అభిజీత్‌కు బిగ్ షాకిచ్చిన అఖిల్ సార్థక్: ఆ విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తూ అంత మాట అనేశాడు

అఖిల్ సార్థక్.. తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా మారుమ్రోగిపోతోన్న పేరిది. దీనికి కారణం అతడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు అందులో వ్యవహరించిన తీరే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హౌస్‌లోనే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా అతడు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజీత్‌తో ఉన్న పాత గొడవలను గుర్తు చేసేలా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి తాజాగా ఓ పంచ్ వేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

మోడలింగ్.. యాక్టింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్

మోడలింగ్.. యాక్టింగ్.. బిగ్ బాస్ కంటెస్టెంట్

నటన మీద ఉన్న ఆసక్తితో మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొని.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌ ఇన్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో 'బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే, 'కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా మెరిసి చివరకు బిగ్ బాస్‌ ఆఫర్‌ను పట్టేశాడు.

అన్నింట్లోనూ అదుర్స్.. చివరకు రన్నరప్‌గా

అన్నింట్లోనూ అదుర్స్.. చివరకు రన్నరప్‌గా

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ సార్థక్. ఆరంభంలో కొంచెం సైలెంట్‌గా ఉన్న అతడు రాను రానూ వైలెంట్‌గా మారిపోయాడు. ముక్కుసూటిగా ఉంటూ.. తనకు తోచింది చెబుతూ ఫేమస్ అయ్యాడు. అంతేకాదు, పెద్ద బాస్ ఇచ్చే ప్రతి టాస్కులోనూ తన శ్రమను చూపిస్తూ సత్తా చాటాడు. దీంతో అన్నింట్లోనూ తన మార్క్ చూపిస్తూ అదరగొట్టేశాడు.

ఆ విషయంలో మాత్రం రచ్చ.. ఇంటా బయట

ఆ విషయంలో మాత్రం రచ్చ.. ఇంటా బయట

బిగ్ బాస్ షోలో మొదట్లో ఒంటరిగానే ప్రయాణం సాగించిన అఖిల్ సార్థక్.. కొద్ది రోజులకు హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయ్యాడు. ఎప్పుడూ ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ హాట్ టాపిక్‌గా మారాడు. అంతేకాదు, ఆ తర్వాత ప్రేమాయణం సాగిస్తూ, రొమాన్స్ డోస్ పెంచుతూ హగ్గులు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం వంటి వాటితో వీళ్లిద్దరూ బాగా హైలైట్ అయ్యారు.

బైక్ కొన్న అఖిల్.. నా పరిస్థితేంటన్న సోహెల్

బైక్ కొన్న అఖిల్.. నా పరిస్థితేంటన్న సోహెల్

ఇటీవల అఖిల్ జావా బైక్‌ను కొనుగోలు చేశాడు. దాని మీద తిరుగుతూ ఉండగా తీసిన వీడియోలను.. ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 'నా బేబీతో రైడింగ్' అంటూ పోస్టులు పెట్టాడు. వీటిని చూసిన బిగ్ బాస్ ఫేం సయ్యద్ సోహెల్ రియాన్ ఊహించని కామెంట్ చేశాడు. 'ఆ బైక్‌కు ఒక్కటే సీటు ఉంది కదా. మరి నేనెక్కడ కూర్చోవాలి' అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇద్దరు కలిసి ఒకే సీటు మీద కూర్చుని రైడింగ్

ఇద్దరు కలిసి ఒకే సీటు మీద కూర్చుని రైడింగ్

బైక్ కొన్న తర్వాతి రోజే అఖిల్ సార్థక్.. సయ్యద్ సోహెల్ రియాన్ ఇద్దరూ ఓ చోట కలిశారు. అంతేకాదు.. ఒకే సీటే ఉన్న ఆ వాహనంపైనే ఇద్దరూ కూర్చుని ఫస్ట్ రైడ్‌కు వెళ్లారు. అలా కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదిలారు. చిన్న సీటునే ఇద్దరం ఇలా షేర్ చేసుకున్నామని చెబుతూ పోస్టులు కూడా పెట్టారు.

 సెల్ఫీ వీడియోతో సోఖిల్.. అభిజీత్‌కు పంచ్‌లు

సెల్ఫీ వీడియోతో సోఖిల్.. అభిజీత్‌కు పంచ్‌లు

బైక్ రైడ్ తర్వాత అఖిల్ సార్థక్.. సోహెల్ ఇద్దరూ కలిసి ఓ మిర్రర్ దగ్గర సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇందులో భాగంగానే పాత గొడవలను గుర్తు చేస్తూ అభిజీత్‌కు షాకిచ్చారు. ఈ వీడియోలో సోహెల్ 'వాట్సాప్ గాయ్స్' అని అనగానే.. అఖిల్ 'అరేయ్ ఏందిరా అది.. మనది బ్రో బ్యాచ్ కాదురా' అని కామెంట్ చేశాడు. గతంలో ఇదే మాటతో బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రచ్చే జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X