రాత్రంతా రచ్చ రచ్చ చేసిన అఖిల్ - మోనాల్: అతడితో కలిసి ముద్దులిస్తూ.. వీడియో వైరల్

బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. మరికొందరు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, కొందరు మాత్రమే జంటగా క్రేజ్‌ను అందుకున్న వారు ఉన్నారు. ఈ జాబితాలోకే వస్తారు నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్. విభిన్న మనస్థత్వాలు కలిగిన ఈ ఇద్దరూ రియాలిటీ షోలో చాలా రోజులు కలిసి ప్రయాణం చేశారు. ఈ క్రమంలోనే లవ్ ట్రాక్ నడుపుతూ హైలైట్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత రాత్రి వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

అంచనాలు లేకుండా ఎంట్రీ.. అలా వచ్చారు

అంచనాలు లేకుండా ఎంట్రీ.. అలా వచ్చారు

సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టాడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అఖిల్ సార్థక్. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే చక్కగా ఆడుతూ నాలుగో సీజన్ రన్నరప్‌గా నిలిచాడు. మరోవైపు మోనాల్ గజ్జర్ కూడా అంచనాలు లేకుండా వచ్చి పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది.

ప్రేమాయణంతో మరింత పాపులర్ అయ్యారు

ప్రేమాయణంతో మరింత పాపులర్ అయ్యారు

మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన అఖిల్ సార్థక్.. ప్రముఖ హీరోయిన్ మోనాల్ గజ్జర్‌ లవ్ ట్రాకు వల్ల బాగా పాపులర్ అయ్యారు. షో ఆరంభం నుంచే చనువుగా ఉండడంతో పాటు ఎవరికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే వారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం మొదలైంది. అందుకు అనుగుణంగానే హౌస్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

 ఘాటు రొమాన్స్‌తో అనుమానాలు పెంచారు

ఘాటు రొమాన్స్‌తో అనుమానాలు పెంచారు

ఓ వీకెండ్ ఎపిసోడ్‌లో తన మనసులో A ఉన్నాడని పరోక్షంగా అఖిల్ సార్థక్‌పై ఉన్నా ప్రేమను బయట పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. మరీ ముఖ్యంగా అతడి పుట్టినరోజును పురస్కరించుకుని గార్డెన్ ఏరియాలో ముద్దుల వర్షం కురిపించిందామె. దీంతో ప్రతిరోజూ నా బర్త్‌డే అయితే బాగుండు అని అఖిల్ చేసిన కామెంట్ వైరల్ అయింది.

బయటకు వచ్చాక సపోర్ట్.. ఏకంగా ఇంటికెళ్లి

బయటకు వచ్చాక సపోర్ట్.. ఏకంగా ఇంటికెళ్లి

గ్రాండ్ ఫినాలేకు ఒక వారం రోజుల ముందు మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేసింది. ఆ సమయంలోనే హౌస్‌లో ఉన్న అఖిల్ సార్థక్‌కు సపోర్ట్ చేస్తూ ఎన్నో పోస్టులు పెట్టింది. అలాగే, ఆ మధ్య జరిగిన ఇంటర్వ్యూలలో అతడికి ఓట్ చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. షో ముగిసిన తర్వాత ఏకంగా అర్ధరాత్రి సమయంలో అఖిల్ సార్థక్ ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ చేసింది.

రాత్రంతా రచ్చ రచ్చ చేసిన అఖిల్ - మోనాల్

బిగ్ బాస్ హౌస్‌లో ఎంత సన్నిహితంగా గడిపారో.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. ఈ క్రమంలోనే ఈ జంటపై ఉన్న అనుమానాలను రెట్టింపు చేస్తున్నారు. అంతేకాదు, తాజాగా న్యూ ఇయర్ పార్టీని కూడా కలిసే జరుపుకున్నారు. దీనికి సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అతడితో కలిసి ముద్దులిస్తూ.. వీడియో వైరల్

అతడితో కలిసి ముద్దులిస్తూ.. వీడియో వైరల్

అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌తో పాటు ఈ పార్టీకి సయ్యద్ సోహెల్ రియాన్ కూడా వచ్చాడు. వీళ్లు ముగ్గురూ కలిసి ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ విషయాన్ని సోహెల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. అంతేకాదు, మోనాల్‌తో కలిసి ఫ్లైయింగ్ కిస్సెస్ ఇస్తూ అతడు కూడా రచ్చ రచ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీలో అప్‌లోడ్ చేశాడతను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X