నాన్నకు హార్ట్ ఎటాక్.. నా లవ్ బ్రేకప్.. కష్టాలన్నీ ఒక్కసారిగా అంటూ అఖిల్ భావోద్వేగం
బిగ్‌బాస్ ఇంటిలో ఎప్పుడూ మౌనంగా, శాంతంగా ఉంటే అఖిల్ సార్థక్ 39వ రోజు భావోద్వేగానికి లోనయ్యారు. తన చిన్ననాటి ఫోటోలు చూపించడంతో కంటతడి పెట్టారు. తన తల్లిదండ్రుల గురించి, వారు పడిన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తల్లిదండ్రులు గర్వంగా ఫీలయ్యేలా ఉంటానని అఖిల్ చెబుతూ..

నాన్న ఆటో డ్రైవర్‌గా.. తల్లి టైపిస్ట్‌గా
మా అమ్మ, నాన్నది లవ్ మ్యారేజ్. వారు జీవితంలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. మా నాన్న సోడా కంపెనీలో ఆటో డ్రైవర్‌గా పనిచేసే వారు. అమ్మ టైపిస్ట్‌గా రూ.300 సంపాదించే వారు. వారి కష్టాలు మాములుగా లేకుండే అని అఖిల్ ఎమోషనల్ అయ్యారు.

అమ్మ బెంగ అంతా నా గురించే
నా చదువు, కెరీర్ గురించి అమ్మకు బెంగగా ఉండేది. నాపై ఆమ్మకు నమ్మకం తక్కువ. ఏం చేస్తాడో.. ఎలా బతుకుతాడో అనే కంగారు పడేది. అలాంటి పరిస్థితుల నుంచి నేను నాకు నేనుగా ఎదిగాను. అలా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో లైఫ్ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది అని అఖిల్ పేర్కొన్నారు.

నాన్నకు హార్ట్ ఎటాక్, లవ్ బ్రేకప్
ఇక మూడేళ్ల క్రితం నా జీవితంలో ఊహించిన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. సడెన్‌గా నాన్న అనారోగ్యం పాలయ్యాడు. హార్ట్ ఎటాక్ రావడంతో మేము దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాం. అదే సమయంలో నా అఫైర్ బ్రేకప్ అయింది. ఈ రెండు విషయాలతో మానసికంగా కుంగిపోయాను అని అఖిల్ తెలిపారు.
Recommended Video

కెరీర్ పరంగా పెద్ద గ్యాప్
ఇక నా జీవితంలో చోటు చేసుకొన్న రెండు సంఘటనలను కోలుకొనేందుకు ప్రయత్నిస్తుండగా.. కెరీర్‌పరంగా నాకు పెద్ద గ్యాప్ వచ్చింది. అవకాశాలు ఆగిపోయాయి. ఆఫర్ల కోసం మళ్లీ వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో నన్ను నమ్మింది అమ్మ మాత్రమే. అప్పటి నుంచి నాన్నను అమ్మే చూసుకోవడం జరుగుతున్నది. అమ్మా, నాన్న మీరు గర్వపడే విధంగా నేను కష్టపడుతాను అని అఖిల్ సార్థక్ అని భావోద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











