మోనాల్ ఎక్కడికి వెళ్లినా అవే చూస్తారు.. అందుకే జాకెట్ వేసుకునే ఉంటుంది: అఖిల్ షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై వివాదాస్పదం అయినప్పటికీ.. సంచలనాలకు చిరునామాగా మారింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. దీనికి కారణం ఆ షో క్రియేట్ చేస్తోన్న రికార్డులతో పాటు అందులో జరిగే ఎన్నో ఊహించని సంఘటనలే అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా హౌస్‌లో కనిపించే ప్రేమ కహానీల కారణంగా ఈ షోకు ప్రేక్షకాదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇప్పటికే ఎన్నో జంటలు పాపులర్ అయ్యాయి. అందులో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో రచ్చ చేసిన ఈ జంట.. బిగ్ బాస్ ఉత్సవంలోనూ రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

ఒకేసారి ఇద్దరితో.. అలా ఫేమస్ అయ్యారు

ఒకేసారి ఇద్దరితో.. అలా ఫేమస్ అయ్యారు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కొన్ని లవ్ ట్రాకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిలో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. వాస్తవానికి వీళ్లిద్దరూ షో ఆరంభంలో పెద్దగా కలిసింది లేదు. దీనికి కారణం మోనాల్.. మొదట్లో అభిజీత్‌తో సన్నిహితంగా ఉండేది. అప్పుడే అఖిల్‌తోనూ సన్నిహితంగా ఉంది. దీంతో ట్రయాంగిల్ లవ్‌గా ఇది ప్రచారం జరగడంతో బాగా ఫేమస్ అయ్యారు.

వ్యక్తిగత ఆట అనే విషయాన్ని మరిచారు

వ్యక్తిగత ఆట అనే విషయాన్ని మరిచారు


బిగ్ బాస్ షో అనేది ఒంటరిగా ఆడే రియాలిటీ గేమ్. కానీ, హౌస్‌లో లవ్ ట్రాకు మొదలైన తర్వాత ఎంతో మంది జంటగా ఆడుతూ వార్తల్లో నిలిచారు. గత సీజన్‌లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ కూడా ఇదే ఫాలో అయ్యారు. హౌస్‌లో ఒంటరిగా కాకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. టాస్కుల్లో సహాయం చేసుకోవడం, నామినేషన్స్‌లో త్యాగాలు చేయడం వంటివి చేశారు.

హౌస్‌లో రచ్చ రచ్చ.. ముద్దులు, హగ్గులు

హౌస్‌లో రచ్చ రచ్చ.. ముద్దులు, హగ్గులు

హోస్ట్ అక్కినేని నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం గురించే మాట్లాడుకునేవారు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ తరచూ హైలైట్ అయ్యేవారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు.

బయట కూడా కలుస్తూనే.. ఎక్కడైనా వీళ్లే

బయట కూడా కలుస్తూనే.. ఎక్కడైనా వీళ్లే


బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

క్రేజీ జంటను మరోసారి కలిపిన బిగ్ బాస్

క్రేజీ జంటను మరోసారి కలిపిన బిగ్ బాస్

బుల్లితెర చరిత్రలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. నాలుగో సీజన్ అత్యధిక రేటింగ్‌తో నేషనల్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఉత్సవం పేరిట స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి కంటెస్టెంట్లు అందరూ హాజరయ్యారు. ఇందులో అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ క్రమంలోనే ప్రేమను చూపించారు.

మోనాల్ ఎక్కడికి వెళ్లినా అవే చూస్తారు

మోనాల్ ఎక్కడికి వెళ్లినా అవే చూస్తారు

బిగ్ బాస్ ఉత్సవంలో కంటెస్టెంట్లు అందరూ నచ్చిన వాళ్లకు కానుకలు తీసుకు వచ్చారు. ఇందులో అఖిల్ సార్థక్.. సయ్యద్ సోహెల్ రియాన్‌కు షూ ఇచ్చాడు. ఆ తర్వాత మోనాల్ గజ్జర్‌కు పట్టీలను తీసుకొచ్చాడు. అంతేకాదు, తాను మోకాళ్లపై కూర్చుని ఆమెకు స్వయంగా అలంకరించాడు. ఆ తర్వాత అతడు మాట్లాడుతూ.. 'మోనాల్ ఎక్కడికి వెళ్లినా ఇవే చూస్తారు' అన్నాడు.

అందుకే ఎప్పుడూ జాకెట్ వేసుకుంటుంది

అందుకే ఎప్పుడూ జాకెట్ వేసుకుంటుంది

ఇదే ఈవెంట్‌లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్ సార్థక్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'ఆమె ఎక్కడికి వెళ్లినా ఒక జాకెట్ వేసుకుంటుంది. ఎందుకంటే అది గిఫ్టుగా వచ్చింది' అని చెప్పుకొచ్చాడు. మధ్యలో కలుగజేసుకున్న యాంకర్ శ్రీముఖి.. 'నువ్వు పట్టీలు పెట్టావు కదా.. ఇకపై మోనాల్ కాళ్లనే చూస్తారు' అని అదిరిపోయే పంచ్ విసిరింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X