అఖిల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ: అభిజీత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్.!
బిగ్ బాస్ షో ఎంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన దీనికి అన్ని భాషల్లో అనుకున్న దానికంటే ఎక్కువ స్పందనే వస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ఇది హిట్ అయింది. ప్రస్తుత సీజన్ సైతం రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతోంది. అదే సమయంలో టామ్ అండ్ జెర్రీలా ఉన్న అఖిల్ - అభిజీత్ వివాదం విషయంలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ చేసిన ఓ పని అఖిల్‌కు షాక్‌ను అభీకి ఛాన్స్‌ను ఇచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

అఖిల్ కెరీర్ అలా.. అభిజీత్ కెరీర్ ఇలా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఉన్నారు అఖిల్ సార్థక్.. అభిజీత్. వీళ్లిద్దరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే. అభి గతంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సహా పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. అలాగే, వెబ్ సిరీస్‌లూ చేశాడు. అఖిల్ విషయానికి వస్తే నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ హైదరాబాద్‌గానూ ఘనత సాధించాడు.

ఒకరు కూల్... మరొకరు ఫైర్ బ్రాండ్‌గా
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు. అంతేకాదు, ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సైతం సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే అభిజీత్ కూల్ పర్సన్‌గా, మైండ్ గేమ్ ఆడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, అఖిల్ మాత్రం ఫైర్ బ్రాండ్‌లా కనిపిస్తున్నాడు. వ్యక్తిత్వంలోనే కాదు.. ఆటలో సైతం దూకుడును ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

మోనాల్ ఎంట్రీతో గొడవలు మొదలు
బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న మోనాల్ గజ్జర్.. ఆరంభంలో అభిజీత్‌తో క్లోజ్‌గా ఉండేది. ఎపిసోడ్ ప్రసారం అయ్యే సమయంలో వీళ్లిద్దరే ఎక్కువ సేపు కనిపించేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆమె అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉండడం మొదలెట్టింది. అప్పటి నుంచి అభిజీత్ - అఖిల్ మధ్య దూరం పెరిగింది. ఇదే పలు సందర్భాల్లో గొడవలకు సైతం దారి తీసిన విషయం తెలిసిందే.

గొడవలకు పుల్‌స్టాప్.. స్నేహితులుగా
తరచూ ఏదో ఒక గొడవలో ఉంటూ హాట్ టాపిక్‌గా మారారు అభిజీత్ - అఖిల్. అయితే, కొద్ది రోజులుగా వీళ్లిద్దరూ స్నేహితులుగా కలిసిపోయి కనిపిస్తున్నారు. ఒకానొక సందర్భంలో మోనాల్ ఈ ఇద్దరినీ కలిపి హగ్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఫ్రెండ్‌లా ఉంటూనే దెబ్బకొట్టిన అఖిల్
ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది. అప్పటి వరకు స్నేహితుడిలా ఉన్న అఖిల్... అభిజీత్‌ను నామినేట్ చేశాడు. దీనికి ‘ఇమ్యూనిటీ వచ్చే టాస్కులో నువ్వు సరిగా ఆడలేదు. దీని వల్ల నీకు ఇమ్యూనిటీ రాలేదు. ఒకవేళ మంచిగా ఆడుంటే నువ్వు సేవ్ అయ్యే వాడివి' అని రీజన్ చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది.

అఖిల్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ
తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అఖిల్, మెహబూబ్, సోహెల్ ప్రధాన పోటీదారులుగా మిగిలారు. వీరిలో సోహెల్ పోటీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ఫైనలిస్టులుగా ఉన్న ఇద్దరూ ఒకరిని ఒకరు కాంప్రమైజ్ చేసుకోవడంలో విఫలం అయ్యారు. ఫలితంగా ఈ టాస్కును రద్దు చేస్తున్నట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో కెప్టెన్ అవ్వాలనుకున్న అఖిల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

అభిజీత్‌కు బిగ్ బాస్ బంపర్ ఆఫర్
ఈ వారం టాస్క్ మంచిగా ఆడలేదని అభిజీత్‌ను నామినేట్ చేశాడు అఖిల్. ఇప్పుడు కెప్టెన్సీ టాస్కులో అతడే కూడా సరిగా ఆడలేదు. ఫలితంగా టాస్క్ రద్దు అవడంతో పాటు బిగ్ బాస్ నుంచి చీవాట్లు తిన్నాడతడు. దీంతో తనకు చెప్పిన కారణాలు చెప్పి అఖిల్‌ను నామినేట్ చేసే అవకాశం వచ్చింది అభిజీత్‌కు. దీన్ని అతడి ఫ్యాన్స్ హైలైట్ చేసి చర్చలు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











