For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్ గురించి అఖిల్‌కు ఊహించని ప్రశ్న: లోపల చేయి పెట్టి చూపించిన డిజైరబుల్ మ్యాన్

  |

  అఖిల్ సార్థక్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా అతడు అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు సినిమా వర్గాల్లోనూ హల్‌చల్ చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగించిన అతడు.. బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఇక, ఈ మధ్యనే మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎంపికై సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన లైవ్‌లో మోనాల్ గురించి అఖిల్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో అతడు కూడా అనుకోని విధంగా ఆన్సర్ ఇచ్చి షాక్‌కు గురి చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  మోడల్ నుంచి యాక్టర్‌గా మారాడు

  మోడల్ నుంచి యాక్టర్‌గా మారాడు

  హీరో అవ్వాలన్న లక్ష్యంతో ముందుగా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించాడు అఖిల్ సార్థక్. ఈ క్రమంలోనే ఎన్నో పోటీల్లో పాల్గొన్నాడు. అలా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడే ‘బావ మరదలు' అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ కెరీర్‌ మొదలెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేశాడు. అలాగే, ‘కల్యాణీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైనా ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్‌ చాన్స్ అందుకున్నాడు.

  మోనాల్‌ ట్రాక్‌తో ఫేమస్... రన్నరప్

  మోనాల్‌ ట్రాక్‌తో ఫేమస్... రన్నరప్

  గత ఏడాది జరిగిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ సార్థక్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన అతడు.. ఆరంభంలోనే మోనాల్ గజ్జర్‌తో ప్రేమాయణం సాగించి ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత హౌస్‌లో ఆమెతో రొమాన్స్ చేస్తూ తెగ హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో గ్రాండ్ ఫినాలేకు చేరుకుని రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

  బయట రచ్చ చేస్తున్న అఖిల్ సార్థక్

  బయట రచ్చ చేస్తున్న అఖిల్ సార్థక్

  బిగ్ బాస్ షోలో గెలవకున్నా.. బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్ తెగ హల్‌చల్ చేస్తున్నాడు. కెరీర్ పరంగా ముందడుగులు వేసిన అతడు.. మోనాల్ గజ్జర్‌తో మాత్రం ప్రేమను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తరచూ ఆమెను కలుస్తున్నాడు. ఇక, పర్సనల్‌ లైఫ్‌లో భాగంగానే ఇటీవలే ఓ కారుతో పాటు బైక్‌ను కూడా కొనుగోలు చేసి దూసుకుపోతున్నాడీ స్టార్ బాయ్.

  వెబ్ సిరీస్‌ను ప్రకటన.. స్టార్ట్ కాలేదు

  వెబ్ సిరీస్‌ను ప్రకటన.. స్టార్ట్ కాలేదు

  బిగ్ బాస్ షో తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అఖిల్ సార్థక్.. గత ప్రేమికుల రోజున మోనాల్ గజ్జర్‌తో కలిసి ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కించనున్నారు. ఇది ఎప్పుడో ప్రకటించినా ఇంకా మొదలవలేదు. దీనికి కారణం ఇద్దరి మధ్య డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే.

  హీరోగా ఫస్ట్ మూవీ... కరోనాతో బ్రేక్

  హీరోగా ఫస్ట్ మూవీ... కరోనాతో బ్రేక్

  అఖిల్ సార్థక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మేరకు ఉగాది పండుగ రోజున తన మొదటి సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను వదిలాడు. ఈ చిత్రానికి ‘ఫస్ట్ టైమ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అఖిల్ వైలెంట్‌గా కనిపించాడు. ఐ హేమంత్ నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అనిక విక్రమన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు శ్రీ వెంకట్ సంగీతం అందిస్తున్నాడు.

  మోనాల్ గురించి అఖిల్‌కు ప్రశ్నలు

  మోనాల్ గురించి అఖిల్‌కు ప్రశ్నలు

  హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ జాబితాలో అఖిల్ సార్థక్ టీవీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జోష్‌లో ఉన్న అతడు తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఇందులో భాగంగానే అతడికి ఎక్కువగా మోనాల్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
  లోపల చేయి పెట్టి చూపించిన అఖిల్

  లోపల చేయి పెట్టి చూపించిన అఖిల్

  ఈ సెషన్‌లో ఓ నెటిజన్ ‘మోనాల్ గజ్జర్ గురించి ఒక పదం చెప్పండి' అని అడిగాడు. దీనికి అఖిల్ సార్థక్ ఏమీ మాట్లాడకుండానే తన చేతులతో లవ్ సింబల్ చూపించాడు. ఆ తర్వాత మరో నెటిజన్ ‘మోనాల్ దీదీ ఎక్కడ ఉంది' అని అడడగా.. ఏమాత్రం తడబడకుండా అఖిల్ తన బనియన్‌లో చేయి పెట్టి హృదయంలో ఉంది అన్నట్లుగా చూపించాడు. దీంతో తన ప్రేమను ఇలా వ్యక్త పరిచాడు.

  English summary
  Tollywood Hero, Bigg Boss Fame Akhil Sarthak Very Active in Social Media. Now he Revealed Love on Monal Gajjar in Instagram Live.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X