మోనాల్‌కు భారీ షాకిచ్చిన అఖిల్ తల్లి: ముద్దులిచ్చిన తర్వాత రోజే అంత మాట అనేసింది.!

తెలుగు బిగ్ బాస్ షోలో లవ్ కహానీలు కామన్ అన్న టాక్ ఉంది. అందుకు అనుగుణంగా ప్రతి సీజన్‌లో ఏదో ఒక జంట ఈ తరహాలో హైలైట్ అవుతూనే ఉంది. అలా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో హీరోయిన్ మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా రొమాంటిక్‌గా మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఇక, హగ్గులు, ముద్దులు కూడా ఇచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన అఖిల్ తల్లి మోనాల్‌కు భారీ షాకిచ్చింది. అంత మాట అనడంతో ఆమె ఏడ్చేసింది. ఆ వివరాలు మీకోసం.!

అభిజీత్‌తో మొదలైన ప్రేమ కహానీ

అభిజీత్‌తో మొదలైన ప్రేమ కహానీ

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అందరి కంటే ముందు యంగ్ హీరో అభిజీత్ ప్రేమ కహానీని మొదలు పెట్టాడు. వచ్చీ రాగానే మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉంటూ పులిహోర కలపడం ప్రారంభించాడు. చాలా రోజుల పాటు వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. దీంతో అభిజీత్ - మోనాల్ ట్రాక్‌నే షో నిర్వహకులు కూడా బాగా ఫోకస్ చేయడంతో వీళ్లు హైలైట్ అయ్యారు.

అఖిల్ ఎంట్రీతో ట్రైయాంగిల్ లవ్‌గా

అఖిల్ ఎంట్రీతో ట్రైయాంగిల్ లవ్‌గా

మోనాల్ గజ్జర్‌.. అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటోన్న సమయంలోనే అఖిల్ సార్థక్ ఆమె చెంతకు చేరాడు. దీంతో ఈ గుజరాతీ భామ ఇద్దరితోనూ మాట్లాడుతూ కనిపించింది. ఆ సమయంలో దీన్ని ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటూ షో నిర్వహకులు హైలైట్ చేయడంతో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. ఈ మొత్తం ప్రేమల వ్యవహారంలో మోనాల్‌ గజ్జర్‌కే చెడ్డపేరు వచ్చింది.

అఖిల్ - మోనాల్ ఫిక్స్ అయ్యారు

అఖిల్ - మోనాల్ ఫిక్స్ అయ్యారు

ట్రైయాంగిల్ లవ్ అని టాక్ వచ్చిన సమయంలో అభిజీత్ ఈ ట్రాక్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అఖిల్ - మోనాల్ ఇద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నట్లు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండడం, టాస్కులను కూడా ఒకరికొకరు సహకరిస్తూ ఆడడం వంటి వాటితో ఈ జంట మరింత పాపులర్ అయింది.

గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన బ్యూటీ

గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చిన బ్యూటీ

రెండు రోజుల క్రితం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్ పుట్టినరోజు వేడుకలు చేశారు హౌస్‌మేట్లు. సొంతంగా కేక్ తయారు చేసి అతడితో కట్ చేయించారు. ఇది జరిగిన కొద్ది సేపటికి గార్డెన్ ఏరియాలో అఖిల్‌కు మోనాల్ మొదటిసారి ముద్దు పెట్టింది. ఆ సమయంలో ఆనందంతో పొంగిపోయిన అఖిల్.. ‘ముద్దు పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. రోజూ నా బర్త్‌డే అయితే బాగుండు' అని అన్నాడు.

మోనాల్‌కు భారీ షాకిచ్చిన అఖిల్ తల్లి

మోనాల్‌కు భారీ షాకిచ్చిన అఖిల్ తల్లి

గురువారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కరోనా ప్రభావంతో వీళ్లను మెయిన్ డోర్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన రూమ్‌లో ఉంచారు. ఇక, మొదటిగా అఖిల్ సార్థక్ తల్లి హౌస్‌లోకి ప్రవేశించారు. ఆమె వచ్చీ రావడంతోనే పాజిటివ్‌గా మాట్లాడి అందరిలోనూ జోష్ నింపారు. అదే సమయంలో మోనాల్‌కు మాత్రం షాకిచ్చారు.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
ముద్దులిచ్చిన తర్వాత రోజే అంత మాట

ముద్దులిచ్చిన తర్వాత రోజే అంత మాట

హౌస్‌లోని అందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పారు అఖిల్ తల్లి. ఈ సమయంలోనే మోనాల్ గురించి స్పందించమని కొడుకు కోరగా.. ‘ఆమెను చూస్తూ నువ్వు అఖిల్‌కు ఫ్రెండ్‌వి మాత్రమే. మంచిగా ఆడు' అంటూ చెప్పుకొచ్చింది. అంతకుముందు రోజే అఖిల్‌కు ముద్దులిచ్చిన మోనాల్‌ను ఒకేసారి ఫ్రెండ్ అని అనడంతో తట్టుకోలేకపోయింది. దీంతో కాసేపు ఏడ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X