దివి ఎలిమినేషన్ వెనుక అఖిల్ పాత్ర: అలా చేయడం వల్లే ఔట్.. లీకైన మాస్టర్ ప్లాన్.!
తెలుగులో మరే షోకూ రాని అద్భుతమైన స్పందనను అందుకుంటూ నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పుడూ చూడని కొత్త అంశాలతో ప్రసారం అవుతోన్నప్పటికీ.. దీనికి ఇక్కడి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కారణంగానే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. గత నెలలో మొదలైన నాలుగో సీజన్ ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో షో నుంచి దివి ఎలిమినేట్ అవడం చాలా మందిలో అసహనాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆమె బయటకు వెళ్లిపోవడం వెనుక మాస్టర్ ప్లాన్ ఒకటి లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

మహేశ్ బాబు సినిమాతో దివికి గుర్తింపు
మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది దివి. తెలుగు అమ్మాయే అయినా అందంలో ఉత్తరాది వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈమె.. చాలా సినిమాల్లో నటించింది. కెరీర్ ఆరంభంలో ‘లెట్స్ గో', ‘సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అయితే, మహేశ్ బాబు నటించిన ‘మహర్షి'తో ఆమెకు మంచి గుర్తింపుతో పాటు వరుసగా అవకాశాలు వచ్చాయి.

బిగ్ బాస్‌తో మారిన సీన్... పెరిగిన క్రేజ్
చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు రావడంతో.. దివికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిందో లేదో ఆమెకు విశేషమైన పాపులారిటీ వచ్చింది. సొట్టబుగ్గల సుందరిగా పేరొందిన దివికి సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఆటైనా పాటైనా... దుమ్ముదులిపేసింది
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత దివి తన మార్క్ చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. జెన్యూన్‌గా ఆడుతూ, ముక్కసూటిగా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు, ఆటైనా పాటైనా తానే ముందుటూ అదరగొట్టేసింది. మరీ ముఖ్యంగా కొన్ని టాస్కుల్లో దివి ఎంతో కష్టపడింది. దీంతో మగవారికి ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంది.

ఆయన వెనుకే తిరగడంతో చెడ్డ పేరు
బిగ్ బాస్ హౌస్‌లో దివికి ఎవరితోనూ పెద్దగా కలిసి ఉండేది కాదన్న టాక్ ఉంది. అయితే, ప్రముఖ కొరియోగ్రాఫ్ కమ్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్‌తో మాత్రం ఆమె చాలా చనువుగా ఉండేది. అమ్మా అమ్మా అంటూ ఆయన వెనుకే తిరుగుతూ ఉండేది. మరోవైపు రాజశేఖర్ మాత్రం నేను హీరో నువ్వు హీరోయిన్ అంటూ ఆమెను ఆటపట్టించేవాడు. ఈ ట్రాక్ ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా అనిపించేంది.

షో నుంచి దివి ఔట్.. వాళ్లంతా షాక్
నాలుగో సీజన్‌లో అందంతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకున్న వారిలో దివి ఒకరు. గ్లామర్‌గానే కాకుండా ఫైటర్‌గానూ గుర్తింపు తెచ్చుకుని ముందుకెళ్తోన్న సమయంలో.. ఆమె షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఈ ఆదివారం జరిగిన దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో కొత్త హోస్ట్ అక్కినేని సమంత.. దివి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్ షాక్‌లో ఉండిపోయారు.

దివి ఎలిమినేషన్ వెనుక అఖిల్ పాత్ర
దివి ఎలిమినేట్ అయినప్పటి నుంచి బిగ్ బాస్‌పై విమర్శలు వస్తున్నాయి. మోనాల్‌ను సేవ్ చేయడానికే ఆమెను బయటకు పంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. అఖిల్.. మోనాల్‌ను సేవ్ చేయమని తన ఫ్యాన్స్‌ను కోరాడని, అది షోలో ప్రసారం చేయలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె తప్పించుకుందని టాక్.
Recommended Video

మాస్టర్ ప్లాన్‌తో ఎలిమినేటైన బ్యూటీ
మోనాల్‌కు తన అభిమానులతో పాటు అఖిల్ ఫ్యాన్స్ బాగా ఓట్లు వేశారట. అంతేకాదు, ఆమెను సేవ్ చేయడం కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా రన్ చేశారని తెలుస్తోంది. దీని వల్ల దివి కంటే ఆమెకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని బిగ్ బాస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ దివి ఎలిమినేషన్ తర్వాత రియాలిటీ షోపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి.


Click it and Unblock the Notifications











