అడ్డంగా బుక్కైన అఖిల్ సార్థక్: మోనాల్‌తో వాట్సప్ చాట్ లీక్.. బండారం బయటపెట్టిన యాంకర్!
చాలా రోజుల క్రితమే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ పెద్దగా ఫేమస్ కాలేకపోయాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ అఖిల్ సార్థక్. ఎప్పుడైతే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతడు విపరీతమైన రీతిలో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీనికి కారణం అతడి ఆటతీరు మాత్రం కాదు.. హౌస్‌లో హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో లవ్వాట ఆడడం వల్లే బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు. బయట కూడా వీళ్లిద్దరూ అలాగే కలిసి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్.. మోనాల్ వాట్సప్ చాట్ లీకైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఇద్దరి కెరీర్‌లు అలా.. బిగ్ బాస్ ఛాన్స్ ఇలా
మోడలింగ్ రంగం ద్వారా పాపులర్ అయ్యాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించి బిగ్ బాస్ ఛాన్స్ పట్టేశాడు. మరోవైపు, గతంలో ఎప్పుడో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. తర్వాత చాలా భాషల్లో నటించిన ఈమె కూడా ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ప్రేమాయణంతో పాపులర్.. రొమాన్స్ కూడా
ఒంటరిగా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ జంటగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉంటూ.. కలిసే ఆడుతూ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు హైలైట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలో తరచూ రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో నామినేషన్స్ టాస్కుల్లోనూ త్యాగాలు చేసుకున్నారు.

అంచనాలు లేకుండా వచ్చి... అలా వెళ్లారు
అసలేమాత్రం అంచనాలు లేకుండానే మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్లుగా ప్రవేశించారు. ఎన్నో ఊహాగానాల నడుమ షోలో తమ ఆటతీరును కనబరిచిన ఈ ఇద్దరూ చివరి వరకూ ఉన్నారు. అయితే, వీళ్లిద్దరిలో మోనాల్ పద్నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయింది. కానీ, అఖిల్ మాత్రం ఫినాలేకు చేరుకున్నాడు. చివర్లో రన్నరప్‌గా నిలిచాడు.

మోనాల్ హల్‌చల్... అతడు మాత్రం వేరేలా
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్లు అందరూ ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిలో మోనాల్ గజ్జర్ ఇప్పటికే 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో పాటు ఓంకార్ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా చేస్తోంది. అయితే, అఖిల్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కానీ, ఆఫర్లు వస్తున్నాయని అంటున్నాడు.

అడ్డంగా బుక్కైన అఖిల్.. వాట్సప్ చాట్ లీక్
బిగ్ బాస్ హౌస్‌లో జంటగా రచ్చ రచ్చ చేశారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నారు. తరచూ తమ ప్రేమను బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నారు. అలాగే, కలిసి తిరుగుతూ హల్‌చల్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఊహించని విధంగా మోనాల్ గజ్జర్‌తో అఖిల్ సార్థక్ చేసిన వాట్సప్ చాట్ తాజాగా బయటకు వచ్చింది.

అలా బండారం బయటపెట్టిన టీవీ యాంకర్
అఖిల్ సార్థక్ తాజాగా ఓ టీవీ షోకు గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అందులో భాగంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాడు. అప్పుడు డేర్ చేయడానికి సిద్ధమని చెప్పగా.. ఆ షో యాంకర్ 'మీ చివరి మూడు వాట్సప్ చాట్‌లు ఎవరితో చేశారో చూపించండి' అని అడిగింది. అప్పుడు అఖిల్ తన ఫోన్ చూపించగా అందులో మోనాల్ చాట్ ఉంది. ఈ విషయాన్ని సదరు యాంకర్ లీక్ చేసి షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











