For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మోనాల్‌పై అఖిల్ సంచలన వ్యాఖ్యలు: డ్రామాలు అంటూ ఆ ఫొటో లీక్.. ఇద్దరి మధ్యా ఏం జరిగిందబ్బా!

  |

  బిగ్ బాస్ షో తెలుగులో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలు అయిపోయారు. అందులో కొందరు మాత్రం ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ఈ జాబితాలోకే వస్తారు నటి మోనాల్ గజ్జర్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్. వీళ్లిద్దరూ ఇంత ఫేమస్ అవడానికి లవ్ ట్రాక్ నడపడం కారణమన్న విషయం తెలిసిందే. కొంత కాలంగా జంటగా హల్‌చల్ చేస్తోన్న వీళ్లు.. సోషల్ మీడియాలోనే ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మోనాల్‌పై అఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  అలా కలిశారు.. ప్రేమలో పడ్డారు

  అలా కలిశారు.. ప్రేమలో పడ్డారు

  బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా గత ఏడాది జరిగిన నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చారు ప్రముఖ నటి మోనాల్ గజ్జర్.. మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ సార్థక్. ఆరంభంలో దూరంగా ఉన్న వీళ్లిద్దరూ క్రమంగా దగ్గరయ్యారు. చూపులు, మాటలు, మనసులు కలుపుకున్నారు. అలా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

  హగ్గులు, కిస్సులతో అక్కడ రచ్చ

  హగ్గులు, కిస్సులతో అక్కడ రచ్చ

  సీజన్ ఆరంభంలో పెద్దగా కలిసినట్లు కనిపించని మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయారు. ఎప్పుడూ కలిసే ఉంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆడుతూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో గొడవల్లో భాగం అయ్యారు. ఇక, రొమాంటిక్ యాంగిల్‌ను చూపిస్తూ.. అప్పుడప్పుడూ ముద్దులు, హగ్గులతో ప్రేమను పండిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

  షో తర్వాత ఇద్దరూ ఫుల్ బిజీగా

  షో తర్వాత ఇద్దరూ ఫుల్ బిజీగా

  బిగ్ బాస్ షో ద్వారా అటు అఖిల్ సార్థక్.. ఇటు మోనాల్ గజ్జర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ మూవీని ప్రకటించడంతో పాటు మరోసారి డిజైరబుల్ మ్యాన్‌గా సెలెక్ట్ అయ్యాడు.

  ప్రేమ విషయంలో తగ్గేదే లేదుగా

  ప్రేమ విషయంలో తగ్గేదే లేదుగా

  బిగ్ బాస్ హౌస్‌లో జంటగా దాదాపు 13 వారాల పాటు హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా హైలైట్ అవుతూనే వస్తోంది.

   జంటగా సిరీస్.. అందుకే ఆలస్యం

  జంటగా సిరీస్.. అందుకే ఆలస్యం

  ఈ ఏడాది వాలంటైన్స్‌డేన అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే, అనివార్య కారణాల వల్ల ఇది ఇంకా ప్రారంభం కాలేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు.

  మోనాల్‌పై అఖిల్ సంచలన వ్యాఖ్యలు

  మోనాల్‌పై అఖిల్ సంచలన వ్యాఖ్యలు

  అఖిల్ సార్థక్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తుంటాడు. ఈ మధ్య కాలంలో మోనాల్ గజ్జర్‌తో ఉన్న వాటిని ఎక్కువగా షేర్ చేసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెడుతూ మోనాల్‌పై అఖిల్ సార్థక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  Bigg Boss 4 Contestant Monal Gajjar In Dance Reality Show || Filmibeat Telugu
  డ్రామాలంటూ ఫొటో లీక్.. ఏం జరిగింది

  డ్రామాలంటూ ఫొటో లీక్.. ఏం జరిగింది

  అఖిల్, మోనాల్ తాజాగా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన అతడు.. ‘హాహా క్యూటీ.. ఏమైంది నీకు? డ్రామా క్వీన్' దానిపై రాసుకొచ్చాడు. దీనికితోడు ఈ పిక్‌లో మోనాల్ ఎంతో కోపంగా ఉంది. దీంతో వీళ్లిద్దరి మధ్య ఏమైందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.

  English summary
  Tollywood Hero, Bigg Boss Fame Akhil Sarthak Very Active in Social Media. Now He Talked Monal Gajjar in Video Call. Then he shared Screeshots of this Call and did Sensational Comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X