అభిజీత్‌ను అడిగినా స్పందించలేదు.. ఆమె అలా చేసింది: బిగ్ బాస్ విన్నర్‌పై అఖిల్ షాకింగ్ కామెంట్స్

దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతున్నా.. తెలుగులోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. రియాలిటీ షోగా పరిచయం అయిన ఇది.. మన దగ్గర ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు, ఒక దానిని మించి మరొకటి రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు సాగాయి. ఇక, ఇటీవల ముగిసిన నాలుగో సీజన్‌ మరింత ఎక్కువ మజానే పంచింది. ఇందులో అభిజీత్ - అఖిల్ సార్థక్ మధ్య వార్ ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీళ్లిద్దరూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో విన్నర్‌పై రన్నర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
మోనాల్ గజ్జర్ ప్రేమలో ఆ ఇద్దరు

మోనాల్ గజ్జర్ ప్రేమలో ఆ ఇద్దరు


ఈ సీజన్‌లో మోనాల్ గజ్జర్ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. ఆమె మొదట్లో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అప్పుడంతా వాళ్లిద్దరూ లవర్స్ అని ఫిక్సయ్యారు. కానీ, అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం మొదలెట్టింది. దీంతో ఈ ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని అనిపించింది. నిర్వహకులు కూడా దీన్ని హైలైట్ చేశారు.

గొడవలకు కారణం ఆ కంటెస్టెంటే

గొడవలకు కారణం ఆ కంటెస్టెంటే

నాలుగో సీజన్ ఆరంభంలో అందరు కంటెస్టెంట్లలాగే హాయ్ అంటే హాయ్.. బాయ్ అంటే బాయ్ అన్నట్లు ఉండేవాళ్లు అభిజీత్.. అఖిల్ సార్థక్. అయితే, హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం మారింది. తనకు ఆమె దూరం అయినప్పటి నుంచి అభిజీత్ మాట్లాడడం మానేశాడు. అప్పటి నుంచి అఖిల్ కూడా అతడికి దూరమయ్యాడు. ఇలా ఇద్దరి మధ్య వార్ మొదలైంది.

చివరి వరకూ కొనసాగిన కోల్డ్ వార్

చివరి వరకూ కొనసాగిన కోల్డ్ వార్

మోనాల్ గజ్జర్‌తో అభిజీత్ మాట్లాడడం లేదని, ఆమెను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ అఖిల్ సార్థక్ తరచూ గొడవలకు దిగుతుండేవాడు. ఒకానొక సందర్భంలో వీళ్ల మధ్య వార్ మరింత ఎక్కువైంది. దీంతో హోస్ట్ నాగార్జున సైతం వారిని మందలించాడు. సీజన్ ముగిసే వరకూ అఖిల్ - అభిజీత్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే వచ్చిందన్న విషయం తెలిసిందే.

ఫలితం మాత్రం ఊహించినట్లుగానే

ఫలితం మాత్రం ఊహించినట్లుగానే


ఈ సీజన్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపై మధ్యలోనే ప్రేక్షకులందరికీ క్లారిటీ వచ్చింది. అయితే, హౌస్‌లోని కంటెస్టెంట్లకు మాత్రం ఈ విషయం తెలియదు. అందుకే అఖిల్ సార్థక్.. ‘నేనే నెంబర్ వన్.. నేనే గెలుస్తా' అంటూ కామెంట్లు చేసేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో అభిజీత్ బిగ్ బాస్ టైటిల్‌ను ఎగరేసుకుని పోగా, అఖిల్ మాత్రం రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బిగ్ బాస్ విన్నర్‌పై అఖిల్ కామెంట్స్

బిగ్ బాస్ విన్నర్‌పై అఖిల్ కామెంట్స్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత టాప్ -5 కంటెస్టెంట్లు అందరూ ఫుల్ బిజీ అయిపోయారు. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో తీరిక లేకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అఖిల్ సార్థక్ తాజాగా ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్ వ్యవహారం గురించి మాట్లాడుతూ సీజన్ విన్నర్ అభిజీత్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు.

అభిజీత్‌ను అడిగినా స్పందించలేదు

అభిజీత్‌ను అడిగినా స్పందించలేదు

గొడవ గురించి మాట్లాడుతూ.. ‘నేను అభిజీత్‌తో చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశా. ఆయనే అంతగా రియాక్ట్ అవలేదు. అలాగే, మోనాల్‌ ఇష్యూనూ క్లియర్ చేయడానికి ప్రయత్నించా. ఆమె కూడా మాట్లాడతా అని చెబితే.. అతడిని అడిగా. దీనికి నాకు టైమ్ కావాలి అన్నాడు. ఆ తర్వాత మాత్రం దానిపై స్పందించలేదు. దీంతో వాళ్ల మధ్య దూరం అలా ఉండిపోయింది' అని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X