అఖిల్ - మోనాల్ బండారం బయట పెట్టిన బిగ్ బాస్: వీడియో చూపించి అడ్డంగా బుక్ చేసేశాడు

చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి ఏకంగా అందరూ నామినేట్ అవడంతో ఆటలో వాళ్లంతా వందకు వంద శాతం శ్రమను పెడుతున్నారు. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఓట్లు రాబట్టుకునేందుకు కంటెస్టెంట్లు అందరూ టాస్కులను బాగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో షో మరింత రంజుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ బండారాన్ని బటయ పెట్టాడు బిగ్ బాస్. వాళ్లిద్దరి వీడియో చూపించి అడ్డంగా బుక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

అందరిలో వాళ్లిద్దరూ చాలా పాపులర్

అందరిలో వాళ్లిద్దరూ చాలా పాపులర్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో మూడు ప్రేమ జంటలు కూడా ఉన్నాయి. వాటిలో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. షో ఆరంభంలో పెద్దగా ఫేమస్ కాలేదు కానీ, క్రమంగా వీళ్లిద్దరూ యమ పాపులర్ అయ్యారు. దీంతో ఈ జోడీ మధ్య ప్రేమాయణం సాగుతుందని, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

 ఒకరి కోసం మరొకరు ఆడుతూ అలా

ఒకరి కోసం మరొకరు ఆడుతూ అలా

రోజులు గడుస్తున్న కొద్దీ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమ మరింత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరూ ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు ఇచ్చుకోవడం, రొమాంటిక్‌గా మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక, టాస్కుల విషయంలోనూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు. చాలా టాస్కుల్లో అఖిల్, మోనాల్‌ను గెలిపించేందుకు తెగ కష్టపడ్డాడు.

ఒంటరిగా మిగిలి... టాస్కులు గెలిచి

ఒంటరిగా మిగిలి... టాస్కులు గెలిచి

చాలా రోజుల పాటు అదృష్టం వల్లనో.. బిగ్ బాస్ చలవతోనే ఎలిమినేషన్ తప్పించుకుంటూ వచ్చింది మోనాల్ గజ్జర్. అయితే, కొద్ది రోజులుగా ఆమె ఆట తీరులో మార్పులు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ అఖిల్ సార్థక్ కోసమే ఆరాటపడకుండా ఈ మధ్య గేమ్‌పై దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే హారికను కెప్టెన్‌ను చేసింది. ఆ తర్వాత ఏకంగా ప్రియుడినే నామినేట్ చేసేసింది.

పెరిగిన దూరం... అఖిల్ అలా చేస్తూ

పెరిగిన దూరం... అఖిల్ అలా చేస్తూ

కొన్ని టాస్కుల్లో తనకు మద్దతు ఇవ్వకపోవడంతో పాటు పలుమార్లు నామినేట్ చేయడం కారణంగా అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్‌తో పెద్దగా మాట్లాడడం లేదు. దీంతో ఇద్దరి మధ్యా దూరం పెరుగుతోంది. అదే సమయంలో హౌస్‌లో ఉన్న ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాళ్లిద్దరితోనే ఎక్కువగా సమయాన్ని గడుపుతున్నాడు.

వాళ్ల బండారం బయట పెట్టిన బిగ్ బాస్

వాళ్ల బండారం బయట పెట్టిన బిగ్ బాస్

ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ప్రేక్షకుల మనసులను దోచుకునేందుకు కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇస్తున్నారు. ఇప్పటికే రెండు పూర్తయ్యాయి. గురువారం ఎపిసోడ్‌లో ఏకాగ్రత టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం.. ఏదో ఒక పని చేస్తూనే మనసులో సమయాన్ని లెక్కించి 30 నిమిషాలు అయ్యాక బజర్ మోగించాలి. ఈ సమయంలో మోనాల్, అఖిల్ బండారం బయట పెట్టాడు బిగ్ బాస్.

Recommended Video

Chiranjeevi Helps His Fan Financially For His Daughter's Wedding
వీడియో చూపించి అడ్డంగా బుక్ చేసి

వీడియో చూపించి అడ్డంగా బుక్ చేసి

ఏకాగ్రత టాస్క్ మొదలయ్యే ముందు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్‌కు సహాయం చేస్తానని సీక్రెట్‌గా చెప్పాడు. అప్పుడు టైమ్ అయిపోగానే విజిల్ వెయ్ అని మోనల్ అడిగింది. సమయం అయిపోగానే తాను లేచి నిలుచుంటా అని క్లూ ఇచ్చాడు అఖిల్. ఈ వ్యవహారం మొత్తం చూపించిన బిగ్ బాస్.. అఖిల్ - మోనాల్ మోసం చేస్తున్నట్లు స్వయంగా వెల్లడించడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X