బిగ్ బాస్‌లో విచిత్ర సంఘటన: మోనాల్‌ను గట్టి దెబ్బకొట్టిన అఖిల్.. షాక్‌లో హౌస్‌మేట్స్.!

By Manoj Kumar P

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతోన్న భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌తో రూపొందిన ఈ షోకు.. మరే భాషలో రాని రీతిలో ఇక్కడ రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఇక, నాలుగో సీజన్ ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. దీనికి హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు కూడా ఓ కారణమే. మరీ ముఖ్యంగా అఖిల్ - మోనాల్ జోడీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ షోలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే....

ముందే హింట్ ఇచ్చిన బిగ్ బాస్ యూనిట్

ముందే హింట్ ఇచ్చిన బిగ్ బాస్ యూనిట్

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ స్థాయి ఎక్కువగా ఉంటుందని బిగ్ బాస్ నిర్వహకులు షో ఆరంభానికి ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కిస్ చేసుకునే టీజర్ కూడా వదిలారు. తద్వారా ఈ సీజన్‌లో మసాలను ఎక్కువగా హైలైట్ చేయబోతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు. దీంతో నాలుగో సీజన్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

తొలిరోజే మొదలు.. నాగార్జునే అడగడంతో

తొలిరోజే మొదలు.. నాగార్జునే అడగడంతో

ప్రీమియర్ ఎపిసోడ్‌ జరిగిన రోజే లవ్ ట్రాకులకు సంబంధించిన భీజం పడింది. స్టేజ్‌పై అభిజీత్ వచ్చిన సమయంలో ముగ్గురు హీరోయిన్లను చూపించిన నాగార్జున.. వీళ్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగాడు. దానికి ఈ యంగ్ హీరో.. మోనాల్ గజ్జర్ పేరు చెప్పాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగు పెట్టడంతో అదంతా ప్లాన్ అనే టాక్ వినిపించింది.

ప్లాన్ ప్రకారమే.. అఖిల్ ఎంట్రీతో మారింది

ప్లాన్ ప్రకారమే.. అఖిల్ ఎంట్రీతో మారింది

బిగ్ బాస్ నిర్వహకులు అనుకున్న విధంగానే సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్, అభిజీత్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించారు. దీంతో వీళ్లనే ఎక్కవగా హైలైట్ చేసి చూపించారు. అయితే, ఆ తర్వాత వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి మోనాల్ ఇద్దరితోనూ కలిసి కనిపిస్తూ ఉండేది. ఫలితంగా దీన్ని ట్రైయాంగిల్ లవ్ ట్రాక్ అని చూపించడం మొదలెట్టారు.

అఖిల్ - మోనాల్ మధ్య బలమైన బంధం

అఖిల్ - మోనాల్ మధ్య బలమైన బంధం

అఖిల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అభిజీత్‌ను దూరం పెట్టింది మోనాల్. ఒకానొక దశలో అతడితో మాట్లాడడం కూడా మానేసింది. అంతేకాదు, తన మనసులో ఒకరు ఉన్నారని, అతడి పేరు A అనే అక్షరంతో మొదలవుతుందని చెప్పుకొచ్చిందామె. అప్పటి నుంచి అఖిల్ - మోనాల్ ట్రాక్ హాట్ టాపిక్ అవుతోంది. షోలో వీళ్లిద్దరినే హైలైట్ చేసి చూపించడంతో విమర్శలు కూడా చెలరేగాయి.

మోనాల్‌ను గట్టి దెబ్బకొట్టిన అఖిల్ సార్థక్

మోనాల్‌ను గట్టి దెబ్బకొట్టిన అఖిల్ సార్థక్

ఏ టాస్క్ అయినా మోనాల్‌కు ఫేవర్‌గానే ఆడుతుంటాడు అఖిల్ సార్థక్. నామినేషన్ విషయంలోనూ ఆమెను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందుకోసం మిగిలిన హౌస్‌మేట్స్‌తోనూ గొడవలకు దిగుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్‌ను ఈ వారం జరిగిన ప్రక్రియలో నామినేట్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు అఖిల్. దీంతో హౌస్‌మేట్స్ అంతా ఆశ్చరపడిపోయారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Divi Elimination For Monal, Samantha Emotional | Filmibeat Telugu
 వీడియో చూసిన తర్వాత మారిపోయాడా

వీడియో చూసిన తర్వాత మారిపోయాడా

వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ మధ్య మనస్పర్థలు పోయేందుకు నాగార్జున కొన్ని వీడియోలను చూపించాడు. ఇందులో మోనాల్ వల్ల అఖిల్ - సోహెల్ మధ్య దూరం పెరిగినట్లు అర్థమైంది. ఈ వీడియో చూసిన తర్వాతనే అఖిల్.. మోనాల్‌ను నామినేట్ చేశాడని తెలుస్తోంది. కోడిగుడ్లతో జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియ వివాదాలతో సాగినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X