మాకు ముందే చెప్పాడు.. వచ్చిన వెంటనే చేస్తాం: మోనాల్‌తో పెళ్లిపై అఖిల్ తల్లి సంచలన వ్యాఖ్యలు

By Manoj Kumar P

బుల్లితెరపై ఉన్న లెక్కలన్నీ చెత్త బుట్టలో పారేసి... సరికొత్త చరిత్రను సృష్టించింది బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. దేశంలోని చాలా భాషల్లో ప్రసారమయ్యే ఈ షో.. తెలుగుతో పాటు అన్ని చోట్లా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ రియాలిటీ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనికి హౌస్‌లో కనిపిస్తున్న ట్రైయాంగిల్ లవ్ కూడా ఓ కారణమే. తాజాగా తమ కుమారుడు నడుపుతున్న ఈ వ్యవహారంపై కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం.!

అందుకోసం మసాలా దట్టిస్తున్నారు

అందుకోసం మసాలా దట్టిస్తున్నారు

తెలుగులో మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. దీంతో నాలుగో దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి భారీగా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి వందకు వంద శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని షో నిర్వహకులు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లో లవ్ ట్రాకులను హైలైట్ చేసి చూపిస్తున్నారు. దీంతో మసాలా సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

నాగార్జున ముందే చెప్పిన అభిజీత్

నాగార్జున ముందే చెప్పిన అభిజీత్

హౌస్‌లోకి రాకముందే కంటెస్టెంట్ అభిజీత్... మోనాల్ గజ్జర్‌ను వివాహం చేసుకుంటానని నాగార్జున అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే షో మొదటి రోజు నుంచే హౌస్‌లో ఆమెతో పులిహోర కలపడానికి ట్రై చేశాడు. దీనికి సదరు హీరోయిన్ కూడా బాగా సహకరించింది. దీంతో వీళ్లిద్దరూ లవ్ చేసుకుంటున్నారన్న టాక్ బాగా వినిపించింది

 మొదట వాళ్లిద్దరూ.. అతడి ఎంట్రీతో

మొదట వాళ్లిద్దరూ.. అతడి ఎంట్రీతో

మోనాల్ - అభిజీత్ ఎక్కువగా కలిసి తిరగడం హైలైట్ చేసి చూపించారు బిగ్ బాస్ నిర్వహకులు. అంతలోనే వీళ్లిద్దరి మధ్యలోకి మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ ట్రాక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా మారిపోయింది. మొదట్లో అభిజీత్‌తో ఎక్కువగా కనిపించిన మోనాల్... ఆ తర్వాత అఖిల్‌తో ఎక్కువగా సమయాన్ని గడుపుతోంది. దీంతో ఈ ఇద్దరూ క్లోజ్ అయ్యారు.

తన పరువు తీస్తున్నారని ఏడ్చేసింది

తన పరువు తీస్తున్నారని ఏడ్చేసింది

కొద్దిసేపు అభిజీత్‌తో.. కొద్దిసేపు అఖిల్‌తో ఉంటూ మోనాల్ డబుల్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రేక్షకులు ఓ అంచనాలు వచ్చేశారు. అదే సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సైతం ఇదే తరహా కామెంట్లు చేశారు. ఇక, ఈ వారం నామినేషన్ టాస్క్‌లో ఆమె గురించి ఇద్దరూ గొడవ పడ్డారు. దీంతో తన పరువు పోతుందని, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకొమ్మని వేడుకుంది మోనాల్.

మోనల్‌‌తో అఫైర్‌పై అఖిల్ తల్లి రెస్పాన్స్

మోనల్‌‌తో అఫైర్‌పై అఖిల్ తల్లి రెస్పాన్స్

గత సీజన్లలో తేజస్వీ - సామ్రాట్, పునర్నవి - రాహుల్ సిప్లీగంజ్ బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు నడిపి హైలైట్ అయ్యారు. ఇప్పుడదే రీతిలో మోనాల్ - అఖిల్ కనిపిస్తున్నారు. దీంతో ఈ జంట కూడా బాగా పాపులర్ అవుతోంది. ఇక, ఇటీవల ఆమె కోసం అఖిల్.. అభితో గొడవకు దిగడంతో ఈ ట్రాక్ పీక్స్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో తన కొడుకు అఫైర్‌పై అఖిల్ తల్లి స్పందించారు.

చెప్పే వెళ్లాడు.. వచ్చిన వెంటనే చేసేస్తాం

చెప్పే వెళ్లాడు.. వచ్చిన వెంటనే చేసేస్తాం

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ‘అఖిల్ బిగ్ బాస్ హౌస్‌లో గుడ్ బాయ్‌గా ఉంటానని నాకు ప్రామిస్ చేశాడు. అలా కాదని వెదవ వేషాలు వేస్తే వాడి కాళ్లు విరగ్గొడతా. షో నుంచి బయటకు వచ్చిన వెంటనే వాడికి పెళ్లి చేసేస్తాం. అది కూడా మేము చూసిన అమ్మాయితోనే. ఇందుకోసం ఎప్పుడో మాట తీసుకున్నా' అంటూ చెప్పుకొచ్చారు.

Recommended Video

Actress Seerat Kapoor Gym Workout Video
మోనాల్‌తో అఖిల్ చేస్తున్న దానిపై...

మోనాల్‌తో అఖిల్ చేస్తున్న దానిపై...

ఇక, మోనాల్‌తో అఖిల్ సార్థక్ వ్యవహరిస్తున్న తీరుపై స్పందిస్తూ ‘మోనాల్.. అఖిల్ కేవలం స్నేహితులు మాత్రమే. వాళ్లిద్దరి మధ్య మరే బంధమూ లేదు. ఈ విషయం మాకు కచ్చితంగా తెలుసు. అలాగే, అభితోనూ వాడి రిలేషన్ బానే ఉంది. ఇద్దరూ బ్రదర్ బ్రదర్ అనుకుంటూ చక్కగా ఉంటున్నారు. మీరు చూసేదంతా నిజం కాదు' అని ఆమె వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X