బిగ్ బాస్‌లో మసాలా సీన్: రోజూ ఇలాగే ఉంటే బాగుండేదంటూ కంటెస్టెంట్ హాట్ కామెంట్.!

తెలుగులోనే కాకుండా దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతూ టాప్ ప్లేస్‌ను కొల్లగొట్టేసింది బిగ్ బాస్ షో. అదే సమయంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అయితే, దీనికి ఎంత మంది అభిమానులు ఉన్నారో, అంతకు మించి ద్వేషించే వాళ్లూ ఉన్నారు. ఈ షోలోని కంటెస్టెంట్లు వ్యవహరించే తీరు వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ షోలో అశ్లీలత ఎక్కువవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో మసాలా సీన్ కనిపించింది. తొలిసారి ఆ తరహా సన్నివేశం ప్రసారం కావడంతో అంతా షాక్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...

నీటుగా మొదలైన ప్రారంభ సీజన్

నీటుగా మొదలైన ప్రారంభ సీజన్

జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్‌తో తెలుగులో ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఈ సీజన్ సూపర్ హిట్ అయింది. అయితే, ఈ సీజన్‌లో గొడవలు, వివాదాస్పద పరిణామాలు, రొమాంటిక్ సన్నివేశాలు, లవ్ ట్రాకులు లాంటివి ఏమాత్రం కనిపించలేదు. దీంతో ఈ సీజన్ క్లీన్‌గా నడిచింది.

రెండో సీజన్ నుంచి మొదలెట్టారు

రెండో సీజన్ నుంచి మొదలెట్టారు

బిగ్ బాస్ హౌస్‌లో ఏమి జరిగినా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. దీనికి కారణం ఈ షోను వీక్షించే వాళ్లు ఎక్కువగా ఉండడమే. దీనిని దృష్టిలో ఉంచుకునే షో నిర్వహకులు ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్‌ను ఎక్కువగా ప్రసారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రెండో సీజన్‌ నుంచే లవ్ ట్రాకులు, రొమాంటిక్ సీన్లను చూపించి భారీగా టీఆర్పీ రేటింగ్ సంపాదించారు.

మూడో సీజన్‌లో శృతి మించింది

మూడో సీజన్‌లో శృతి మించింది

మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ - పునర్నవి భూపాలం మధ్య లవ్ ట్రాక్ షోకు ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్లిద్దరి వల్లే ఈ సీజన్‌కు మంచి రేటింగ్ వచ్చింది. మరోవైపు, ఇదే సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ - వితిక షేరు జంట కూడా రొమాన్స్ బాగా పండించింది. ఒకానొక సమయంలో వీళ్లిద్దరూ శృతి మించినట్లు కూడా కామెంట్లు వినిపించాయి.

ఇప్పుడు కూడా వాటిపైనే ఫోకస్

ఇప్పుడు కూడా వాటిపైనే ఫోకస్

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో సైతం బిగ్ బాస్ యూనిట్ లవ్ ట్రాకులు.. రొమాంటిక్ సీన్లపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే ఆరంభంలో అభిజీత్ - మోనాల్ ట్రాక్ చూపించారు. ఆ తర్వాత అఖిల్‌ను ఎంటర్ చేసి ట్రైయాంగిల్ లవ్ అంటూ ప్రచారం చేశారు. కొద్ది రోజులుగా మరో రెండు జంటలను కూడా చూపిస్తూ రేటింగ్ పిండుకుంటున్నారు.

బిగ్ బాస్‌ హౌస్‌లో మసాలా సీన్

బిగ్ బాస్‌ హౌస్‌లో మసాలా సీన్

నాలుగో సీజన్‌లో అవినాష్ - ఆరియానా గ్లోరీ, అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్, దేత్తడి హారిక - అభిజీత్ మధ్య ట్రాకులు నడుస్తున్నట్లు షో నిర్వహకులు హైలైట్ చేస్తున్నారు. వాళ్లు కూడా హౌస్‌లో అలాంటి ప్రవర్తనతోనే హాట్ టాపిక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో తాజాగా ఓ జంట మధ్య మసాలా సన్నివేశం జరిగింది. ఇప్పుడందరూ దీని గురించే చర్చిస్తున్నారు.

Recommended Video

Cheppina Evvaru Nammaru Lyrical Song Launch
రోజూ ఇలాగే ఉంటే బాగుండేది అంటూ

రోజూ ఇలాగే ఉంటే బాగుండేది అంటూ

బుధవారం ఎపిసోడ్‌లో అఖిల్ పుట్టినరోజు వేడుక జరిగింది. కేక్ కట్ చేసిన అనంతరం గార్డెన్ ఏరియాలో మోనాల్ అతడిని గట్టిగా హగ్ చేసుకోవడంతో పాటు ముద్దుల మీద ముద్దులు పెట్టింది. అనంతరం స్పందించిన అఖిల్.. ‘నువ్వు నాకు ముద్దు పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కదా. రోజూ నా పుట్టినరోజు అయితే బాగుండేది అనిపిస్తుంది' అంటూ కామెంట్ చేయడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X