బిగ్ బాస్ వివాదంలోకి రాహుల్ సిప్లీగంజ్‌: ఇద్దరు కంటెస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలే కారణం.!

By Manoj Kumar P

సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు యంగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్. సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్‌లతో యూత్‌లో క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోన్నాడు. గత ఏడాది జరిగిన సీజన్‌ 3లో బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్.. ఈ సారి హోస్ట్‌గా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇద్దరు కంటెస్టెంట్లను ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై అఖిల్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

సింగర్‌గా సూపర్ సక్సెస్ అయిన రాహుల్

సింగర్‌గా సూపర్ సక్సెస్ అయిన రాహుల్

నాగ చైతన్య నటించిన మొదటి చిత్రం ‘జోష్'లోని ‘కాలేజ్ బుల్లోడా' అనే పాటతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ తర్వాత ‘దమ్ము', ‘ఈగ', ‘రచ్చ', ‘కెమెరామెన్ గంగతో రాంబాబు', ‘కృష్ణవందే జగద్గురం', ‘RX100' సహా ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. వీటితో పాటు పలు ప్రైవేట్ ఆల్బమ్‌లతో విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నాడాతను.

అంచనాలు లేకుండానే ఎంట్రీ... విజేతగా

అంచనాలు లేకుండానే ఎంట్రీ... విజేతగా


గత ఏడాది జరిగిన బిగ్ బాస్ షో మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అతడు.. మొదట్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దూకుడైన వ్యక్తిత్వంలో పలు వివాదాల్లోనూ భాగమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన అతడు ఊహించని రీతిలో విన్నర్‌గా నిలిచాడు.

 తొలిసారి యాక్టర్‌గా.. క్రియేటివ్ డైరెక్టర్‌తో

తొలిసారి యాక్టర్‌గా.. క్రియేటివ్ డైరెక్టర్‌తో

సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాటలతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రాహుల్. ఈ క్రమంలోనే తొలిసారి యాక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రాబోతున్న ‘రంగమార్తాండ'లో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటిస్తున్నారు.

మరో కొత్త ప్రయోగంతో రాహుల్ సిప్లీగంజ్

మరో కొత్త ప్రయోగంతో రాహుల్ సిప్లీగంజ్

సింగర్‌గా, యాక్టర్‌గా పని చేసిన రాహుల్ సిప్లీగంజ్.. ఈ మధ్య హోస్ట్‌గానూ మారిపోయాడు. బిగ్ బాస్‌ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేయడానికి ‘బిగ్ బాస్ బజ్' అనే చిట్ చాట్ షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో దీన్ని హీరో తనీష్ హోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ షోనే రాహుల్ సిప్లీగంజ్‌ నడిపిస్తున్నాడు. దీంతో తరచూ ట్రెండ్ అవుతున్నాడతను.

బిగ్ బాస్ వివాదంలోకి రాహుల్ సిప్లీగంజ్‌

బిగ్ బాస్ వివాదంలోకి రాహుల్ సిప్లీగంజ్‌

బిగ్ బాస్ నిర్వహించే టాక్ షోకు హోస్ట్‌గా పని చేస్తున్నప్పటికీ.. వ్యక్తిగతంగా తనకు నచ్చిన కంటెస్టెంట్లకు మద్దతిస్తున్నాడు రాహుల్. ఈ క్రమంలోనే నోయల్‌ను విన్నర్‌ను చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. ఇక, అతడు వెళ్లిపోయిన తర్వాత అభిజీత్, లాస్య, హారికకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కంటెస్టెంట్లపై కామెంట్ చేసి రాహుల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు.

Recommended Video

Rahul Sipligunj Involved In A Brawl | పబ్బులో ఘర్షణ..!!
ఇద్దరు కంటెస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలే కారణం

ఇద్దరు కంటెస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలే కారణం

ఈ వారానికి సంబంధించిన ఎపిసోడ్ పూర్తవకుండానే నామినేట్ అయిన కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టా స్టోరీలో ‘అభిజీత్, సోహెల్‌ నిజాయితీగా ఆడుతున్నారు. ఈ వారం వాళ్లకే నా మద్దతు' అని రాసుకొచ్చాడు రాహుల్. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది. మరీ ముఖ్యంగా అఖిల్ సార్థక్ ఫ్యాన్స్ అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X