మోనాల్ గజ్జర్‌పై అఖిల్ సార్థక్ సీరియస్: అవన్నీ బయటకు వచ్చాయి.. అబద్ధం చెప్పొద్దంటూ!
తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాధరణను అందుకుని.. సక్సెస్‌ఫుల్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ కారణంగానే మన దగ్గర ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అన్నింటితో పోలిస్తే తాజా సీజన్ బాగా హైలైట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులో లవ్ ట్రాకులు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ ప్రేమాయణం ఎక్కువ ఫోకస్ అయింది. బయట కూడా వీళ్లిద్దరూ అలాగే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోనాల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. ఆ వివరాలు మీకోసం!

ట్రైయాంగిల్ లవ్ నుంచి ఇలా మారిందిగా
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మోనాల్ గజ్జర్. ఎక్కువ సమయం అతడితోనే గడుపుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించింది. అదే టైమ్‌లో ఊహించని విధంగా అఖిల్ సార్థక్‌కు కూడా దగ్గరైంది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తుందని అన్నారు. కానీ, చివరకు మోనాల్ - అఖిల్ ఒక్కటయ్యారు.

అప్పటి నుంచే వీళ్లిద్దరి ట్రాక్ మొదలైంది
మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలోనే ఒక సందర్భంలో నాగార్జునతో మాట్లాడుతూ తన మనసులో A అనే వ్యక్తి ఉన్నాడని చెప్పిందామె. దీంతో అఖిల్‌తోనే మోనాల్ ప్రేమాయణం సాగిస్తుందని అందరూ ఫిక్సయ్యారు. అప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు ఆడుతూ.. కలిసే ఉంటూ రచ్చ రచ్చ చేశారీ ఇద్దరు.

రొమాన్స్‌తో మరింత హైలైట్ అయిన జోడీ
అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం సాగుతుందన్న ప్రచారం మొదలైన తర్వాత వీళ్లు మరింతగా హల్‌చల్ చేశారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ హైలైట్ అయ్యారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు. అంతేకాదు, వేరే వాళ్లతో క్లోజ్‌గా ఉంటే గొడవలకు దిగేవారు.

బయటకు వచ్చాక అఖిల్ కోసం అలా చేసి
చాలా వారాల పాటు నామినేషన్‌లోకి వచ్చింది మోనాల్ గజ్జర్. సరిగా ఆడడం లేదనో.. తమతో గొడవలు పెట్టుకుంటుందనో చాలా మంది కంటెస్టెంట్లు ఆమెను నామినేట్ చేశారు. దీంతో పలుమార్లు ఆమె డేంజర్ జోన్‌లోకి సైతం వెళ్లినా ఎలిమినేట్ కాలేదు. కానీ, చివరి వారంలో మాత్రం బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి టాప్ -5లో ఉన్న అఖిల్‌కు మద్దతు తెలిపి తన ప్రేమను చాటుకుంది.

షో తర్వాత కూడా చెట్టాపట్టాలు.. ఇంటికెళ్లి
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ చెట్టాపట్టాలేసుకునే తిరుగుతున్నారు. ఇంటర్వ్యూలలో తమ మధ్య ప్రేమను వ్యక్త పరచుకోవడంతో పాటు లైవ్ చాట్‌లో సైతం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మోనాల్.. అఖిల్ సార్థక్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది కూడా. ఈ ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.

మోనాల్ గజ్జర్‌పై అఖిల్ సార్థక్ సీరియస్
న్యూ ఇయర్ సందర్భంగా మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు అతడు మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ అంటే స్క్రిప్ట్ అనుకుంటారు. అలా అయితే మా మధ్య రిలేషన్ ఇప్పటి వరకూ కొనసాగుతుందా' అన్నాడు. అంతలో మోనాల్ కలుగజేసుకుని ‘మాకు కలవడం కుదరట్లేదు' అంది. దీనికి అఖిల్.. ‘అబద్దాలు చెప్పకు.. మనం కలిసిన ఫొటోలు జనాలు చూశారు' అంటూ ఆమెపై ఫైర్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











