మోనాల్‌ గజ్జర్‌కు ఝలక్ ఇచ్చిన అఖిల్ ఫ్యామిలీ: లైవ్‌లోనే అలా జరగడంతో ఫీలైపోయింది

మోనాల్ గజ్జర్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. ఆ మధ్య కాలంలో తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు.. బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి వెళ్లిన తర్వాత ఆమె సొంతమైంది. అంతేకాదు, అక్కడ అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగించడం ద్వారా మరింత పాపులర్ అయింది. నాలుగో సీజన్ పూర్తయిన తర్వాత అతడితో లైవ్ చాట్ నిర్వహించిందామె. ఆ సమయంలో అఖిల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ఝలక్ ఇవ్వడంతో మోనాల్ గజ్జర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ముద్దులు.. హగ్గులతో రెచ్చిపోయిన జంట

ముద్దులు.. హగ్గులతో రెచ్చిపోయిన జంట

బిగ్ బాస్ హౌస్‌లో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలోనే హోస్ట్ అక్కినేని నాగార్జునతో మాట్లాడుతూ తన మనసులో A అనే వ్యక్తి ఉన్నాడని చెప్పింది. దీంతో అఖిల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తుందని అందరిలోనూ నాటుకుపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ హైలైట్ అయ్యారు.

ఎలిమినేట్ అయిన తర్వాత అతడికి సపోర్ట్

ఎలిమినేట్ అయిన తర్వాత అతడికి సపోర్ట్

చాలా వారాల పాటు నామినేషన్‌లోకి వచ్చింది మోనాల్ గజ్జర్. సరిగా ఆడడం లేదనో.. తమతో గొడవలు పెట్టుకుంటుందనో చాలా మంది కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ చేశారు. దీంతో పలుమార్లు ఆమె డేంజర్ జోన్‌లోకి సైతం వెళ్లినా ఎలిమినేట్ కాలేదు. కానీ, చివరి వారంలో మాత్రం బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి టాప్ -లో ఉన్న అఖిల్‌కు మద్దతు తెలిపి తన ప్రేమను చాటుకుంది.

బిగ్ బాస్ ప్లస్... అమ్మడికి కలిసొచ్చిన షో

బిగ్ బాస్ ప్లస్... అమ్మడికి కలిసొచ్చిన షో

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయిందనే చెప్పాలి. వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. కొన్ని చిత్రాలకు అప్పుడే సంతకాలు కూడా చేసేసిందని అంటున్నారు. అలాగే, పలు వెబ్ సిరీస్‌లలో నటించబోతుందని కూడా టాక్ నడుస్తోంది. అంతేకాదు, బిగ్ బాస్ ద్వారా రూ. 90 లక్షలు దాకా చార్జ్ చేసిందని వినికిడి.

అఖిల్‌తో లైవ్ చాట్ నిర్వహించిన మోనాల్

అఖిల్‌తో లైవ్ చాట్ నిర్వహించిన మోనాల్

గత ఆదివారం గ్రాండ్ ఫినాలే జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎపిసోడ్‌లో మిస్టర్ కూల్ అభిజీత్ విజేతగా నిలిచాడు. అలాగే, యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ సార్థక్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన వారందరూ ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో మోనాల్‌ గజ్జర్‌తో కలిసి లైవ్ చాట్ నిర్వహించాడు అఖిల్ సార్థక్.

మోనాల్‌‌కు ఝలక్ ఇచ్చిన అఖిల్ ఫ్యామిలీ

మోనాల్‌‌కు ఝలక్ ఇచ్చిన అఖిల్ ఫ్యామిలీ

లైవ్‌లో మాట్లాడుకుంటూ మోనాల్‌ను తన ఇంటికి రావాలని పిలిచాడు అఖిల్. దీంతో ‘నువ్వు నాకు లొకేషన్ పంపించావా? అసలు కాల్ చేస్తే రిప్లై ఇచ్చావా' అని ప్రశ్నించింది. దీనికి ‘నువ్వెప్పుడు కాల్ చేశావ్' అని బదులు అడిగాడు. వెంటనే మోనాల్ ‘నేను చేశా. మీ వాళ్లు మాట్లాడారు' అంది. అప్పుడు కుటుంబ సభ్యులను అడిగితే నిజమేనని చెప్పడంతో అతడు షాకయ్యాడు.

కావాలనే చెప్పలేదా? అనుమానాలు స్టార్ట్

కావాలనే చెప్పలేదా? అనుమానాలు స్టార్ట్

మోనాల్ గజ్జర్.. అఖిల్ కోసం కాల్ చేసినా.. అతడి కుటుంబ సభ్యులు చెప్పలేదు. ఈ విషయంలో లైవ్‌లోనే ఒప్పుకున్నారు. దీంతో అసలు వాళ్లెందుకు కాల్ చేసిన విషయం చెప్పలేదు అని అంతా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ క్లోజ్‌గా ఉండడం అఖిల్ ఫ్యామిలీకి ఇష్టం లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ జంట హాట్ టాపిక్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X