అలాంటి మాటలతో దెబ్బకొట్టిన అఖిల్: ఇంట్లో వాళ్లను వాడడంతో తట్టుకోలేక ఏడుస్తూ!
తుది దశకు చేరుకున్న తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ సమయంలో వచ్చే టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య సత్సంబంధాలు, ఊహించని ట్విస్టులు షోను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం మొత్తం జరిగిన నామినేషన్స్ టాస్క్ నుంచి రేస్ టు ఫినాలే వరకు ఎన్నో ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. ఈ క్రమంలోనే తాజా టాస్కులో అఖిల్ సార్థక్.. సోహెల్‌ను సెంటిమెంట్‌తో దెబ్బకొట్టాడు. ఏకంగా కుటుంబ సభ్యులను తీసుకు రావడంతో తట్టుకోలేకపోయాడతను. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

రోజు మొత్తం సాగిన రేస్ టు ఫినాలే
రేస్ టు ఫినాలే టాస్కులో మిగిలిన కంటెస్టెంట్లు అందరినీ ఓడించి అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్ తుది రౌండ్‌కు చేరుకున్నారు. వీళ్లిద్దరినీ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఉయ్యాలపై కూర్చోబెట్టిన బిగ్ బాస్.. దాని మీద నుంచే చేసేలా కొన్ని టాస్కులు ఇచ్చాడు. రాత్రి పూట చలిలో కూడా ఇద్దరు పోటీదారులు అలాగే ఉండిపోయారు. దీంతో ఒకరోజు పూర్తిగా గడిచిపోయింది.

అభి వచ్చి తేల్చుకోమని చెప్పడంతో
రెండో రోజు ఉదయం కాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న అఖిల్ సార్థక్, సోహెల్ రియాన్ ఏం చేద్దాం అని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో సంచాలకుడిగా ఉన్న అభిజీత్ వచ్చి ‘గాయ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా కంటిన్యూ చేస్తామంటే కచ్చితంగా హెల్ప్ చేస్తా. కానీ, ఏదైనా త్వరగా తేల్చుకుంటే మంచిది కదా' అని అనడంతో ఇద్దరూ చర్చ మొదలెట్టారు.

ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్
అభిజీత్ చెప్పిన తర్వాత ఎవరు ఉండాలి? ఎవరు దిగిపోవాలి? అన్న దానిపై అఖిల్ సార్థక్, సోహెల్ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో ఒకరి తర్వాత ఒకరు బాగా ఎమోషనల్ అయ్యారు. మరీ ముఖ్యంగా సోహెల్ బాగా ఏడ్చేశాడు. అంతేకాదు, ‘మేమేమీ తేల్చుకోలేకపోతున్నాం బిగ్ బాస్.. ఏదైనా మీరే చేయండి ప్లీజ్' అంటూ రెండు చేతులు జోడించి మరీ వేడుకున్నాడు.

ఒక్కసారిగా దూకేసిన ఆ కంటెస్టెంట్
ఎవరు ఎంత సేపు ఉన్నా ఒక్కరే గెలిచే ఛాన్స్ ఉంటుందని గ్రహించిన ఇద్దరు కంటెస్టెంట్లు తమకు తోచిన అభిప్రాయాలు చెప్పుకున్నారు. ఇక, సోహెల్ అయితే ‘మనిద్దరం మొండోళ్లమే. ఎంత సేపైనా ఉండగలం. కానీ, ఎటూ తేల్చుకోవడం లేదని టాస్క్‌ను రద్దు చేస్తాడేమో అని భయంగా ఉంది' అన్నాడు. కొన్ని చర్చల అనంతరం అఖిల్‌ను నమ్మించి ఉయ్యాల మీద నుంచి దూకేశాడు.

అలాంటి మాటలతో దెబ్బకొట్టడంతో
వాస్తవానికి సోహెల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖిల్ ఉన్నా ఉయ్యాల టాస్క్ అతడే గెలుస్తాడని అంతా అనుకున్నారు. కానీ, జరిగింది మాత్రం వేరు. ఈ టాస్కులో అఖిల్ సార్థక్ గెలవడానికి ఒకే ఒక్క కారణం సెంటిమెంట్. అవును.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే సయ్యద్ సోహెల్ రియాన్ దగ్గర సెంటిమెంట్ కార్డును వాడుకుని విజయం సాధించాడు.
Recommended Video

వాళ్లను వాడడంతో తట్టుకోలేక ఏడ్చి
ఉయ్యాలపై ఉన్న సమయంలో అఖిల్ ‘ఇద్దరికీ ఈ గేమ్ ఇంపార్టెంటే. నాకు మైండ్‌లో ఏముందంటే.. మా అమ్మ వచ్చి కెప్టెన్ అవ్వు అని అడిగినా నేను కాలేకపోయా. నేనే టాప్‌లో ఉంటానా అని మా అమ్మని అడిగా. మా అన్న కూడా నన్ను టాప్ ప్లేస్‌లో పెట్టలేదు. అందుకే ఫినాలేకు వెళ్తే బాగుంటుంది. లేకపోతే నన్ను తోసేయ్ రా' అని అనడంతో సోహెల్ తట్టుకోలేక ఏడుస్తూ దిగిపోయాడు.


Click it and Unblock the Notifications











