మోనాల్ గురించి ఊహించని ప్రశ్న అడిగిన యాంకర్: నీకెందుకురా అంటూ అఖిల్ సార్థక్ ఫైర్

అఖిల్ సార్థక్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా అతడు తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. దీనికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ వచ్చిన అతడు.. పెద్దగా గుర్తింపును మాత్రం తెచ్చుకోలేకపోయాడు. కానీ, బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల విపరీతంగా పాపులర్ అయ్యాడు. మరీ ముఖ్యంగా మోనాల్ గజ్జర్ వ్యవహారంతో హాట్ టాపిక్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు యాంకర్‌పై ఫైర్ అయ్యాడు. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరి రిలేషన్ అలా మొదలైంది

ఇద్దరి రిలేషన్ అలా మొదలైంది

మోనాల్ గజ్జర్ ఆరంభంలో అభిజీత్‌తో క్లోజ్‌గా ఉండేది. అలా చాలా రోజుల పాటు అతడితో ట్రావెల్ చేసింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ సన్నిహితంగా ఉండడం మొదలు పెట్టింది. ఆ సమయంలో వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందన్న ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ఆమె అభిజీత్‌కు దూరమై.. అఖిల్ సార్థక్‌కు బాగా దగ్గరైంది. ఇలా వీళ్ల బంధం మొదలైంది.

ఒకరికి ఒకరు.. ఎప్పుడూ కలిసే

ఒకరికి ఒకరు.. ఎప్పుడూ కలిసే

బిగ్ బాస్ హౌస్‌లో ఎవరికి వాళ్లే గేమ్ ఆడాలి. కానీ, అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ మాత్రం ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. టాస్కుల్లో సహాయం చేసుకోవడం, నామినేషన్స్‌లో త్యాగాలు చేయడం వంటివి చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎప్పుడూ కలిసే ఉండేవారు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న టాక్ జోరుగా వినిపించింది.

ముద్దులు... హగ్గులు... ఫేమస్

ముద్దులు... హగ్గులు... ఫేమస్

అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం సాగుతుందన్న ప్రచారం మొదలైన తర్వాత వీళ్లు మరింతగా హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ హైలైట్ అయ్యారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు. అంతేకాదు, వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉంటే గొడవలకు దిగేవారు.

షో తర్వాత కూడా కలిసే ఉంటూ

షో తర్వాత కూడా కలిసే ఉంటూ


బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

మోనాల్ గురించి ఊహించని ప్రశ్న

మోనాల్ గురించి ఊహించని ప్రశ్న

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అతడి ఇంటర్వ్యూల కోసం చాలా మంది క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'స్వార్ధం' అనే సినిమా ప్రమోషన్ కోసం అఖిల్ వెళ్లాడు. ఆ సమయంలో ఊహించని విధంగా ఓ యూట్యూబ్ చానెల్ యాంకర్ అతడిని 'మోనాల్‌తో పెళ్లి ఎప్పుడు బ్రదర్' అని ప్రశ్నించాడు.

నీకెందుకురా అంటూ అఖిల్ ఫైర్

నీకెందుకురా అంటూ అఖిల్ ఫైర్


ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. 'భయ్యా నీ పెళ్లి ఎప్పుడు' అని అఖిల్‌ను అడిగాడు. దీంతో సీరియస్‌గా 'నీ పెళ్లి ఎప్పుడు? అసలు నీ వయసు ఎంత' అని బదులు ప్రశ్నించాడు. ఆ తర్వాత యాంకర్ 'మోనాల్‌తోనే కదా నీ పెళ్లి' అని అనగా.. 'అసలు నీకెందుకురా నా పెళ్లి గురించి.. మళ్లీ ఇలాంటి ప్రశ్నలు అడిగావో' అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X