నన్ను కించపరుస్తారా? నేను ఆ పని చేస్తే ఇబ్బందా? మనోళ్లే అంటూ మెహబూబ్, సోహైల్‌పై అఖిల్ ఫైర్

బిగ్‌బాస్ ఇంటిలోని టాస్క్ సందర్బంగా పుష్ అప్స్ కొట్టడంపై సోహైల్, అఖిల్, మెహబూబ్ మధ్య చిన్న విభేదాలు చోటుచేసుకొన్నాయి. పుష్ అప్స్ విషయంపై తనపై కామెంట్స్ చేసిన మెహబూబ్ గురించి సోహైల్‌తో అఖిల్ చర్చించడం కనిపించింది. మెహబూబ్ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకొన్న అఖిల్.. ఆ మాటలను తీవ్రంగా ఖండించారు. సోహైల్, మెహబూబ్‌తో మాట్లాడుతూ..

 101 పుష్ అప్స్ కొట్టావా?

101 పుష్ అప్స్ కొట్టావా?

టీవీఎస్ రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్ కోసం ఇంటి సభ్యులు పుష్ అప్స్ కొట్టాలి. ఈ సందర్బంగా అఖిల్ రికార్డు స్థాయిలో 101 పుష్ అప్స్ కొట్టడంతో మెహబూబ్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అఖిల్‌తో నీవు 101 కొట్టావా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం వివాదంగా మారింది. నన్ను కించపరిచేలా మెహబూబ్ అలా మాట్లాడుతాడా అంటూ అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సోహైల్‌పై అఖిల్ ప్రశ్నల వర్షం

సోహైల్‌పై అఖిల్ ప్రశ్నల వర్షం

అయితే మెహబూబ్ మాట్లాడినప్పడు నీ రియాక్షన్ ఏమిటి? నా గురించి మెహబూబ్ అలా మాట్లాడితే నీవు ఏమన్నావు. మనోళ్లే ఇలా మాట్లాడితే ఎలా అంటూ అఖిల్ ప్రశ్నల వర్షం కురిపించాడు. అందుకు నేను పెద్దగా పట్టించుకోలేదు. నా పని నేను చూసుకొంటూ ఉన్నాను అంటూ సోహైల్ బదులిచ్చాడు.

అలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు

అలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు

సోహైల్ సమాధానంతో సంతృప్తి పడని అఖిల్ తనలోని కోపాన్ని మాటల రూపంలో వేగం పెంచాడు. లాస్ట్ టైమ్ 70 మాత్రమే కొట్టాడు? ఇప్పుడు 100కుపైగా ఎలా కొడుతాడు అని మీరు అనడం సరికాదు అంటూ అఖిల్ క్లాస్ పీకాడు. ఒకడు ఇన్ని కొట్టాడా అనే యాటిట్యూబ్ ఉండకూడదు. వాడు గెలిస్తే నేను ఖుషీగా ఉన్నా. వాడిలా అక్కడి నుంచి వెళ్లిపోలేదు అని అఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

 ఫీలైతే సారీ అఖిల్ అంటూ మెహబూబ్

ఫీలైతే సారీ అఖిల్ అంటూ మెహబూబ్

అఖిల్ వాదనకు మెహబూబ్ సమాధానం ఇస్తూ.. నేను 60యే కొట్టాను. నా కంటే నీవు ఎక్కువ కొట్టాననే విషయం గురించి మాట్లాడనే తప్ప అందులో మరో ఉద్దేశం లేదు అని సమాధానం ఇచ్చాడు. నీ ఫీల్ అయితే సారీ అని సోహైల్ అంటే.. ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దానిని పక్కన పెట్టేశాను అంటూ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు.

నీవు ఫీలైతే నాకు కోపం రాదా?

నీవు ఫీలైతే నాకు కోపం రాదా?

అఖిల్, మెహబూబ్ మధ్య సోహైల్ జోక్యం చేసుకొంటూ.. ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పండిరా అన్నాడు. నీ కంటే ఎక్కువ కొడితే షాక్ ఎందుకు అయ్యావు అంటూ.. గతంలో 70 కంటే ఎక్కువ కొట్టలేదు. ఏకంగా 101 కొడితే ఆశ్చర్యపోయాను. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకొంటున్నావు అని మెహబూబ్ అంటే .. నాకు కొంత గ్యాప్ దొరికింది. నేను కొట్టగలిగాను. దానికి నీవు ఫీల్ అయితే నాకు కోపం రాదా అని అఖిల్ ప్రశ్నించాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
అఖిల్ నన్ను దీంట్లోకి లాగకు

అఖిల్ నన్ను దీంట్లోకి లాగకు

ఆ తర్వాత అఖిల్‌తో ఫీల్ కావొద్దు అంటే.. మీరు ఎవర్రా? మీ గురించి నేను ఫీల్ కావడం ఎందుకు అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు మీరు నన్ను ఈ వ్యవహారంలోకి లాగకు అని సోహైల్ చెప్పాడు. అయితే చివరి వరకు కూడా మెహబూబ్‌పై అఖిల్‌ సీరియస్‌గానే ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X