిన అఖిల్ సార్థక్ మరింత ఎమోషనల్‌గా కనిపించాడు. ఇక ఇంటిలో 89వ రోజు ఏం జరిగిందంటే..

పోటాపోటీగా అఖిల్, సోహెల్

పోటాపోటీగా అఖిల్, సోహెల్

గురువారం ఎపిసోడ్‌లో ప్రారంభమైన రోడ్ టూ ఫినాల్ టాస్క్‌ శుక్రవారం ఉదయం వరకు సాగింది. అయితే ఇద్దరు పోటాపోటీగా ఆడటంతో టాస్క్ సుదీర్ఘంగా సాగింది. అయితే ఒక దశలో సోహెల్, అఖిల్ ఎమోషనల్ అయ్యారు. నేను దిగిపోతానంటే.. నేను దిగిపోతాను అంటూ ఒకరికి ఒకరు సముదాయించుకొన్నారు. అలా నిద్రహారాలు మానేసి టాస్క్ కొనసాగించారు.

నన్ను నీవు నెట్టేయ్ అంటూ

నన్ను నీవు నెట్టేయ్ అంటూ


ఇక శుక్రవారం ఉదయం అఖిల్ ఎమోషనల్‌గా స్పందిస్తూ.. నన్ను నీవు నెట్టేయ్ అంటూ సోహెల్‌కు చెప్పాడు. దాంతో సోహెల్ భావోద్వేగానికి గురయ్యారు. ఇంటిలో నన్ను బాగా చూసుకొన్నావు. నాకు బ్రదర్‌గా అండగా నిలిచావు అని చెప్పాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఉయ్యాల మీద నుంచి దూకేయడంతో అఖిల్ షాక్ తిన్నాడు.

గుండెలకు హత్తుకొన్న అభిజిత్

గుండెలకు హత్తుకొన్న అభిజిత్

ఉయ్యాల మీద నుంచి దూకిన సోహెల్‌ను అఖిల్ వచ్చి గుండెలకు హత్తుకొన్నాడు. అయితే సంచాలకుడిగా వ్యవహరిస్తున్న అభిజిత్ వారిద్దరి చూసి పరుగెత్తుకొంటూ వచ్చాడు. అనంతరం ఇద్దరిని కౌగిలించుకొని వారిని ఓదార్చారు. అంతటితో టాస్క్ ముగిసిందని అభిజిత్ డిక్లేర్ చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
అఖిల్‌కు బిగ్‌బాస్ అభినందన

అఖిల్‌కు బిగ్‌బాస్ అభినందన


ఆ తర్వాత అఖిల్‌ను ఉద్దేశించి బిగ్‌బాస్ మాట్లాడుతూ.. రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో విజేతగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు ఫైనల్‌కు చేరిన మొదటి కంటెస్టెంట్‌వి. మీరు ఎప్పుడు ఫినాలే మెడల్‌‌ను ఎప్పుడు తీసుకోవాలో సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ బిగ్‌బాస్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X