అభిజిత్‌తో క్లోజ్‌గా ఎందుకుంటున్నావ్.. సోహెల్‌కు అఖిల్, మోనాల్ షాక్
బిగ్‌బాస్ ఇంటిలో గత 12 వారాల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన సభ్యుల్లో ఎవరు ఉత్తమ కెప్టెన్.. ఎవరు చెత్త కెప్టెన్ అనే విషయాన్ని తేల్చాల్సిందని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచించారు. ఆ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రధానంగా అఖిల్, అభిజిత్ మధ్య గొడవ భారీగానే జరిగింది. కేవలం కష్టపడకుండానే నీకు అదృష్టం కొద్ది కెప్టెన్సీ లభించిందని అభిజిత్ చేసిన వ్యాఖ్యలపై అఖిల్ తీవ్రంగా స్పందించాడు. ఈ క్రమంలో 82వ రోజు అర్ధరాత్రి సోహెల్‌తో అఖిల్ మాట్లాడుతూ...

అదృష్టం కొద్ది కెప్టెన్సీ
నాకు అదృష్టం కొద్ది కెప్టెన్సీ లభించిందని అతడు (అభిజిత్) అనడం సరికాదు. నాలుగు రోజులు సీక్రెట్ రూమ్‌లో కష్టపడితే నాకు వాళ్లు కెప్టెన్సీ ఇచ్చారు. దానిని లక్కు అంటూ ఎలా చెబుతాడు ఆయన. ఆయన తీరు నాకు అర్ధం కావడం లేదు. లక్కు ఫేవర్ చేసిందంటే.. నీకు ఎందుకు కెప్టెన్సీ రాలేదు. కనీసం నేనైనా కెప్టెన్ అయ్యాను అంటూ అఖిల్ అన్నాడు.

ప్రతీసారి నన్ను తీసేసి పడేస్తున్నాడంటూ
ప్రతీసారి నన్ను ఆయన (అభిజిత్) తీసిపడేసినట్టు మాట్లాడుతుంటాడు. ప్రతీ దానికి ఎవడు పడుతాడు. ఏది అంటే అది నాతో అంటే పడటానికి ఎవరూ లేదు. నా పేరేంట్స్ రావడం వల్ల నాకు పనిష్‌మెంట్ రాలేదట. ఇలాంటి మాటలు అంటే ఒళ్లు మండుతుంది. నా విషయంలోనే ఇలా అతడు టార్గెట్ చేస్తుంటాడు అని అఖిల్ మండిపడ్డారు.

అభిజిత్‌తో సోహెల్ ఎందుకు క్లోజ్‌గా
ఇన్ని రోజులు నీతో అతను (అభిజిత్) క్లోజ్‌గా లేడు. ఇప్పుడెందుకు నీతో క్లోజ్‌గా ఉంటున్నాడు. అదే విషయాన్ని మోనాల్ కూడా అడుగుతున్నది. అయితే సోహెల్ బుద్ది ఎక్కడ పోయిందో అర్ధం కావడం లేదని చెప్పా. నేను ఆ విషయాన్ని నీతో అడుగని చెప్పా. అభిజిత్ క్లోజ్‌గా ఉండటం నాకు నచ్చడం లేదని అని అఖిల్ చెప్పాడు.
Recommended Video

అభిజిత్‌తో దోస్తిపై సందేహాలు అంటూ అఖిల్
అభిజిత్‌తో నీవు క్లోజుగా ఉండటంపై నాకు చాలా సందేహాలు వస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు అతడితో రిలేషన్. ఆ దోస్తి ఎందుకు? సోహెల్ కళ్లు ఎక్కడపోయాయని మోనాల్ నన్ను అడుగుతున్నది. నాకు కూడా నీ వ్యవహారం నచ్చడం లేదు. నేను కూడా చూస్తున్నాను. ఇక నీ ఇష్టం అంటూ అఖిల్ అన్నాడు. దాంతో నేను కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాను. కాబట్టి అభిజిత్‌తో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటున్నాను. ఒకవేళ నాతో సరిగా ఉండకపోతే నా దారి నేను చూసుకొంటాను అని సోహెల్ అన్నాడు.


Click it and Unblock the Notifications











