For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్‌కు అఖిల్ తల్లి గ్రీన్ సిగ్నల్.. లీకైన పర్సనల్ సీక్రెట్

  |

  తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీని వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. మరికొందరు ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఈ కోవకే చెందుతారు మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్. దీనికి కారణం వీళ్లిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమాయణంతో ఫేమస్ అవడమే. అంతేకాదు, బయట కూడా ఎప్పుడూ రచ్చే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి బంధం గురించి ఓ ఆసక్తికరమై వార్త లీకైంది. దీన్ని స్వయంగా అఖిలే లీక్ చేయడం విశేషం. ఇంతకీ ఏంటా మేటర్? పూర్తి వివరాలు మీకోసం!

  అఖిల్ మోనాల్ బంధం మొదలైందిలా

  అఖిల్ మోనాల్ బంధం మొదలైందిలా

  ప్రముఖ నటి మోనాల్ గజ్జర్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆరంభంలో సైలెంట్‌గా, దూరంగా ఉన్న వీళ్లిద్దరూ క్రమంగా దగ్గరయ్యారు. ఆ సమయంలోనే చూపులు, మాటలు, మనసులు కలుపుకున్నారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అప్పటి నుంచి ఈ జంట మధ్య ఆ బంధం కొనసాగుతూనే ఉంది.

  ప్రేమతో రచ్చ... ముద్దులు... హగ్గులతో

  ప్రేమతో రచ్చ... ముద్దులు... హగ్గులతో

  షో ఆరంభంలో దూరం దూరంగా కనిపించిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయారు. ఎప్పుడూ కలిసే ఉంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవల్లో భాగం అయ్యారు. ఇక, రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూ.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులతో ప్రేమను పండిస్తూ విపరీతంగా హాట్ టాపిక్ అయ్యారు.

  బిగ్ బాస్ వల్ల లాభమే... ఇద్దరూ అలా

  బిగ్ బాస్ వల్ల లాభమే... ఇద్దరూ అలా

  ఈ రియాలిటీ షో ద్వారా అటు అఖిల్ సార్థక్.. ఇటు మోనాల్ గజ్జర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించడంతో పాటు మరోసారి డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు.

  హౌస్‌లోనే కాదు.. బయట కూడా రచ్చే

  హౌస్‌లోనే కాదు.. బయట కూడా రచ్చే

  దాదాపు 13 వారాల పాటు పాటు బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయటా పాపులారిటీ దక్కించుకుంది.

  ఇద్దరూ కలిశారు.. ఆలస్యం అయిందిగా

  ఇద్దరూ కలిశారు.. ఆలస్యం అయిందిగా

  ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, ఇద్దరి మధ్య డేట్స్ కుదరకపోవడంతో ఇది ఇంకా ప్రారంభం కాలేదు.

  పర్సనల్ మేటర్‌ను లీక్ చేసేసిన అఖిల్

  పర్సనల్ మేటర్‌ను లీక్ చేసేసిన అఖిల్

  ఇటీవల అఖిల్ సార్థక్ ఓ న్యూస్ ఛానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు తన పర్సనల్ మేటర్లను కూడా పంచుకున్నాడు. అదే సమయంలో కెరీర్‌కు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించాడు. ఈ క్రమంలోనే యాంకర్ ‘మోనాల్ గజ్జర్ అంటే మీ అమ్మగారికి ఇష్టం లేదంట కదా. ఇప్పుడు వాళ్ల రిలేషన్ ఎలా ఉంది' అని అడిగితే ఊహించని ఆన్సర్ ఇచ్చాడతను.

  ఇద్దరూ రాత్రి అదే పని చేస్తున్నారంటూ

  ఇద్దరూ రాత్రి అదే పని చేస్తున్నారంటూ

  యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ‘మా అమ్మకి మోనాల్ అంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు? వాళ్లిద్దరూ చక్కగా ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే.. ప్రతిరోజూ రాత్రి వాళ్లిద్దరూ వీడియో కాల్ కూడా మాట్లాడుతుంటారు. ఎంతో సరదాగా ఉంటారు' అని చెప్పుకొచ్చాడు. దీంతో మోనాల్ గజ్జర్‌కు అఖిల్ సార్థక్ మదర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

  English summary
  Tollywood Hero, Bigg Boss Fame Akhil Sarthak Recently Participated in An Interview. In This Chit Chat.. He Told Interesting Facts about Heroine Monal Gajjar.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X