ఒకే ఒక్క మాటతో మోనాల్ పరువు తీసిన అఖిల్: వీడియో తీసి చూపిస్తూ అలా చెప్పడంతో షాక్!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ షో ద్వారా ఎంతో మంది ఎనలేని క్రేజ్‌ను అందుకుని సెలెబ్రిటీలుగా మారిపోయారు. అయితే, కొందరు మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. మొదటి సీజన్ నుంచి ఏదో ఒక జోడీ హైలైట్ అవుతూనే వచ్చింది. ఇలా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లో ఫుల్ పాపులర్ అయ్యారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన ఈ జంట.. బయట కూడా అదే రీతిలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మోనాల్ పరువు తీసేశాడు అఖిల్. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

మొదట్లో అలా.. ఆ తర్వాత జంటగా మారి
బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో మాదిరిగానే నాలుగో దానిలో కూడా లవ్ ట్రాకులే ముందుగా ప్రచారంలోకి వచ్చాయి. షో ఆరంభంలో అభిజీత్.. మోనాల్ గజ్జర్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అదే సమయంలో ఆమె అఖిల్‌తోనూ చనువుగా ఉండడంతో ట్రైయాంగిల్ లవ్ అన్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మోనాల్ అభికి దూరమై అఖిల్‌కు దగ్గరైంది.

అందరూ విడివిడిగా... వీళ్లు మాత్రం కలిసి
అఖిల్ సార్థక్‌కు దగ్గరైన తర్వాత మోనాల్ గజ్జర్.. అతడితో లవ్ ట్రాకు నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరూ ఎప్పుడు చూసినా జంటగానే కనిపించారు. మరీ ముఖ్యంగా హౌస్‌లో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. టాస్కుల్లో సహాయం చేసుకోవడం, నామినేషన్స్‌లో త్యాగాలు చేయడం వంటివి చేశారు. ఇలా తరచూ ఈ జంట హాట్ టాపిక్ అయింది.

రెచ్చిపోయిన జోడీ.. రొమాన్స్‌తో హల్‌చల్
క్రమక్రమంగా అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం బలపడింది. దీంతో హోస్ట్ అక్కినేని నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకునేవారు. దీంతో అప్పటి నుంచి ఈ జంట మరింతగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేసుకోవడంతో పాటు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ తరచూ హైలైట్ అయ్యేవారు.

అస్సలు తగ్గడంలేదు.. తరచూ కలుస్తూనే
బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

ఆ మాటతో మోనాల్ పరువు తీసిన అఖిల్
బిగ్ బాస్ షో ముగిసిన తర్వాత అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమను తరచూ వ్యక్త పరుచుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం.. పొగుడుకోవడం సహా పలు ఆసక్తికరమై విషయాలను బయటపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సీక్రెట్ లీక్ చేసి తాజాగా అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ పరువు తీసేశాడు.
Recommended Video

వీడియో తీసి చూపిస్తూ అలా చెప్పడంతో
బిగ్ బాస్ కంటెస్టెంట్లంతా స్టార్ మా కోసం ఓ ఈవెంట్ చేశారు. దీనికోసం మేకప్ అవుతోన్న మోనాల్ దగ్గరకు వెళ్లిన అఖిల్.. 'ఈమె రోజూ గంటల పాటు మేకప్ వేసుకుంటుంది. ఎప్పుడూ అద్దం ముందే ఉంటుంది. ఏమంత బ్యూటీ కాదు.. మేకప్ వల్లే అలా కనిపిస్తుంది' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











