పబ్లిక్ ప్లేస్‌లో అందరి ముందే అలాంటి పని: అఖిల్ చేసిన దానికి మోనాల్ షాక్.. డౌట్స్ పెంచేసిన వీడియో

ఎన్నో అనుమానాల నడుమ ప్రారంభమై.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. దీని విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ప్రతి సీజన్‌ నుంచి ఏదో ఒక జంట హైలైట్ అవుతూ వచ్చింది. గత ఏడాది జరిగిన నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఫుల్ పాపులర్ అయింది. హౌస్‌లోనే కాకుండా బయట కూడా వీళ్లు రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ప్లేస్‌లో ఓ పని చేసి వార్తలో నిలిచారు. ఆ వివరాలు మీకోసం!

ట్రైయాంగిల్ నుంచి అతడికి దగ్గరైపోయింది

ట్రైయాంగిల్ నుంచి అతడికి దగ్గరైపోయింది

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. మొదట అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం ప్రారంభించింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మోనాల్.. అఖిల్‌కు మాత్రం మరింత దగ్గరైపోయింది.

హౌస్‌లో హల్‌చల్.. హగ్గులు.. ముద్దులతో

హౌస్‌లో హల్‌చల్.. హగ్గులు.. ముద్దులతో

మొదట అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌ ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడంతో పాటు పొగుడుకోవడం వంటివి చేసింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. తద్వారా ఆమె హైలైట్ అయింది.

బిగ్ బాస్ షో వల్ల ఆమె అలా.. అతడిలాగ

బిగ్ బాస్ షో వల్ల ఆమె అలా.. అతడిలాగ

బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ సన్నద్ధం అవుతున్నాడు.

బయట కూడా అదే.. ఎప్పుడూ ట్రెండింగ్‌గా

బయట కూడా అదే.. ఎప్పుడూ ట్రెండింగ్‌గా

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

ప్రేమికుల రోజునే ప్రకటన.. ఫ్యాన్స్‌లో ఖుషీ

ప్రేమికుల రోజునే ప్రకటన.. ఫ్యాన్స్‌లో ఖుషీ

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

పబ్లిక్ ప్లేస్‌లో అందరి ముందే అలాంటి పని

పబ్లిక్ ప్లేస్‌లో అందరి ముందే అలాంటి పని

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ తరచూ కలుస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏదో రకంగా సర్‌ప్రైజ్ చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన వీడియోలనో, ఫొటోలనో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పబ్లిక్ ప్లేస్‌లో వీళ్లిద్దరూ రచ్చ చేసి హైలైట్ అయ్యారు.

అఖిల్ సార్థక్ చేసిన దానికి మోనాల్ షాక్

అఖిల్ సార్థక్ చేసిన దానికి మోనాల్ షాక్

మోనాల్ గజ్జర్ ఎయిర్‌పోర్టులో ఫోన్ మాట్లాడుతూ ఎవరి కోసమే వేచి చూస్తోంది. ఇలాంటి సమయంలో వెనక నుంచి వెళ్లిన అఖిల్ ఆమెకు కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో ఆనందం పట్టలేక అతడిని వెంటనే హగ్ చేసేసుకుంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X