మోనాల్‌కు ఊహించని కానుక ఇచ్చిన అఖిల్: ముద్దులు పెడుతూ.. అలా బయట పెట్టిన హీరోయిన్

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అలాంటిది అందులో హైలైట్ అయ్యేలా ప్రేమ వ్యవహారాలు నడిపితే మాత్రం మరింత ఎక్కువగా పాపులర్ అవుతున్నారు. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది క్రేజ్‌ను అందుకున్నారు. అందులో మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. షోలో తమ ప్రేమతో రచ్చ రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోనాల్‌కు అఖిల్ ఊహించని కానుకను ఇచ్చాడు. దీంతో అమ్మడు ముద్దులిచ్చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా మొదలైన ట్రాక్.. ఇలా కుదిరిపోయింది

అలా మొదలైన ట్రాక్.. ఇలా కుదిరిపోయింది

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. మొదట అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం మొదలెట్టింది. దీంతో ఈ ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మోనాల్.. అఖిల్‌కు మాత్రం మరింత దగ్గరైపోయింది.

లవ్ ట్రాకుతో ఫేమస్.. హగ్గులు, ముద్దులతో

లవ్ ట్రాకుతో ఫేమస్.. హగ్గులు, ముద్దులతో

మొదటి విభిన్నమైన వ్యవహార శైలితో కనిపించిన మోనాల్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌ ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడంతో పాటు పొగుడుకోవడం వంటివి చేసింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. తద్వారా ఆమె హైలైట్ అయింది.

బిగ్ బాస్ ఎఫెక్ట్... ఆమెకు అలా... అతడిలా

బిగ్ బాస్ ఎఫెక్ట్... ఆమెకు అలా... అతడిలా


బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించాడు.

హౌస్‌లో చేసినట్లే బయట కూడా హల్‌చల్

హౌస్‌లో చేసినట్లే బయట కూడా హల్‌చల్

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

లవర్స్ డే రోజున చెప్పి బిగ్ బాస్ ప్రేమ జంట

లవర్స్ డే రోజున చెప్పి బిగ్ బాస్ ప్రేమ జంట

లవర్స్ డేను పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అది ఆకట్టుకుంది.

మోనాల్‌కు ఊహించని కానుక ఇచ్చిన అఖిల్

మోనాల్‌కు ఊహించని కానుక ఇచ్చిన అఖిల్


బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ తరచూ కలుస్తూనే ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏదో రకంగా సర్‌ప్రైజ్ చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన వీడియోలనో, ఫొటోలనో సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అఖిల్.. మోనాల్‌కు ఓ గిఫ్ట్ ఇచ్చిన విషయం లీకైంది.

Recommended Video

Radhe రిలీజ్ డేట్ ఫిక్స్,OTT లో కూడా | Salman Khan || Filmibeat Telugu
ముద్దులు పెడుతూ.. అలా బయట పెట్టిందిగా

ముద్దులు పెడుతూ.. అలా బయట పెట్టిందిగా

మోనాల్ గజ్జర్‌కు ఆమె ఫొటోనే గిఫ్టుగా ఇచ్చాడు అఖిల్. దానితో సెల్ఫీ దిగిన ఆమె.. 'ఈ ఏడాదికి అత్యుత్తమమైన కానుక. ఓ మై గాడ్.. ఫొటోలో ఉన్న అమ్మాయి ఎంతో అందంగా ఉంది' అంటూ మేటర్ రివీల్ చేయడంతో పాటు ఆమెను ఆమె పొగుడుకుంది. అంతేకాదు, ఈ పోస్టులో అఖిల్‌కు ముద్దులిచ్చే ఎమోజీని జత చేసింది. దీన్నే అతడు కూడా తన స్టోరీలో పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X