twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితంలో ఎప్పుడూ ఇంతే.. అంతా దురదృష్టమే.. అఖిల్ ఎమోషనల్.. మోనాల్‌కు ఝలక్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో 79వ రోజు ఇంటి సభ్యులందరూ ఎమోషనల్‌గా కనిపించారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిందనుకొన్న తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తెరపైకి తీసుకు రావడంతో ఇంటి సభ్యులు అలర్ట్ అయ్యారు. ఎలిమినేషన్‌ను తప్పించుకొనేందుకు అవకాశం రావడంతో దాని కోసం నామినేషన్‌లో ఉన్న వారందరూ పోటీ పడ్డారు. అయితే నామినేషన్ ప్రక్రియలో, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈవెంట్‌లో తనకు ప్రతికూలత ఎదురు కావడంతో అఖిల్ మనస్తాపానికి గురైనట్టు కనిపించాడు. ఈ సమయంలో అఖిల్ స్పందించిన తీరు ఎలా ఉందంటే..

    హారిక నిర్ణయంతో షాక్‌లో అఖిల్

    హారిక నిర్ణయంతో షాక్‌లో అఖిల్

    బిగ్‌బాస్ ఇంటిలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఓటింగ్ తర్వాత అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. తనకు కాకుండా అవినాష్‌కు హారిక దేత్తడి ఓటు వేయడంతో కంగుతిన్నాడు. నోటి వరకు వచ్చిన ముద్ద చేజారడంతో షాక్ తిన్నాడు. ఓ చోటు కూర్చొని ఏడుస్తుండటంతో సోహైల్ వచ్చి ఓదార్చారు. బాధపడకు అంటూ సోహెల్ అంటే నా జీవితంలో ఎప్పుడూ ఇంతే. నా లైఫ్‌లో అయ్యేది ఇదే అంటూ బాధపడ్డాడు. అవినాష్ ఇదే జరిగితే అతను కూడా ఇలానే బాధపడేవాడు కదా.. నీవు చాలా స్ట్రాంగ్. ఇలా బాధపడొద్దు అంటూ సోహెల్ ధైర్యం చెప్పాడు.

    నీకు అదృష్టం కలిసి వస్తే..

    నీకు అదృష్టం కలిసి వస్తే..

    ఆ తర్వాత అఖిల్‌తో మోనాల్ మాట్లాడుతూ.. నీకు అదృష్టం కలిసి వస్తే.. గేమ్ చేంజర్‌గా మారే అవకాశం ఉండేది. నిన్న స్వాపింగ్ సమయంలో నన్ను ఒక్కసారి ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు. నన్ను అడిగి ఉంటే నేను స్వాప్ చేసుకొనే దానినేమో అంటూ మోనాల్ అడిగింది.

    నీతో స్వాపింగ్ వద్దు అంటూ అఖిల్

    నీతో స్వాపింగ్ వద్దు అంటూ అఖిల్

    జీవితంలో మంచి, చెడు అన్ని విషయాలు నాతో షేర్ చేసుకొంటావు. స్వాపింగ్ విషయంలో నన్ను ఎందుకు అడగలేదు అని మోనాల్ అంటే.. నీతో స్వాపింగ్ వద్దని అనుకొన్నాను. నీవు ఏంటో నాకు క్లియర్‌గా అర్దమయ్యేలా చెప్పావు. నిన్న నాకు చాలా గట్టిగా క్లారిటీ ఇచ్చావు అంటూ అఖిల్ సమాధానం ఇచ్చాడు.

     మన రిలేషన్‌లో క్లారిటీ వచ్చింది

    మన రిలేషన్‌లో క్లారిటీ వచ్చింది

    మన మధ్య ఓ రిలేషన్ ఉంది. అయితే ఆ విషయంలో నీ నుంచి క్లారిటీ వచ్చింది. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అందుకే నేను నీ నుంచి స్వాప్ తీసుకోలేదు. నేను నామినేట్ చేయాలనుకొన్నది ఒకరిని. కానీ నామినేషన్ ప్రక్రియ ఇలా జరుగుతుందని ఊహించలేదు అని అఖిల్ చెప్పాడు.

    Recommended Video

    Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    ఆ పెద్ద మనిషి ఏం చేశాడు అంటూ

    ఆ పెద్ద మనిషి ఏం చేశాడు అంటూ

    ఇక అభిజిత్‌ను అఖిల్ పరోక్షంగా టార్గెట్ చేస్తూ.. ఆ మనిషి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. కానీ స్వాప్ చేసుకోనే సమయంలో వద్దు అని ఒక్క మాట చెప్పలేదు. మాట మాట్లాడకుండా స్వాప్ చేసుకొన్నాడు. అసలేం చేశాడు అంటూ అఖిల్ ఆవేశంగా మాట్లాడాడు.

    English summary
    Bigg Boss Telugu 4s 12th week Nomination list: Monal Gajjar, Avinash, Ariana Glory, Akhil in the list for Elimination process. Ariana Glory request to Sohel to swap the nominations. Harika saved Abijeet with super power from Bigg Boss. Mukku Avinash wins Eviction free Pass Contest in Bigg Boss Telugu 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X