మళ్లీ రెచ్చిపోయిన అఖిల్ మోనాల్: ఈ సారి ఏకంగా వీడియోనే లీక్ చేసి.. అలా పిలుచుకుంటూ రచ్చ

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో చాలా మంది సోలోగానే పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ మాత్రం జంటగా ఫేమస్ అయ్యారు. దీనికి కారణం వీళ్లిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణం సాగించడమే. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా వీళ్లిద్దరి వీడియో కాల్ బయటకు వచ్చింది. ఇందులో ఏకంగా ముద్దుపేర్లతో పిలుచుకుంటూ వీళ్లు రచ్చ రచ్చ చేశారు. ఆ సంగతులేంటో మీరూ చూడండి!

 ఇద్దరి మధ్య ప్రేమ అప్పుడే మొదలు

ఇద్దరి మధ్య ప్రేమ అప్పుడే మొదలు

ప్రముఖ నటి మోనాల్ గజ్జర్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో సైలెంట్‌గా, దూరంగా ఉన్న వీళ్లిద్దరూ క్రమంగా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే చూపులు, మాటలు, మనసులు కలుపుకున్నారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి ఈ జంట మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది.

 హౌస్‌లో రచ్చ.. ముద్దులు.. హగ్గులు

హౌస్‌లో రచ్చ.. ముద్దులు.. హగ్గులు

షో ఆరంభంలో దూరం దూరంగా కనిపించిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయారు. ఎప్పుడూ కలిసే ఉంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవల్లో భాగం అయ్యారు. ఇక, రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూ.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులతో ప్రేమను పండిస్తూ విపరీతంగా హాట్ టాపిక్ అయ్యారు.

 బిగ్ బాస్‌తో మారింది.. వరుస ఆఫర్లు

బిగ్ బాస్‌తో మారింది.. వరుస ఆఫర్లు

ఈ రియాలిటీ షో ద్వారా అటు అఖిల్ సార్థక్.. ఇటు మోనాల్ గజ్జర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించడంతో పాటు మరోసారి డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు.

బయట కూడా అదే పని చేస్తున్నారు

బయట కూడా అదే పని చేస్తున్నారు


దాదాపు 13 వారాల పాటు పాటు బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయటా పాపులారిటీ దక్కించుకుంది.

 వెబ్ సిరీస్ ప్రకటన... దాని వల్ల లేట్

వెబ్ సిరీస్ ప్రకటన... దాని వల్ల లేట్


ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా ప్రారంభం కాలేదు.

మళ్లీ రెచ్చిపోయిన అఖిల్.. మోనాల్

మళ్లీ రెచ్చిపోయిన అఖిల్.. మోనాల్


అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచూ కలుస్తూనే ఉంటారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ కలవడం కుదరని పక్షంలో ఆన్‌లైన్‌లో వీడియో కాల్స్ కూడా మాట్లాడుకుంటారు. ఇలా తాజాగా వీళ్లిద్దరూ వీడియో చాట్ చేసి రెచ్చిపోయారు. ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

 ఈ సారి ఏకంగా వీడియోనే లీక్ చేసి

ఈ సారి ఏకంగా వీడియోనే లీక్ చేసి

తాజాగా బిగ్ బాస్ జోడీ అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్ వీడియో కాల్‌తో రెచ్చిపోయింది. ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియో కాల్ మాట్లాడుకున్న స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. అదే సమయంలో మోనాల్‌ను 'గుజ్జులు' అని అఖిల్ అనగా.. అతడినేమో 'అఖిలు' అని ఆమె ఎంతో రొమాంటిక్‌గా పిలిచింది. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ మరోసారి బయట పడినట్లు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X